కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ సెంటర్ ఫర్ డబ్ల్యూ టీ ఓ స్టడీస్ భాగస్వామ్యంతో వాటాదారులందరినీ ఒక చోట చేర్చే ప్రత్యేక చొరవ


డబ్ల్యూ టీ ఓ సమస్యలు మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికాం సెక్టార్‌పై వర్క్‌షాప్: ఐ టీ ఏ -1 మరియు ఐ టీ ఏ- ఈ మరియు డబ్ల్యూ టీ ఓ వివాదాలు

Posted On: 17 FEB 2024 8:35PM by PIB Hyderabad

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ (ఎన్ ఐ సి ఎఫ్ ) మరియు సెంటర్ ఫర్ డబ్ల్యూ టీ ఓ  స్టడీస్ (సీ డబ్ల్యూ ఎస్), సీ ఆర్ ఐ టీ, ఐ ఐ ఎఫ్ టీ సంయుక్తంగా భారతదేశంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ టీ ఓ ) ఐ టీ ఏ -1 మరియు ఐ టీ ఏ- ఈ సమస్యలు మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికాం రంగంపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాయి. అంతర్జాతీయ వాణిజ్యం యొక్క సంక్లిష్ట అంశాలపై అవగాహన మరియు నైపుణ్యాన్ని పెంపొందించడానికి సహకార ప్రయత్నాన్ని లక్ష్యంగా చేసుకున్న వర్క్‌షాప్ ఈ రోజు ముగిసింది. ఈ వర్క్‌షాప్‌లో పలు సంఘాలు, విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు.

 

శ్రీ మనీష్ సిన్హా, సభ్యుడు (ఆర్థిక), టెలికమ్యూనికేషన్స్ విభాగం, ఎన్ ఐ సి ఎఫ్, ఘితోర్ని, న్యూ ఢిల్లీ లో రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. శ్రీ సిన్హా తన ప్రారంబోపన్యాసం లో, డబ్ల్యూ టీ ఓ  లో స్థానాలను బలోపేతం చేయడంపై నిర్దిష్ట దృష్టితో, క్లిష్టమైన చర్చల ప్రక్రియలను నిర్వహించడంలో యోగ్యత అంతరాన్ని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రతినిధులు మరియు డబ్ల్యూ టీ ఓ  నిపుణులు డబ్ల్యూ టీ ఓ  లో  వాణిజ్య సంబంధిత వాస్తవ  విషయాలపై మరియు టెలికాం పరికరాలలో పీ ఎల్ ఐ తయారీదారులు దేశం మరియు టెలికాం రంగానికి ఎలా ప్రాతినిధ్యం వహించాలనే దానిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

ప్రొఫెసర్ మురళి కల్లుమ్మల్, హెడ్ అడ్మినిస్ట్రేషన్ (సీ ఆర్ ఐ టీ) & ప్రొఫెసర్ (సీ డబ్ల్యూ ఎస్), "డబ్ల్యూ టీ ఓ  ఒప్పందాలు: నామా షెడ్యూలింగ్ మరియు ట్రాన్స్‌పొజిషన్ ట్రేడింగ్ కార్డ్‌ల సమస్యలకు ప్రత్యేక సూచన" మరియు ఐ టీ ఏ -1 మరియు ఐ టీ ఏ- ఈ విస్తరణకు సంబంధించిన భారతదేశ అనుభవాలను పంచుకున్నారు. డాక్టర్ ప్రీతమ్ బెనర్జీ, హెడ్ మరియు ప్రొఫెసర్ (సీ డబ్ల్యూ ఎస్ ), ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పై సెషన్‌ను నిర్వహించారు, పరిశ్రమ పోకడలు మరియు భారతదేశానికి వాటి ప్రభావం గురించి చర్చించారు.

 

శ్రీమతి శైలజా సింగ్, కన్సల్టెంట్ (సి టీ ఐ ఎల్ ), సీ ఆర్ ఐ టీ, ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా "డబ్ల్యూ టీ ఓ  యొక్క వివాద పరిష్కార వ్యవస్థ: డీ ఎస్ 582పై ప్రత్యేక దృష్టితో కూడిన ప్రక్రియ మరియు విధానాలు" గురించి వివరించారు.

 

రెండవ రోజు, నోయిడా ఎస్ ఈ జెడ్ డెవలప్‌మెంట్ కమీషనర్ శ్రీ బిపిన్ మీనన్, "నిర్దిష్ట ఎలక్ట్రానిక్ వస్తువులపై భారతదేశం యొక్క టారిఫ్ ట్రీట్‌మెంట్"పై అంతర్దృష్టులను పంచుకున్నారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచే లక్ష్యంతో  పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ ప్రతినిధుల కోసం ఒక సెషన్‌ను నిర్వహించారు.

 

వర్క్‌షాప్ ముగుంపు లో, శ్రీ బిపిన్ మీనన్, డాక్టర్ ప్రీతమ్ బెనర్జీ మరియు ప్రొఫెసర్ మురళీ కల్లుమ్మాళ్ "ప్రపంచం మరియు భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్ పరిశ్రమ యొక్క మొత్తం అంశాలు"పై ప్యానెల్ చర్చ మరియు ప్రశ్నోత్తరాల సెషన్ ద్వారా వారి దృక్కోణాలను పంచుకున్నారు.  తేజస్ నెట్‌వర్క్ లిమిటెడ్, శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూటౌన్ ఇండియా, వివిడిఎన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎంఎఐటి, యుఎస్‌పిఎఫ్‌టిఇతో సహా పరిశ్రమ సంఘాల వంటి పిఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) తయారీదారుల నుండి విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రతినిధులు, సంఘాలు మరియు విద్యావేత్తలను బహిరంగ మరియు నిర్మాణాత్మకమైన ఆలోచనల మార్పిడి కోసం ఒకచోట చేర్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం ద్వారా ఇలాంటి మరిన్ని ప్లాట్‌ఫారమ్‌ల ఆవశ్యకతను వాటాదారులు నొక్కిచెప్పారు. విధాన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడంలో మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడంలో ఇటువంటి సహకార చర్చలు తప్పనిసరి అని గుర్తించబడ్డాయి.

 

***



(Release ID: 2007008) Visitor Counter : 49


Read this release in: English , Urdu , Hindi