విద్యుత్తు మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఏర్పాటులో శక్తివనరుల సంస్థ(టీఈఆర్ఐ)కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది: కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కే సింగ్
ప్రపంచ ఇంధన వినియోగంలో మార్పు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్ వినయోగాన్ని తగ్గించుకున్నప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుగుతాయి: కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్ కే సింగ్
Posted On:
11 FEB 2024 6:44PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం మరియు శక్తి మరియు వనరుల సంస్థ (టీఈఆర్ఐ) మధ్య సహకార కార్యక్రమంగా శక్తి పరివర్తన కేంద్రాన్ని( సెంటర్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె సింగ్ ప్రకటించారు. ఫిబ్రవరి 9, 2024న న్యూఢిల్లీలో శక్తి మరియు వనరుల సంస్థ (టీఈఆర్ఐ) నిర్వహిస్తున్న ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు( వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్-.. డబ్ల్యూఎస్డీఎస్) 23వ ఎడిషన్‌లో మంత్రి ఈ ప్రకటన చేశారు.ఇంధన ఉత్పత్తి మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు స్థిరమైన మార్గాలను గుర్తించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
“ప్రజలు, శాంతి, శ్రేయస్సు మరియు మన గ్రహం కోసం ఇంధన ఉత్పత్తి” అనే అంశంపై జరిగిన సెషన్‌లో శిఖరాగ్ర ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ చర్య మరియు ఇంధన ఉత్పత్తిలో భారతదేశ నాయకత్వాన్ని నొక్కి చెప్పారు. భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతిని ప్రస్తుతిస్తూ.. మంత్రి ఇలా అన్నారు... "మన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 44% శిలాజ-ఇంధన మూలాల నుండి తీసుకోబడింది. మొత్తం సామర్థ్యం 427 గిగావాట్లు కాగా.. 180- గిగావాట్ల కంటే ఎక్కువ శిలాజ -ఇంధన వనరుల నుండి తీసుకోబడింది. వీటిలో ఎక్కువ భాగం పునరుత్పాదక సామర్థ్యం కలిగినవే. మా శక్తి పరివర్తన రేటు సాటిలేనిది. రౌండ్ -ది- క్లాక్ పునరుత్పాదక ఇంధనం కోసం బిడ్‌లు జారీ చేస్తున్న ఏకైక దేశం మనమే."నని అన్నారు.
‘‘ షెడ్యూల్ కంటే ముందుగానే రెండు ఎన్‌డిసిలను సాధించిన ఏకైక పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని మంత్రి ఆర్.కే . సింగ్ అన్నారు. "తటస్థ పరిశీలకులు మాకు గ్రేడింగ్ చేసినప్పుడు, ప్రపంచ ఉష్ణోగ్రతలో ఉప -2- డిగ్రీల పెరుగుదలతో ఇచ్చిన మాట మేరకు ఒప్పందాలకు కట్టుబడి ఉన్న ఏకైక దేశంగా భారతదేశానికి రేటింగ్ ఇచ్చారు’’ అని కేంద్ర విద్యుత్ మరియు నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అన్నారు.
ప్రజావాణిలో మార్పు రావాల్సిన అవసరాన్ని విద్యుత్ శాఖ మంత్రి నొక్కి చెప్పారు. “అభివృద్ధి చెందిన దేశాలు శిలాజ ఇంధనాలను ఉపయోగించి అభివృద్ధి చెందాయి; కర్బన ఉద్గారాలల్లో 77% అభివృద్ధి చెందిన దేశాల వల్ల సంభవిస్తుంది. ఇది బహిరంగ చర్చలో ఎప్పుడూ రాని విషయం. ప్రపంచ జనాభాలో భారతదేశం 17% మందిని కలిగి ఉంది, అయితే మనం 3% కార్బన్ ఉద్గారాలకు మాత్రమే బాధ్యత వహిస్తున్నాము. అభివృద్ధి చెందిన దేశాల ఉద్గారాల వేగంతో ఈ స్థితిలో కొనసాగితే.. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంకేమీ మిగలని పరిస్థతి నెలకొంటుంది‘ అని మంత్రి పేర్కొన్నారు.
