సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా చైతన్య కార్యక్రమం నిర్వహించారు
प्रविष्टि तिथि:
13 FEB 2024 8:49PM by PIB Hyderabad
అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ సోమవారం నాడు, మూర్ఛ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
డిపార్ట్‌మెంట్ దాని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు సీ ఆర్ సీ ల ద్వారా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులను సహానుభుతి తో అర్థం చేసుకోవడం మరియు వారికి మద్దతు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఫిబ్రవరి 12, 2024 సోమవారం నాడు బహుళ ఈవెంట్‌లను నిర్వహించింది.
మూర్ఛ తరచుగా శాపంగా దురభిప్రాయం ఉంది, ఇది సరైన చికిత్స మరియు మద్దతుతో సమర్థవంతంగా నిర్వహించబడే ఒక వైద్య పరిస్థితి. ఈ సందర్భంగా కరుణ మరియు సరైన సంరక్షణ ఆవశ్యకతను గుర్తించి, అపోహలను తొలగించడానికి మరియు అంగీకారాన్ని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.
ఎన్ ఐ ఈ పి ఐ డీ సికింద్రాబాద్‌లో, తల్లిదండ్రులు, సంరక్షకులు, విద్యార్థులు మరియు సిబ్బంది తో విభిన్న అవగాహన సెషన్‌లను ఏర్పాటు చేసింది. అవగాహన మరియు మద్దతు వ్యవస్థలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మూర్ఛ వ్యాధితో వ్యవహరించడంలో సహానుభుతి మరియు శాస్త్రీయ విజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు వైకల్య పునరావాసంలో నిపుణుల మధ్య ఆన్‌లైన్ వెబ్‌నార్ చర్చలను సులభతరం చేసింది.
ఎన్ ఐ ఈ పి ఐ డీ, ఆర్ సి, నోయిడా లో విద్యార్థులను కలుపుకొని అవగాహన సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా అవగాహన సెషన్‌లు, క్విజ్ పోటీలు మరియు మూర్ఛ అవగాహన వీడియోల ప్రదర్శనలతో సహా పలు కార్యకలాపాలను నిర్వహించింది.
గోరఖ్‌పూర్‌లో, సీ ఆర్ సి, గోరఖ్‌పూర్ కేంద్రం కళంక భావాన్ని తగ్గించడం మరియు సానుభూతిని ప్రోత్సహించడం లక్ష్యంగా మూర్ఛ మరియు దాని నిర్వహణ గురించి సమాజానికి అవగాహన కల్పించడానికి ఒక రోజు-నిడివి ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
దావంగెరెలో, సీ ఆర్ సి "కేర్ ఆఫ్ చైల్డ్ విత్ ఎపిలెప్సీ" పేరుతో వెబ్‌నార్‌ను నిర్వహించింది, ఇక్కడ నిపుణులు మూర్ఛతో బాధపడుతున్న పిల్లలకు మద్దతు ఇవ్వడానికి, సహాయక వాతావరణాన్ని పెంపొందించడానికి అంతర్దృష్టులు మరియు వ్యూహాలను పంచుకున్నారు.
అదేవిధంగా, సమగ్ర ప్రాంతీయ కేంద్రం త్రిపుర మరియు ఎన్ ఐ ఎం హెచ్ ఆర్ సెహోర్ కూడా వివిధ కార్యక్రమాల ద్వారా మూర్ఛ గురించి అవగాహన కల్పించడానికి చొరవ తీసుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2005979)
आगंतुक पटल : 127