భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పిఎల్ఐ పథకం కింద అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ తయారీ సౌకర్యాల ఏర్పాటు కోసం బిడ్డర్‌లను ఎంపిక చేసేందుకు ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించిన ఎంహెచ్ఐ


దేశంలో టెక్నాలజీ ఆధారిత ఏసీసీల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం

భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పాల్గొనడానికి దేశీయ, అంతర్జాతీయ వాటాదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.. డాక్టర్ మహేంద్రనాథ్ పాండే

సమావేశానికి హాజరైన 18 కంపెనీలకు చెందిన 45 మందికి పైగా ప్రతినిధులు
బిడ్ గడువు తేదీ: 22 ఏప్రిల్, 2024

Posted On: 13 FEB 2024 12:24PM by PIB Hyderabad

పిఎల్ఐ పథకం కింద అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ తయారీ సౌకర్యాల ఏర్పాటు కోసం బిడ్డర్‌లను ఎంపిక చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) న్యూఢిల్లీలోని ఐ ఎఫ్ సి ఐ లిమిటెడ్ లో ప్రీ-బిడ్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ (ఎసిసి) కోసం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ)  కింద  మొత్తం 10 గిగావాట్ల పిఎల్ఐ ఎసిసి సామర్థ్యం కోసం ఎంహెచ్ఐ నిర్వహిస్తున్న అంతర్జాతీయ  ప్రక్రియ రెండో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో పరిశ్రమ, ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.  నిన్న జరిగిన ఈ సమావేశంలో నీతి ఆయోగ్, విద్యుత్ శాఖ,, ఎంఎన్ఆర్ఈ,  ఐఈఎస్ఏ లాంటి పరిశ్రమల సంస్థలు,  పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. ఎసిసి తయారీలో భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా సమావేశం  ఒక ముఖ్యమైన అడుగు గా ఉంటుందని  భావిస్తున్నారు. 

10 గిగావాట్ల సామర్థ్యం కలిగిన గిగా-స్కేల్ అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) తయారీ సౌకర్యాల ఏర్పాటుకు బిడ్లను కోరుతూ జారీ చేయనున్న అంతర్జాతీయ  టెండర్ కు సన్నాహకంగా ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ప్రతిష్టాత్మక పిఎల్ఐ ఎసిసి పథకం కింద భారత ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగంలో సృజనాత్మకత,స్వావలంబన సాధించడానికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం  దేశంలో సాంకేతిక-ఆధారిత  ఎసిసిల తయారీని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

10 గిగావాట్ల ఎసిసి సామర్థ్యం కోసం ఆహ్వానించనున్న అంతర్జాతీయ టెండర్  పరిధి లక్ష్యాలపై మంత్రిత్వ శాఖ వివరణాత్మక వివరణ  ఇచ్చింది. టెక్నికల్ స్పెసిఫికేషన్లు, అర్హత ప్రమాణాలు, మూల్యాంకన ప్రక్రియ తదితర అంశాలను వివరించారు.  బిడ్డర్ల నుంచి సందేహాలు, వివరణల  స్వీకరణకు చివరి తేదీ 2024 మార్చి 4 గా ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ ప్రీ-బిడ్  సమావేశం  టెండర్ల ప్రక్రియలో ఒక ముఖ్యమైన ప్రక్రియ అని అన్నారు.  సుస్థిర ఇంధన సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశానికి అంతర్జాతీయంగా ప్రథమ స్థానంలో నిలిపేందుకు పిఎల్ఐ ఎసిసి పథకం కీలకంగా ఉంటుందన్నారు.  స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్) , అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత  భారత్) భారతదేశం అభివృద్ధి చెందాలన్న   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు  అనుగుణంగా దేశ   పునరుత్పాదక ఇంధన రంగంలో  విప్లవం తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నాలలో   దేశీయ అంతర్జాతీయ భాగస్వాములు పాల్గొనేలా చూసేందుకు అవసరమైన  అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు అమలు చేస్తుందని ఆయన  చెప్పారు.

టెండర్ డాక్యుమెంట్లు 2024 జనవరి 24 నుంచి అందుబాటులో ఉన్నాయి. బిడ్ దాఖలు చేయడానికి   గడువు తేదీ 2023 ఏప్రిల్ 22 .  2024 ఏప్రిల్ 23న బిడ్లను తెరుస్తారు.  సిపీపీ  పోర్టల్ ద్వారా క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (QCBS) విధానంలో ఆన్‌లైన్‌లో  పారదర్శక రెండు-దశల ప్రక్రియ ద్వారా బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుంది.  ఈ విధానం వల్ల  బిడ్డర్ల ఎంపిక నిష్పాక్షికంగా , పారదర్శకంగా, సామర్థ్యం ఆధారంగా జరుగుతుంది.దీనివల్ల  భారతదేశ ఎసిసి తయారీ రంగం అభివృద్ధి కోసం అత్యుత్తమ ప్రపంచ సంస్థలు ముందుకు వస్తాయి. 

పిఎల్ఐ ఎసిసి పథకం, గ్లోబల్ టెండర్ ప్రక్రియ గురించి మరింత సమాచారం, తాజా వివరాల  కోసం, ఆసక్తిగల సంస్థలు  భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్  లేదా సిపిపి పోర్టల్ ను సందర్శించవచ్చు.

***



(Release ID: 2005544) Visitor Counter : 73