పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భారత ఇంధన మిశ్రమంలో సహజవాయువు వాటాను 6% నుంచి 15%నికి పెంచాలన్న ప్రధాని దార్శనికతను పునరుద్ఘాటించిన పెట్రోలియం మంత్రి హర్దీప్ ఎస్ పురీ
ఐఇడబ్ల్యు 2024 సందర్భంగా జరిగిన పిఎన్‌జిఆర్‌బి అంతర్జాతీయ సమావేశ ప్రారంభ ఎడిషన్
సమావేశంలో పాలుపంచుకున్న దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలకు చెందిన ఇంధన నియంత్రణాధికారులు
Posted On:
14 FEB 2024 11:15AM by PIB Hyderabad
పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డు (పిఎన్‌జిఆర్‌బి) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5-8 ఫిబ్రవరి 2024 మధ్య ఇండియా ఎనర్జీ వీక్ (ఐఇడబ్య్లు - భారత ఇంధన వారం) సందర్భంగా అంతర్జాతీయ పెట్రోలియం, సహజవాయువు రెగ్యులేటర్‌ల (వ్యవస్థాపకుల/ నియంత్రణాధికారుల) ప్రారంభ సమావేశం గోవాలో జరిగింది. సమావేశంలో బంగ్లాదేశ్, ఇండొనేషియా, మలేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్ సహా దక్షిణ, ఆగ్నేయాసియాకు చెందిన ప్రధాన ఇంధన నియంత్రణాధికారులు, అంతర్జాతీయ పరిశ్రమల ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఎస్&పి గ్లోబల్ కమోడిటీస్ ఇన్‌సైట్స్ సమావేశానికి నాలెడ్జ్ పార్ట్నర్ (విజ్ఞాన భాగస్వామి)గా వ్యవహరించింది. సమావేశ విస్త్రత ఇతివృత్తం, సహజవాయువు అభివృద్ధి కోసం మార్గాలను అన్వేషించడం, అన్నది అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణ లక్ష్యాలను చేరుకునేందుకు కీలకమైన, వేగవంతమైన, లోతైన ఉద్గార తగ్గింపులో సహజవాయువు పాత్రను నొక్కి చెప్పింది. ఐదు ప్లీనరీ సెషన్ల సందర్భంగా జరిగిన చర్చలు ఇంధన భద్రతను ప్రభావితం చేస్తున్న భౌగోళిక అస్థిరతలు, వేగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యలు, సంస్థాగత/ వ్యవస్థాగత వృద్ధి సహా విస్త్రత అంశాలపై జరిగాయి. అంతర్జాతీయ రెగ్యులేటర్ల ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిబంధనలచట్ర పరిరక్షకులను ఒక చోట చేర్చడమే కాక, ఉత్తమ కార్యాచరణలను పంచుకోవడానికి, ఇంధన భద్రతను పెంచేందుకు, సమర్ధవంతమైన పాలనకు హామీ ఇచ్చేందుకు సీమాంతర సహకార వ్యూహాలను పంచుకునేందుకు ఒకవేదికను అందించింది.
సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశ ఇంధన మిశ్రమంలో సహజ వాయువు వాటాను 6% నుంచి 15%కి పెంచాలన్న ప్రధానమంత్రి దార్శనికతను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ పునరుద్ఘాటించారు. ఈ చొరవ తీసుకున్నందుకు పిఎన్‌జిఆర్‌బిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో చమురు, వాయువు నియంత్రణాధికారులు అంతర్జాతీయ నియంత్రణా పరిషత్తు అనే ఐఇడబ్ల్యులో సమగ్ర లక్షణంగా ఉంటుందని నొక్కి చెప్పారు. సహజ వాయువు అభివృద్ధి కోసం ప్రభావవంతమైన నియంత్రణా చట్రాలను రూపొందించేందుకు దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారం, విజ్ఞానాన్ని పంచుకోవలసిన అవసరాన్ని పిఎన్ జిఆర్‌బి చైర్‌పర్సన్ డా. అనిల్ కుమార్ జైన్ నొక్కి చెప్పారు.
నికర- సున్నా ఉద్గారాలను సాధించడానికి ఇంధన మిశ్రమంలో సహజవాయువును ముందుకు తీసుకురావలసిన అవసరాన్ని, పరివర్తన ఇంధనంగా ముందుకు తీసుకువెళ్ళడంలో దాని పాత్రను గురించి గౌరవ వక్తల బృందం ప్రసంగించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన సరఫరాను భౌగోళిక రాజకీయ అస్థిరతలు ప్రభావితం చేయడాన్ని, ఇంధన సరఫరాను పరిరక్షించేందుకు గ్లోబల్ సౌత్ ఐక్య సంఘటనగా ఉండాల్సిన అవసరాన్ని వారు పట్టి చూపారు. ఈ చర్చ భారతదేశ సహజవాయువు నియంత్రణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది, ముఖ్యంగా మొత్తం మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర గ్యాస్ పంపిణీని విశ్వసనీయంగా, సరసమైన ధరకు స్వచ్ఛ ఇంధనాన్ని అందించేందుకు చేస్తున్న యత్నాలపై దృష్టి పెట్టింది. పరస్పర అనుసంధానిత గ్యాస్, విద్యుత్ గ్రిడ్‌ల ద్వారా దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య ప్రాంతీయ స్వచ్ఛ ఇంధన అజెండా అవసరాన్ని అగ్ర పరిశ్రమలు ప్రతిపాదించాయి.
పెట్రోలియం, సహజవాయువు నియంత్రణాదికారుల అంతర్జాతీయ సమావేవం నైపుణ్యాల సంబంధి విషయంగా పని చేయడం ద్వారా సహజ వాయువు అభివృద్ధి భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం, వారు నెట్‌వర్క్ అవడానికి, విజ్ఞాన్ని పంచుకోవడానికి ఒక అవకాశాన్ని అందించింది.
***
(Release ID: 2006184)
Visitor Counter : 89