నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జిఎంఐఎస్‌ 2023 అవగాహనా ఒప్పందాల అమలుకు సంబంధించి స్టేక్‌ హోల్డర్ల సమావేశానికి అధ్యక్షత వహించనున్న కేంద మంత్రి శ్రీ శర్వానంద్‌ సోనోవాల్‌


ఐఐటి చెన్నైలో సాగర్‌ ఆంకాళన్‌ మార్గదర్శకాల జారీ. జిఎంఐఎస్‌ రిపోర్ట్‌, డ్రెడ్జింగ్‌ టెక్నాలజీలో ఎంటెక్ సైతం ప్రారంభానికి ఏర్పాటు.

Posted On: 15 FEB 2024 5:05PM by PIB Hyderabad

 కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖ , అంతర్జాతీయ సముద్రయాన భారత శిఖరాగ్ర సమ్మేళనం 2023లో కుదిరిన ఎం.ఓ.యుల  అమలుకు సంబంధించి స్టేక్‌ హోల్డర్ల సమావేశం చెన్నైలో నిర్వహించనుంది.  ఈ ఈవెంట్‌ అంతర్జాతీయ సముద్రయాన భారతశిఖరాగ్ర సమ్మేళనం 2023 (జిఎంఐఎస్‌ 2023)లో సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందాలను కార్యాచరణలోకి తెచ్చేందుకు , భారతదేశపు సముద్రయాన దార్శనికతను సాకారం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ ,జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద్‌ సోనోవాల్‌, కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ సహాయమంత్రి శ్రీశ్రీపాద వై.నాయక్‌, కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌జలమార్గాల శాఖ సహాయమంత్రి శ్రీ శంతను ఠాకూర్‌ హాజరుకానున్నారు.

రేపు జరగనున్న స్టేక్ హోల్డర్ల సమావేశం,జిఎంఐఎస్ 2023లో కుదిరిన ఎం.ఓ.యుల అమలుకు మరింత ఊతం ఇవ్వనుంది.  ఈ ఈవెంట్ చర్యకు, నూతన ఆలోచనలను స్వాగతించడానికి, స్టేక్హొల్డర్లనుంచి సూచనలు స్వీకరించడానికి సవాళ్లను పరిష్కరించడానికి, తగిన మద్దతు అందివ్వడానికి, అవసరమైన విధానపరమైన జోక్యానికి, ఎం.ఒయులో పేర్కొన్న లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఇది ఉపకరించనుంది. 

ఈ ఈవెంట్ సందర్బంగా సాగర్ ఆంకాళన్ మార్గదర్శకాలు, జిఎంఐఎస్ నివేదిక, ఐఐటి చెన్నైలో ఎంటెక్ డ్రెడ్జింగ్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించనున్నారు. జిఎంఐఎస్ 2023 అంతర్జాతీయంగా భారీ సముద్రయాన రంగ శిఖరాగ్ర సమ్మేళనంగా గుర్తింపు తెచ్చుకుంది. మూడు రోజులపాటు జరిగిన ఈ శిఖరాగ్ర సమ్మేళనంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించారు. ఈ సమావేశంలో 360 ఎం.ఒ.యులు కుదరడాన్నిబట్టి ఈ సమావేశాల విజయం మరింతగా పేరుతెచ్చుకుంది. వీటి పెట్టుబడి విలువ 8.3 లక్షల కోట్ల రూపాయలు.మరో 1.68 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులకు సంబంధించి ప్రకటనలు వెలువడ్డాయి.  ఈఎం.ఒ.యులలో సముద్రయాన రంగానికి చెందిన పలు ప్రాజెక్టులు, పోర్టు అభివృద్ధి కార్యకలాపాలు, వివిధ, గ్రీన్ హైడ్రోజన్,అమ్మోనియా కు ఆధునీకరణ, పోర్టు ఆధారిత అభివృద్ధి, వ్యాపారం, వాణిజ్యం, నౌకానిర్మాణం, పరస్పరం విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

సాగర్ఆంకాలన్ మార్గదర్శకాలు భారతీయ పోర్టుల పనితీరు కు సంబంధించి జాతీయ స్థాయి బెంచ్మార్క్గా ఉంటాయి. ఈ ప్రమాణాలను భారతీయ అన్ని సముద్ర పోర్టులకు వర్తింప చేస్తారు.

భారతీయ పోర్టుల మ్యాపింగ్, ప్రమాణాలు పాటించేలా చూడడం, లాజిస్టిక్ల పనితీరు, సమరర్ధత, ప్రమాణాల ఏకరూపత, నిర్వచనం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్టు చూడడం, పోటీతత్వాన్ని పెంచడం, సమర్ధత,పోర్టుల రంగం మొత్తం పనితీరు పెంపుపై దృష్టి, ఉత్పాదకత పెంపు, వినియోగదారుల సంతృప్తిసాధన వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి.

***


(Release ID: 2006457) Visitor Counter : 82


Read this release in: English , Urdu , Hindi , Tamil