బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

బొగ్గు వాయువీకరణ పై పరిశ్రమల పరస్పర చర్చను బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది

Posted On: 16 FEB 2024 6:08PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా బొగ్గు/వాయువీకరణ ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఈరోజు హైదరాబాద్‌లో పరిశ్రమల పరస్పర చర్చను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా హాజరయ్యారు. ఈ కార్యక్రమం బొగ్గు/వాయువీకరణ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం ప్రభుత్వ పథకాన్ని హైలైట్ చేయడానికి వేదికయ్యింది.

భారతదేశం యొక్క ఇంధన రంగ మరియు ఆర్థిక అభివృద్ధిలో వారి కీలక పాత్రను నొక్కి చెప్పింది.

 

ప్రధానోపన్యాసం చేస్తూ, కార్యదర్శి (బొగ్గు) శ్రీ అమృత్ లాల్ మీనా, భారతదేశ ఇంధన భద్రతలో బొగ్గు యొక్క ప్రాముఖ్యతను మరియు దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు బొగ్గు దిగుమతుల్లో గణనీయమైన తగ్గుదలకు (2019లో 26% నుండి ఈ సంవత్సరం 19%కి - అంచనా వేయబడింది) దారితీసిన ప్రైవేట్ కంపెనీలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరించారు. భారతదేశ ఇంధన పరివర్తనలో బొగ్గు మరియు లిగ్నైట్ వాయువీకరణ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సులభతరమైన భూ లభ్యత, రుణాలు మరియు స్వచ్ఛ బొగ్గు సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు ఇంధన భద్రతను పెంపొందించే ప్రోత్సాహకాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం యొక్క  మద్దతును పునరుద్ఘాటిస్తూ, హరిత మరియు పరిశుభ్రమైన భవిష్యత్తు కోసం సాంకేతికతలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

 

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి & నామినేటెడ్ అథారిటీ శ్రీ ఎం. నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తూ దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో వాయువీకరణ ప్రాజెక్టుల ప్రాముఖ్యత మరియు సంభావ్యత గురించి అంతర్దృష్టిని అందించారు.

 

వాయువీకరణ రంగంలో సీ ఐ ఎల్  యొక్క చురుకైన కార్యక్రమాలు మరియు ప్రయత్నాల గురించి కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ పీఎం ప్రసాద్ వివరించారు. స్వచ్ఛ ఇంధన పరిష్కారాల వైపు పరివర్తన లో కీలక పాత్ర పోషించడంలో కంపెనీ పాత్రను నొక్కి చెబుతూ, ఆవిష్కరణ మరియు సుస్థిరత్వం పట్ల సీ ఐ ఎల్  యొక్క నిబద్ధతను ఆయన హైలైట్ చేశారు. మరింత పరిశుభ్ర భవిష్యత్తును నిర్మించడానికి మరియు 2070 నాటికి నికర సున్నా లక్ష్యాన్ని సాధించడంలో సహాయం చేయడానికి బొగ్గు వాయువీకరణలో ఉన్న అవకాశాల కోసం సీ ఐ ఎల్  తో భాగస్వామ్యం కావడానికి సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆసక్తిగల పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

 

పథకానికి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన ఎస్ బీ ఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శుభమ్ గోయెల్, బొగ్గు/వాయువీకరణ ప్రాజెక్ట్‌ల ప్రోత్సాహం కోసం పథకం యొక్క ముఖ్య అంశాలపై ఒక ప్రదర్శన ఇచ్చారు.

 

ముఖ్యోపన్యాసం అనంతరం పరిశ్రమ నిపుణులు వివిధ అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనల సందర్భంగా, బొగ్గు వాయువీకరణ లో అవకాశాలు, ఆర్ & డీ ప్రయత్నాలు, కార్బన్ సీక్వెస్ట్రేషన్‌తో అనుసంధానించబడిన బ్లూ హైడ్రోజన్ కోల్ వాయువీకరణ; హై యాష్ కోల్ వాయువీకరణ మరియు హై యాష్ కోల్ వాయువీకరణలో మరిన్ని అవకాశాల కోసం ఆర్ & డీ గురించి నిపుణులు  మాట్లాడారు.

 

ఈ పథకంపై పరిశ్రమ వారి అభిప్రాయాలను సమర్పించింది, దీనిని బొగ్గు మంత్రిత్వ శాఖ అంగీకరించింది, వారు త్వరలోనే వాటాదారుల వ్యాఖ్యలు/అభిప్రాయాల కోసం పబ్లిక్ ఫోరమ్‌లో పథకం కోసం ఆర్ ఎఫ్ పీ ని ఉంచుతారని హామీ ఇచ్చారు.

 

శ్రీ అమృత్ లాల్ మీనా, కార్యదర్శి (బొగ్గు) తన ముగింపులో, భాగస్వామ్యాలను పెంపొందించడం, ఆవిష్కరణలు మరియు బొగ్గు రంగంలో సుస్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క చురుకైన విధానాన్ని మరింత నొక్కిచెప్పారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా మరియు బహిరంగంగా చేయడానికి పరిశ్రమ వాటాదారులందరూ ముందుకు వచ్చి ఆర్ ఎఫ్ పీ ప్రక్రియలో పాల్గొనాలని మరియు వారి విలువైన సూచనలను పంచుకోవాలని ఆయన అభ్యర్థించారు.

 

బొగ్గు రంగంలో నూతన ఆవిష్కరణలు మరియు సుస్థిరతను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రదర్శించింది. వ్యూహాత్మక కార్యక్రమాలు మరియు విధాన చట్రాల ద్వారా, బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు/వాయువీకరణ ప్రాజెక్టులలో పెట్టుబడులు మరియు సాంకేతిక పురోగమనాలను ఉత్ప్రేరకపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశుభ్రమైన మరియు ఇంధన-సమర్థవంతమైన భవిష్యత్తు కోసం భారతదేశం యొక్క దృష్టికి ఇది అనుగుణంగా ఉంటుంది.

***



(Release ID: 2006715) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Hindi