శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఇన్యాస్ 9వ వార్షిక సాధారణ సభ్య సమావేశం
సమాజాభివృద్ధిలో శాస్త్రీయ సమాచార నైపుణ్యం అవసరం గురించి మాట్లాడిన సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌పీఆర్‌సీ డైరెక్టర్
Posted On:
18 FEB 2024 8:57PM by PIB Hyderabad
'ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్' (ఇన్యాస్) 9వ వార్షిక సాధారణ సభ్య సమావేశం న్యూదిల్లీలో నిన్న జరిగింది. 'సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ & పాలసీ రీసెర్చ్' (సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌పీఆర్‌సీ) డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు, సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌పీఆర్‌సీ ముఖ్య లక్ష్యాలు & కార్యక్రమాల గురించి వివరించారు. సమాజంలో శాస్త్రీయ స్వభావాన్ని పెంచడానికి శాస్త్రీయ సమాచార నైపుణ్యం ఎంత కీలకమో ఆమె స్పష్టం చేశారు. ఇన్యాస్ వార్షిక న్యూస్‌లెటర్‌ను కూడా ఆమె ఆవిష్కరించారు.
యువ శాస్త్రవేత్తల్లో శాస్త్రీయ విద్య, సమాచార పంపిణీని ప్రోత్సహించే ఉద్దేశంతో, ఇన్యాస్‌ను 2014లో స్థాపించారు. దేశంలో గుర్తింపు పొందిన ఏకైక యువ శాస్త్రవేత్తల విద్యాసంస్థ ఇది. ఐదేళ్ల తొలి దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇన్యాస్, 2020 నుంచి కొత్త దశలోకి అడుగు పెట్టింది.
కేంద్ర శాస్త్ర & సాంకేతికత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్'కు (సీఎస్‌ఐఆర్) చెందిన కీలక ప్రయోగశాలల్లో "సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ & పాలసీ రీసెర్చ్" ఒకటి. శాస్త్రీయ సమాచార నైపుణ్యం, ఎస్‌టీఐ ఆధారిత విధాన పరిశోధన, అధ్యయనాలు దీని ప్రత్యేకత. శాస్త్ర, సాంకేతికతలపై వివిధ పత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్‌లు, న్యూస్‌లెటర్లు, నివేదికలను ప్రచురిస్తుంది. మరింత సమాచారం కోసం https://niscpr.res.in/ లింక్‌లో చూడండి లేదా ఎక్స్‌లో @CSIR_NIScPR Facebook: CSIR NISCPR-OFFICIAL PAGE Instagram: csr_niscpr ను అనుసరించండి.
***
(Release ID: 2007012)
Visitor Counter : 124