ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మానసిక ఆరోగ్యం- రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అనుభవాలు పై జాతీయ వర్క్ షాప్ ను ప్రారంభించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి కె పాల్


వనరుల గరిష్ట వినియోగం, సేవల మెరుగుదల పెంచడానికి, భారతదేశంలో మానసిక ఆరోగ్య మద్దతు కోసం పెరుగుతున్న డిమాండ్ ను పరిష్కరించడానికి కిరణ్ మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్ లైన్ ను టెలి మానస్ తో విలీనం చేస్తున్నట్లు ప్రకటన

సేవలు కోరే వారి సంఖ్య భారీ పెరుగుదలను సూచిస్తూ, 2022 అక్టోబర్ లో ప్రారంభించినప్పటి నుంచి 6,75,000 కాల్స్ ను నిర్వహించిన టెలీమానస్

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పటిష్టమైన వ్యవస్థ దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది: డాక్టర్ వికె పాల్

‘మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరినీ చైతన్యవంతం చేయడానికి జన్ ఆందోళన్ అవశ్యం‘

ప్రత్యేక విద్య, చికిత్సతో కూడిన సరైన సంరక్షణతో సహా వినూత్న మార్గాలు పిల్లలకు సంబంధించిన మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహాయపడతాయి: వికలాంగుల సాధికారత శాఖ కార్యదర్శి

Posted On: 15 FEB 2024 3:33PM by PIB Hyderabad

మానసిక ఆరోగ్యంపై రెండు రోజుల జాతీయ వర్క్ షాప్ ను నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలో మానసిక ఆరోగ్య సవాళ్లను పరిష్కరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తూ టెలీమానస్ కోసం మెంటరింగ్ సంస్థలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ వర్క్ షాప్ లక్ష్యం. వికలాంగుల సాధికారత శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ అగర్వాల్ కూడా ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ పాల్ మాట్లాడుతూ,  కిరణ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ హెల్ప్ లైన్ ను టెలీమానస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కిరణ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ హెల్ప్. లైన్ 2020 సెప్టెంబర్ లో నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్-  టెలీ మానస్ తో ప్రారంభమైనప్పటి నుండి 1,27,390 మందికి సేవలు అందించింది. 2022 అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన టెలీ-మానస్, సేవ కోరుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది  అప్పటి నుండి 6,75,000 కాల్స్ ను నిర్వహించింది. ఈ రెండింటి మధ్య విలీనం వనరుల పూర్తి స్థాయి వినియోగం , సేవా నాణ్యతను పెంచడం , విలీన ప్రక్రియ గురించి నిరంతర పరివర్తన, విస్తృతమైన ప్రజా అవగాహనను పెంపొందించడం ద్వారా భారతదేశంలో మానసిక ఆరోగ్య మద్దతు కోసం పెరుగుతున్న డిమాండ్ ను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మూడు నెలల పాటు కిరణ్ నుంచి వచ్చే కాల్స్ ను టెలీమానస్ కు మళ్లించి, చివరికి మొదటి హెల్ప్ లైన్ ను దశలవారీగా నిలిపివేయనున్నారు.

కిరణ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ హెల్ప్ లైన్ ను టెలీమానస్ లో విలీనం చేయడం వల్ల భారం తగ్గుతుందని, సంబంధిత వ్యక్తులకు సులభంగా చేరడానికి దోహదపడుతుందని డాక్టర్ పాల్ అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ, వర్క్ షాప్ ద్వారా రెండు రోజుల వ్యవధిలో భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా మానసిక ఆరోగ్య సంరక్షణ దిశగా భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ వర్క్ షాప్ అన్ని రంగాల నుండి ఉత్తమమైన ఆలోచనలు,  అభ్యాసాలను వెలికితీస్తుందని, దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించి బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులను, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ల ను ప్రశంసించిన ఆయన, "దేశవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నెట్వర్క్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించే  మార్గాలను కనుగొనడంలో ఈ వర్క్ షాప్ సహాయపడుతుంది" అని అన్నారు. "ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బలమైన వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా అందరికీ చేరుకోవడంలో సహాయపడుతుంది" అని ఆయన అన్నారు.

భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా మార్చే ప్రయోజనాల కోసం 'జన్ ఆందోళన్' రూపంలో మానసిక ఆరోగ్య సమస్యలపై అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ప్రభుత్వం, కమ్యూనిటీ, ఎన్ జి ఒ , వ్యక్తులు మొదలైన వారెవరైనా ఈ లక్ష్యం కోసం భాగస్వాములు కావాలి, అప్పుడు ఈ లక్ష్యాన్ని గెలుచుకోవచ్చు" అని ఆయన అన్నారు.

దివ్యాంగుల సాధికారత శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ,  ప్రత్యేక విద్య, చికిత్సతో సరైన సంరక్షణతో సహా వినూత్న మార్గాలు పిల్లలకు సంబంధించిన మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని అన్నారు. కిరణ్ హెల్ప్ లైన్ ను సకాలంలో టెలీమానస్ తో అనుసంధానం చేసినందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ ప్రొవైడర్స్ , కేర్ గివర్స్ అండ్ రిఫరెన్స్ , సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీకి చెందిన మెంటల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం ట్రైనింగ్ మాన్యువల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 అమలు కోసం మూడు మాన్యువల్స్ ను విడుదల చేశారు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, 2017 సంక్లిష్టతలను సరళీకృతం చేయడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన వనరుగా ఈ మాన్యువల్స్ ఉపయోగపడతాయి. ఈ మాన్యువల్స్ ను లీగల్ ఎయిడ్ ప్రొవైడర్లు, మానసిక ఆరోగ్య అభ్యాసకులు, సంరక్షకుల కోసం రూపొందించారు. ఇంకా భారతదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ చుట్టూ ఉన్న చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను నావిగేట్ చేయడంపై సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.

నేపథ్యం:

రెండు రోజుల వర్క్ షాప్ పాలసీ సమీక్షలు, మానసిక వికాస (మైండ్ ఫుల్ నెస్  ) సెషన్లు, ప్రైమరీ, సెకండరీ హెల్త్ కేర్ లో మానసిక ఆరోగ్యం ఏకీకరణ, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ మోడల్స్, మానసిక ఆరోగ్య అక్షరాస్యతను పెంపొందించడం, సవాళ్లు, టెలీమానస్  ముందుకు సాగే మార్గం, మెంటరింగ్ ఇన్స్టిట్యూట్ల పాత్ర వంటి పలు అంశాలపై అనేక సదస్సులతో కూడుకొని ఉంది. ఈ వర్క్ షాప్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు నిర్వహించే ప్యానెల్ చర్చలు ఉంటాయి, మానసిక ఆరోగ్య సంరక్షణలో అంతర్దృష్టులు, అనుభవాలు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.

శ్రీమతి ఎల్ ఎస్ చాంగ్సన్, అదనపు కార్యదర్శి,  మిషన్ డైరెక్టర్, ఎం ఒ హెచ్ ఎఫ్ డబ్ల్యూ ; ఇంద్రాణి కౌశల్, ఆర్థిక సలహాదారు, ఎం ఒ హెచ్ ఎఫ్ డబ్ల్యూ; భారత్ లో డబ్ల్యూ హెచ్ ఒ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ ఆఫ్రిన్ ;

డాక్టర్ బీఎన్ గంగాధర్, చైర్మన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్; నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి;  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, మానసిక ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సు కు. హాజరయ్యారు.

***


(Release ID: 2006451) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi , Marathi