కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కార్పొరేట్ ఫైలింగ్స్ కేంద్రీకృత (సెంట్రలైజ్డ్) ప్రాసెసింగ్ కోసం సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్(సిపిసి) ను నిర్వహిస్తున్న ఎం సి ఎ
16.02.2024 నుండి సిపిసి వద్ద 12 ఫారాలు / దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు: తరువాత 01.04.2024 నుండి ఇతర ఫారాల ప్రాసెసింగ్
సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్ (సీఆర్ సీ), సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీ-పేస్) తరహాలో నిర్ణీత కాలవ్యవధిలో, ఫేస్ లెస్ పద్ధతిలో దరఖాస్తులను ప్రాసెస్ చేయనున్న సి పి సి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఎంసిఎ తీసుకున్న స్థిరమైన ప్రయత్నాల కారణంగా, 14.02.2020 నాటికి మునుపటి ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఎల్ ఎల్ పి లు కంపెనీల విలీనం అత్యధికం
Posted On:
16 FEB 2024 2:15PM by PIB Hyderabad
2023-224 కేంద్రబడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందించడానికి నిరంతర ప్రయత్నం తరహాలో, కంపెనీల చట్టం , లిమిటెడ్ లయబిలిటీ పార్ట్ నర్ యాక్ట్ (ఎల్ఎల్ పి యాక్ట్) కింద వివిధ నియంత్రణ అవసరాలలో భాగంగా దాఖలు చేసిన ఫారాలను వాటాదారులతో నేరుగా ముఖాముఖి అవసరం లేకుండా కేంద్రీకృత పద్ధతిలో ప్రాసెస్ చేయడానికి సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సిపిసి) ఏర్పాటు అయింది.
16.02.2024 నుండి, దిగువ జాబితా చేయబడిన 12 ఫారాలు / దరఖాస్తులు సిపిసి వద్ద ప్రాసెస్ చేయబడతాయి, తరువాత 01.04.2024 నుండి ఇతర ఫారాలు ప్రాసెస్ చేయబడతాయి. తరువాత, ఎల్ ఎల్ పి చట్టం కింద దాఖలు చేసే ఫారాలు / దరఖాస్తులను కూడా కేంద్రీకృతం చేయాలని ప్రతిపాదించారు. ఫైలింగ్ ట్రెండ్స్ ఆధారంగా, ఇది పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత సిపిసి ద్వారా ఏటా సుమారు 2.50 లక్షల ఫారాలను ప్రాసెస్ చేస్తారని భావిస్తున్నారు.
|
|
|
తీర్మానాలు, ఒప్పందాలను దాఖలు చేయడం
|
|
|
|
|
|
ఒక వ్యక్తి కంపెనీని ప్రైవేట్ లేదా పబ్లిక్ లేదా ప్రైవేట్ లేదా ప్రైవేట్ నుంచి ఒ పి సి కి మార్చడం
|
|
ప్రైవేట్ నుంచి పబ్లిక్ లేదా వైస్ వెర్సాగా మార్చడం
|
|
చట్టంలోని సెక్షన్ 8 కింద లైసెన్స్ రద్దు/సరెండర్
|
|
|
|
నిద్రాణమైన కంపెనీ హోదా పొందడానికి దరఖాస్తు
|
|
యాక్టివ్ కంపెనీ హోదా కోసం దరఖాస్తు
|
|
బై-బ్యాక్ కోసం ఆఫర్ లెటర్
|
|
|
|
సెక్యూరిటీల బై బ్యాక్ కు సంబంధించి రిటర్న్
|
కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 4,910 ఫారాలు సీపీసీకి అందాయి. ఫారాలు సమయానుకూలంగా, ముఖరహితంగా ప్రాసెస్ చేయబడతాయి. సిఆర్ సి, సి-పేస్ వద్ద దరఖాస్తుల ప్రాసెసింగ్ కు వాటాదారులతో ఎటువంటి భౌతిక ముఖాముఖి అవసరం లేదు.
సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్ (సిఆర్ సి), సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సి-పేస్) , సిపిసిలు విలీనం, మూసివేత, నియంత్రణ అవసరాలను తీర్చడానికి దాఖలు చేసిన దరఖాస్తులు, ఫారాలను వేగంగా ప్రాసెసింగ్ చేసేలా చూస్తాయి, తద్వారా కంపెనీలు విలీనం చేయబడతాయి, మూసివేయబడతాయి, మార్చగలవు.మూలధనాన్ని సమీకరించగలవు. కార్పొరేట్ చట్టాల కింద వారి వివిధ షరతులను సులభంగా పూర్తి చేయగలవు.
సిపిసి ఏర్పాటు తరువాత, న్యాయపరిధి గల రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసి) పటిష్టమైన కార్పొరేట్ పాలనను నిర్ధారించడానికి విచారణలు, తనిఖీ, దర్యాప్తు వంటి వాటి ప్రధాన విధులపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దిశగా మరిన్ని అడుగులు
గత చాలా ఏళ్లుగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దిశగా పలు చర్యలు చేపట్టింది.
కంపెనీలను త్వరితగతిన విలీనం చేసే విషయంలో ప్రవేశాన్ని సులభతరం చేసే దిశగా తీసుకున్న చర్యలు ఇ ఒ డి బి లో ఒక ముఖ్యమైన భాగం. నాన్ ఎస్ టి పి (స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్) విధానంలో కంపెనీలు, ఎల్ ఎల్ పి ల కోసం దాఖలు చేసిన దరఖాస్తులను కేంద్రీకృతంగా, త్వరితగతిన, పారదర్శకంగా ప్రాసెసింగ్ చేసేందుకు సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్ (సి ఆర్ సి సీ) ని ఏర్పాటు చేశారు. ఇది ఆశించిన ఫలితాలను ఇచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1,02,063 కంపెనీలు, ఎల్ ఎల్ పి లు విలీనం కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 92 శాతం ఎక్కువగా 1,95,586 కంపెనీలు, ఎల్ ఎల్ పి లు విలీనమయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరం 14.02.2024 వరకు ఎల్ఎల్పీలు, కంపెనీల విలీనం గత ఆర్థిక సంవత్సరం 2022-23 కంటే ఎక్కువగా ఉండటమే కాకుండా, గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే అత్యధికం.
కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 248 (2) నిబంధనల ప్రకారం కంపెనీలను రెండు సంవత్సరాల కంటే ఎక్కువ నుండి 6 నెలల కంటే తక్కువకు త్వరితగతిన స్వచ్ఛందంగా మూసివేయడానికి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సి-పేస్) ను ఏర్పాటు చేస్తామని 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీని ప్రకారం 01.05.2023 న సి-పేస్ ఏర్పాటై అమలులోకి వచ్చింది. సి-పేస్ కింద కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేయడానికి దాఖలు చేసిన దరఖాస్తులను 18 నెలల సగటు సమయంతో పోలిస్తే 4 నెలల (సుమారు 100 రోజులు) కంటే తక్కువ సమయంలో నాన్ ఎస్టీపీలో ప్రాసెస్ చేస్తున్నారు. సీ-పేస్ ఇప్పటివరకు 12,441 కంపెనీలను ప్రాసెస్ చేసి మూసివేసింది. సి-పేస్ లో 3,368 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి, ఇది గత సంవత్సరంతో పోలిస్తే తక్కువ.
****
(Release ID: 2006713)
Visitor Counter : 104