వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫోన్ వినియోగదారులకు వస్తున్న ఇబ్బందికర, ప్రమోషనల్, అయాచిత వాణిజ్య కాల్ల సమస్యను పరిష్కరించేందుకు తగిన మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.


ఇబ్బందికర, ప్రమోషనల్,అవాంఛిత వాణిజ్య కాల్స్ వినియోగదారుల గోప్యతను, హక్కులను ఉల్లంఘిస్తుంది: వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి.


వినియోగదారులు అందుకుంటున్న అవాంఛిత కాల్స్లో ఎక్కువ భాగం ఆర్ధికసేవలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవే ఉంటున్నాయి.

Posted On: 15 FEB 2024 5:34PM by PIB Hyderabad

 వినియోగదారుల ఫోన్లకు వస్తున్న ఇబ్బందికరప్రమోషనల్ లేదా అవాంఛిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు ,భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం ఒక కమిటీని నియమించింది. సెల్యులర్ పరిశ్రమ వర్గాలురెగ్యులేటరీ సంస్థలైన డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డిఓటి)డిపార్టమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్)హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖరిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డిఎ)డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డిఒటి)డిపార్టమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్)టెలికం రెగ్యులేగరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టి.ఆర్.ఎఐ) సెల్యులర్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఒఎఐ) టెలిమార్కెటింగ్ కంపెనీలువిసిఒలు ముసాయిదా మార్గదర్శకాల రూపకల్పన కమిటీలో ఉన్నాయి.

 డిపార్టమెంట్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన వినియోగదారుల విభాగం 2024  ఫిబ్రవరి 14న ఇందుకు సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఇబ్బందికరప్రమోషనల్అవాంఛిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించే అంశాన్ని చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

 

 

ఈ అభ్యంతరకర కాల్స్ వినియోగదారుల ప్రైవసీని ఉల్లంఘించడమే కాకవినియోగదారుల హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నాయని సమావేశం అభిప్రాయపడింది. ఇలాంటి కాల్స్ ఎక్కువ భాగం ఆర్ధిక సేవలరంగానికి ఆతర్వాత ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవిగా ఉంటున్నాయని సమావేశం అభిప్రాయపడింది. స్పామ్ కాలర్లు ఇటీవల ఇంటర్నెట్ కాల్స్ వైపు మళ్లుతున్నారని ప్రత్యేకిందిచచ వాట్సప్ కాల్ ల ద్వారా పోంజి స్కీములకు క్రిప్టో పెట్టుబడులకు ఉద్యోగ అవకాశాల పేరుతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది.

డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్,  టెలికం రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎఐ)లు రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల నుంచి స్పామ్ సందేశాలుఇబ్బందికర కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు కృషి ప్రారంభించాయి. ఈ సందేశాలు పంపే సంస్థలుపంపుతున్న వారి ఐడిలుడిఎల్టి ప్లాట్ఫారంపై ఎస్.ఎం.ఎస్ టెంప్లేట్స్ను తెలుసుకోవలసిందిగా టెలిమార్కెటీర్లకు సూచించడం జరిగింది.

 

డిఎల్టి ప్లాట్ఫారంలు ఆపరేటర్లు నిర్వహించే పోర్టల్స్. అంటే ఇవి ఎయిర్టెల్ఓడాఫోన్,జియోబిఎస్ఎన్ఎల్ వంటివి. ఇక్కడ వ్యాపారులు తమ వ్యాపార వివరాలతో నమోదు చేసుకోవలసి ఉంటుంది. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) బల్క్ ఎస్.ఎం.ఎస్ సర్వీసులకు సంబంధించి నూతన మార్గదర్శకాలను జారీచేసససింది. ఇందుకు సంబంధించి  డిఎల్టి (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ) బ్లాక్ చెయిన్ ఆధారిత రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది ఆయా వ్యాపార సంస్థలు పంపే సందేశాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను నమోదు చేస్తుంది. టిఆర్ఎఐ డిఎల్టి రెగ్యులేషన్ల లక్ష్యం వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం. ఎస్.ఎం.ఎస్ స్పామ్ల బెడదను నివారించడంమోసపూరిత సందేశాలుకాల్స్ నుంచి వినియోగదారులను రక్షించడం దీని లక్ష్యం.

 

ఈ సమావేశం సందర్భంగా వివిధ రంగాల నుంచి టెలిమార్కెటీర్లుఅంటే బ్యాంకింగ్ఫైనాన్షియల్ సర్వీసులురియల్ ఎస్టేట్ఈ కామర్స్ ప్లాట్ఫారంలుఇతర వాణిజ్య సంస్థలను తమ నెంబర్ సీరీస్లకు ముందు 140 అంకెలను చేర్చవలసిందిగా సూచించారు. దీనివల్ల వినియోగదారులు కాలర్ను గుర్తించడానికి వీలు  కలుగుతుది. దీనివల్ల సబ్స్క్రయిబర్లుఎలాంటి కాల్స్సందేశాలను తాము అందుకోవాలని అనుకుంటున్నామన్న దానిపై వారికి నియంత్రణ ఉంటుంది. వివిధ అన్ రజిస్టర్డ్ టెలిమార్కెటీర్లు ఈ ప్రొవిజన్లను పాటించరు. అందువల్ల ఈ సమావేశంలోటెలి మార్కెటీర్లు అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించేలా చూడాల్సిందిగా అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ సమావేశనికి డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్లు (డిఒటి)టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టి.ఆర్.ఎ.ఐ)సెల్యులర్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఒఎఐ)భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)ఓడాఫోన్ఎయిర్టెల్రిలయన్స్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 

***


(Release ID: 2006953) Visitor Counter : 68


Read this release in: English , Urdu , Hindi , Marathi