సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్ము కశ్మీర్ లోని కతువాలో "గావ్ చలో అభియాన్"లో చేరారు.


వరుసలో ఉన్న చివరి వ్యక్తికి చేరుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో గావ్ చలో అభియాన్ భాగమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

పేదలు, రైతులు, మహిళలు మరియు యువత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అంతేకాకుండా గత పదేళ్లుగా కుల, మత , రాజకీయ అనుబంధాల ఆధారంగా వివక్ష లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 13 FEB 2024 4:45PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన గావ్ చలో అభియాన్ లో చేరిన కేంద్ర శాస్త్రసాంకేతిక, పీఎంఓ, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేరారు. దేశంలోని వరుసలో ఉన్న చివరి వ్యక్తి వరకు చేరుకోవాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.

జమ్ము కశ్మీర్‌లోని కతువా జిల్లా పంచాయతీ నగ్రోటాలోని బర్నోటి బ్లాక్‌లో ప్రజాప్రతినిధులు, స్థానిక నివాసితులు, మహిళలతో మంత్రి జితేంద్ర సింగ్ సమావేశమయ్యారు.

గావ్ చలో అభియాన్ లో భాగంగా ప్రజలతో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని.. స్థానిక ప్రజలతో సమయం గడిపారు. వారి అభ్యర్థనలను స్వీకరించి, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..వరుసలో ఉన్న చివరి వ్యక్తిని చేరుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో భాంగానే గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మంత్రం భారతదేశ పౌరులకు ప్రభుత్వ సేవా స్ఫూర్తి గురించి తెలిజేస్తుందన్నారు. పేదలు, రైతులు, మహిళలు మరియు యువత అభివృద్ధికి భరోసా ఇవ్వడం ద్వారా భారతదేశ అభివృద్ధిని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా పనిచేస్తోందని చెప్పారు. కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం సేవలందిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.



అనంతరం ..  జిల్లాలోని బుద్ధిలోని ప్రభుత్వ ఉన్నత సెకండరీ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు.  అభ్యాసం మరియు స్టార్టప్ సామర్థ్యాలకు పూరకంగా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని విద్యార్థులను మంత్రి  ప్రోత్సహించారు. ఇది ఫోర్స్-మల్టిప్లైయర్ ప్రభావాన్ని కలిగి ఉందని చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో. సమాజ హితం కోసం, దేశాభివృద్ధి కోసం తమ శక్తియుక్తులను వినియోగించాలని సూచించారు.

యువతలో ఉత్సుకత, సృజనాత్మకత మరియు ఊహాశక్తిని పెంపొందించడానికి పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి పాఠశాల పరిపాలన విభాగాన్ని కోరారు. అదే తరహాలో.. జమ్ము కశ్మీర్ లో  జీవనోపాధికి ప్రత్యామ్నాయంగా మరియు లాభదాయకంగా మారుతున్న అగ్రి-స్టార్టప్‌లలో కెరీర్ ను మలుచుకోవాలని మంత్రి విద్యార్థులకు సూచించారు.

మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. స్థిరమైన జీవనం కోసం ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే పొందాలనే మనస్తత్వం మారుతున్నదని, వ్యవసాయ స్టార్టప్‌ల వంటి కొత్త మార్గాలు పుట్టుకొస్తున్నాయన్నారు. మధ్యస్థంగా చదువుకున్న వారు కూడా ఇప్పుడు జమ్ము కశ్మీర్ యొక్క ప్రఖ్యాత అరోమా మిషన్‌లో చేరిన తర్వాత చక్కగా సంపాదిస్తున్నారని, దీని కింద లావెండర్ సాగు దోడా జిల్లాలోని భాదేర్వా తహసీల్‌లో జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుందని, తద్వారా వేలాది మంది యువతకు జీవనోపాధి పొందే అవకాశాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. లావెండర్‌తో తయారు చేసిన పెర్ఫ్యూమ్‌లకు మంచి ధరలను దక్కుతున్నాయని, మిషన్‌తో అనుబంధించబడిన యువత చక్కని రాబడిని పొందగలుగుతున్నారని డాక్టర్ సింగ్ తెలిపారు.

***


(Release ID: 2006954) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Hindi