రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత నావికాదళం కోసం 11 శక్తి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లను కొనుగోలు చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)తో రక్షణ మంత్రిత్వశాఖ రూ.2269.54 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

Posted On: 13 FEB 2024 5:51PM by PIB Hyderabad

భారత నావికాదళం కోసం 11 శక్తి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లతో పాటు అనుబంధ పరికరాలు / ఉపకరణాల సేకరణ కోసం ఇండియన్- ఐడిడిఎం కొనుగోలు కేటగిరీ కింద  హైదరాబాద్ లోని  భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో రక్షణ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ  మొత్తం ఒప్పందం మొత్తం విలువ రూ.2269.54 కోట్లు.

శక్తి ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థ దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసి, తయారుచేయబడింది. శక్తి ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ఉద్గారాలను ఖచ్చితంగా అడ్డగించగలదు. అంతేకాకుండా దట్టమైన విద్యుదయస్కాంత వాతావరణంలో ప్రతిఘటనలను అమలు చేయగలదు.

శక్తి వార్ ఫేర్ సిస్టమ్‌ను భారత నావికాదళానికి చెందిన క్యాపిటల్ వార్‌షిప్‌లలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఎంఎస్ఎంఈలతో సహా 155 కంటే ఎక్కువ పరిశ్రమ భాగస్వాముల భాగస్వామ్యంతో నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండున్నర లక్షల పనిదినాల ఉపాధిని సృష్టిస్తుంది.

***

 


(Release ID: 2006955) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi