మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అపార్: వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐ డి కార్డుపై జాతీయ సదస్సును ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


25 కోట్ల అపార్ (ఎపిఎఎఆర్) ఐడిలను ఇప్పటికే సృష్టించాం - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

ఎపిఎఆర్ ఐడి మన విద్యార్థులకు ఆకాంక్షాత్మక , గ్లోబల్ డాక్యుమెంట్ కాబోతోంది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

53 డి పిఐ లలో భారత్ కు 19 ఉన్నాయి - ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 13 FEB 2024 7:56PM by PIB Hyderabad

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రోజు న్యూఢిల్లీలో ఎపిఎఎఆర్: వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కె.మూర్తి ;పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెక్రటరీ అతుల్ కుమార్ తివారీ; ఎంఇఐటి కార్యదర్శి ఎస్.కృష్ణన్ ; నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ జిత్ సింగ్ కల్సీ ; నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఎన్ బి నాక్ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే , ఇంకా దేశవ్యాప్తంగా వివిధ సంస్థల వైస్ చాన్సలర్లు, డైరెక్టర్లు, రిజిస్ట్రార్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, పరిశ్రమ భాగస్వాములు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ స్వాగతోపన్యాసం చేశారు.

కార్యక్రమంలో శ్రీ ప్రధాన్ ప్రసంగిస్తూ, దేశంలోని విద్యార్థులకు ఆకాంక్షాత్మక, గ్లోబల్ డాక్యుమెంట్ గా ఎపిఎఎఆర్ ఐడి ఎలా ఉండబోతోందో వివరించారుఇటీవలి సంవత్సరాలలో దేశంలో అభివృద్ధి చేసిన అనేక ముఖ్యమైన డిపిఐల ప్రాముఖ్యతను తెలియ చేస్తూ, ఇటువంటి 53 డిపిఐలు 16 దేశాలలో అభివృద్ధి కాగా, వాటిలో 19 భారతదేశంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  డిజిటల్ ఇండియా దార్శనికతకు  కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇది ఇప్పటికే 25 కోట్ల ఎపిఎఆర్ ఐడిల ను సృష్టించడంతో ఇది ఇప్పుడు పూర్తి ఊపందుకుందని శ్రీ ప్రధాన్ అన్నారు. ఎపిఎఆర్ ఐడిలు, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్డిజిలాకర్ ఇంటర్ కనెక్టివిటీ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు, ఇది కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. స్వయం, దీక్ష వంటి ఇతర ముఖ్యమైన డిజిటల్ ఆస్తులను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

 

విద్య నాణ్యతలో రాజీపడకుండా వలసలు, సమైక్యత నిబంధనలను పొందుపరచడంలో ఎన్ఇపి 2020 పాత్రను శ్రీ ప్రధాన్ ప్రస్తావించారు. పరిజ్ఞానంతో పాటు నైపుణ్యం ద్వారా వచ్చే సామర్థ్యాన్ని ఆకాంక్షాత్మకంగా మార్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

సదస్సులో శ్రీ సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ, హిందీలో ఈ పదానికి అర్థానికి తగినట్లుగా, ఎపిఎఎఆర్ ఐడి విస్తృత పరిధిని వివరించారు. 12వ తరగతి వరకు 100% జిఇఆర్ ఉండేలా చూడటం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కనీసం ఒక నైపుణ్యంలో ప్రావీణ్యం కలిగి ఉండటం వంటి కొన్ని ముఖ్యమైన సిఫార్సులను ప్రస్తావిస్తూ ఎన్ ఇ పి 2020 దార్శనికతను ఆయన ప్రస్తావించారు. దేశంలోని 260 మిలియన్ల మంది విద్యార్థులను ట్రాక్ చేయడానికి ఎపిఎఆర్ సహాయపడుతుందని ఆయన అన్నారు. 25 కోట్ల మంది పిల్లలకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ఇచ్చామని, దాని ఆధారంగా వారికి ఎపిఎఎఆర్ ఐడీ జారీ చేశామని ఆయన తెలియజేశారు. పాఠశాల విద్యను జీవన సౌలభ్యంలో భాగం చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను పునరుద్ఘాటించారు. పాఠశాల విద్యను జీవన సౌలభ్యంలో భాగం చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను పునరుద్ఘాటించిన ఆయన, పిల్లలకు పాఠశాల విద్యను సులభతరం చేయాలని నొక్కి చెప్పారు. ఎపిఎఎఆర్ తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, విద్యా సమిక్ష కేంద్రం మొదలైన వాటిని కూడా ఆయన ప్రస్తావించారు.

శ్రీ కె.సంజయ్ మూర్తి తన ప్రసంగంలో ఎపిఎఆర్ ఐడిలు, మరొక ముఖ్యమైన డిపిఐ సమర్థ్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు, దాని మోహరింపు, ప్రాప్యత,  ఎపిఎఎఆర్ తో అంతరాయం లేని కనెక్షన్ గురించి ప్రస్తావించారు. సమర్థ్ వేదికను కూడా ప్రతి సంస్థ స్వీకరించాలని ఆయన కోరారు. స్వయం వేదిక గురించి, త్వరలో ప్రారంభం కానున్న దాని కొత్త వెర్షన్ లో సంబంధిత కోర్సులను అందించడానికి ప్రముఖ పరిశ్రమల నుండి కంటెంట్ ఉంటుందని ఆయన తెలియజేశారు. గుర్తింపు, ధ్రువీకరణ కోసం డిజిటల్ రికార్డు అవసరమని స్పష్టం చేశారు.

జాబ్ ప్రొఫైల్స్ తో ఎ పి ఎ ఎ ఆర్ ఐడీ, క్రెడిట్ సిస్టమ్స్ అనుసంధానం, విద్యలో డిజిలాకర్ పాత్రను అన్వేషించడంపై రెండు ప్యానెల్ డిస్కషన్లు జరిగాయి.

ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్) అనేది 2020 నాటి జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), నేషనల్ క్రెడిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)కు అనుగుణంగా ప్రవేశపెట్టిన పరివర్తనాత్మక కార్యక్రమం.

ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన ,శాశ్వత 12-అంకెల ఐడిని కేటాయించడం ద్వారా భారతదేశం అంతటా విద్యార్థులకు ఏకీకృతఅందుబాటులో ఉన్న విద్యా అనుభవాన్ని అందించడం, వారి విద్యా విజయాలను ఒకే చోట క్రోడీకరించడం దీని లక్ష్యం. మరింత సమాచారం కోసం - https://abc.gov.in/ సందర్శించండి

***



(Release ID: 2005958) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Hindi