రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

చెన్నైలోని బెల్, ఏవీఎన్ఎల్ అవధ్ సంస్థలను సందర్శించిన రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ రామ్


- మేక్ ఇన్ ఇండియా విజయానికి ఆయుధ వ్యవస్థలు మరియు ప్లాట్‌ఫారమ్‌ల స్వదేశీకరణకు బెల్ సహకారం కీలకం: రక్షణ కార్యదర్శి

Posted On: 13 FEB 2024 6:00PM by PIB Hyderabad

రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే 13.02.2024న చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ను (బెల్ సంస్థను) సందర్శించారు. బెల్ సీఎండీ శ్రీ భాను ప్రకాష్ శ్రీవాస్తవ సమక్షంలో ఆయన యూనిట్ పనితీరును సమీక్షించారు. యూనిట్‌లోని ఆర్&డీ మరియు తయారీ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని  ఆయన భాగస్వామ్య పక్షాల వారిని కోరారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతానికి ఆయుధ వ్యవస్థలు మరియు ప్లాట్‌ఫారమ్‌ల స్వదేశీకరణకు బెల్ యొక్క సహకారం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల సామర్థ్య అభివృద్ధి ఆవశ్యకతను ఆయన మరింత నొక్కి చెప్పారు. రక్షణ కార్యదర్శి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్) కార్పొరేట్ కార్యాలయం, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (హెచ్.వి.ఎఫ్) మరియు ఇంజిన్ ఫ్యాక్టరీ అవడి (ఈఎఫ్ఏ)లను ఉత్పత్తి కార్యకలాపాలు, కొనసాగుతున్న ఆర్&డీ ప్రాజెక్ట్‌ల సమీక్ష నిమిత్తం సందర్శించారు. ఏవీఎన్ఎల్ సీఎండీ శ్రీ సంజయ్ ద్వివేది సమక్షంలో ఏవీఎన్ఎల్ అధికారులను ఉద్దేశించి శ్రీ అరమనే ప్రపంచ ఉత్పాదక పద్ధతులు మరియు అత్యున్నత స్థాయి నాణ్యతపై ఉద్ఘాటించారు. ఆర్&డీ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, స్వదేశీకరణ కార్యక్రమాలు మరియు మొత్తం సామర్థ్యం మరియు పోటీతత్వాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని ఆయన వారిని కోరారు. శ్రీ అరమనే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలోని ఎంబీటీ అర్జున్ షాప్‌ను సందర్శించారు. హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో జనరల్ అసెంబ్లీ షాప్, హల్ షాప్ మరియు ట్రాన్స్‌మిషన్ షాప్ వంటి అనేక ఇతర ఉత్పత్తి దుకాణాలను కూడా ఆయన సందర్శించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, శ్రీ అరమనే ఇంజిన్ ఫ్యాక్టరీ అవడి (ఈఎఫ్ఏ)లో తయారీ కేంద్రాలను సందర్శించారు, అక్కడ ట్యాంక్ ఇంజిన్ తయారీ మరియు ఓవర్‌హాలింగ్ గురించి ఆయనకు వివరించారు. ఈఎఫ్ఏ టీ-72, టీ-90, బీఎంపీ-II యొక్క అన్ని ఇంజిన్‌లు (ఏఎఫ్వీలు) మరియు దాని ఇతర రూపాంతరాలను ప్రదర్శించింది, ఇవి ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో పూర్తిగా స్వదేశీకరించబడ్డాయి. అనంతరం ఈఎఫ్‌ఏలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2005750) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Hindi , Tamil