తమ అభివృద్ధి పథంలో ఏ దేశమూ రాజీ పడదని అభివృద్ధి చెందిన దేశాలు గ్రహించాలని శ్రీ సింగ్ అన్నారు. "అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందడానికి అవసరమైన కార్బన్ స్పేస్ ను మిగల్చాని సింగ్ అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే 4 రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు. "ఈ ఉపన్యాసం కపటమైనది, ఎందుకంటే సమస్యకు మూలమైన తలసరి ఉద్గారాల గురించి ఎవరూ మాట్లాడరు. బొగ్గును తొలగించాలనే వాదన రెడ్ హెర్రింగ్, ఎందుకంటే ఇది బొగ్గు మాత్రమే కాదు, కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్‌ను విడుదల చేసే వాయువు కూడా. కాప్ సమావేశాలు ఏవీ దీని గురించి ప్రస్తావించలేదు‘ అని మంత్రి ఆర్ కే సింగ్ పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు ఇంధన నిల్వ సామర్థ్యాన్ని జోడించలేదని, దీని కారణంగా ధరలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి చెప్పారు. "సుస్థిరమైన అభివృద్ధి రెండు పలకలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఉద్గారాల వేగం ఎక్కువగా ఉన్న దేశాలు.. కార్బన్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. రెండు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక, ఆర్థిక సాయం అందేలా చూడాలి. తద్వారా ఇంధన ఉత్పత్తి ధరలు తగ్గుతాయి. భారతదేశానికి ఆర్థిక సాయం అవసరం లేదని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందేలా చూడాలి’ అని కేంద్ర విద్యుత్ మరియు నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అన్నారు.
"ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తీరు తప్పనిసరిగా మారాలి; స్థిరత్వం లేకుండా డిమాండ్ పెరగడం వినాశనానికి దారి తీస్తుంది" లని మిషన్ లైఫ్‌పై ప్రధానమంత్రి ఉద్ఘాటనను..కేంద్ర మంత్రి ఆర్.కే.సింగ్ నొక్కిచెప్పారు. భారతదేశం యొక్క పురోగతిని ప్రస్తుతిస్తూ.. "మేము గ్రీన్ వాహనాలను పెంచుతున్నాము మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచుతున్నాము."అయినప్పటికీ, "రక్షణవాద వాణిజ్య అడ్డంకులు పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. ఇది సామూహిక పునరాలోచనకు సమయం" అని మంత్రి హెచ్చరించారు.
పునరుత్పాదక వనరుల సంస్థ(టీఈఆర్ఐ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన, శ్రీ నితిన్ దేశాయ్ సుస్థిరత విషయంలో భారతదేశం యొక్క నిబద్ధత గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రం భారతదేశానికి మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సమగ్ర ఇంధన ఉత్పత్తి మార్గాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీమతి విభా ధావన్ మాట్లాడుతూ.. స్థిరత్వం కోసం పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ యొక్క నిబద్ధతను మరియు అర్ధవంతమైన మార్పును నడిపించడంలో దాని అంకితభావాన్ని పునరుద్ఘాటించడం ద్వారా ముగించారు. వాతావరణ మార్పుల యొక్క ఒత్తిడి సవాళ్లను ఎదుర్కోవడంలో మరియు రాబోయే తరాలకు మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో సహకారం మరియు ఆవిష్కరణల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు.
ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2024... స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా బలమైన చర్చలు మరియు సహకారాల కోసం ఒక అమూల్యమైన వేదికను అందించింది. ఇంధన పరివర్తన మరియు సుస్థిరతలో భారతదేశం ఉదాహరణగా కొనసాగుతున్నందున, ఇంధన పరివర్తన కేంద్రం ఏర్పాటు వంటి కార్యక్రమాలు హరిత భవిష్యత్తు వైపు దేశం యొక్క ప్రయాణంలో ముఖ్యమైన మైలురాళ్లను సూచిస్తాయి.
ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2024 లో భాగంగా “ప్రజలు, శాంతి, శ్రేయస్సు మరియు మన గ్రహం కోసం ఇంధన ఉత్పత్తి”అనే అంశంపై నిర్వహించిన సెషన్ ను ఇక్కడ చూడవచ్చు.
***
(Release ID: 2005510)
Visitor Counter : 109