వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఐదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించిన

పి.ఎం. గతిశక్తినెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌, 65 వ సమావేశం,
రోడ్డు, రైలు, ఇతర నగర రవాణా ప్రాజెక్టులను ఎన్‌పిజి సమీక్షిస్తుంది.

Posted On: 09 FEB 2024 12:18PM by PIB Hyderabad

నెట్‌ వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ (ఎన్‌.పి.జి) 65 వ సమావేశం, పారిశ్రామిక ప్రోత్సాహక  అంతర్గత వాణిజ్యం( డిపిఐఐటి) విభాగం, అదనపు కార్యదర్శి శ్రీ రాజీవ్‌ సింగ్‌ ఠాకూర్‌ అధ్యక్షతన జరిగింది.కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు (ఎం.ఒ.ఆర్‌.టి.హెచ్‌) , రైల్వే మంత్రిత్వశాఖ (ఎం.ఒ.ఆర్‌), హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన ఐదు రోడ్డు రైలు, పట్టణ రవాణా ప్రాజెక్టులను సమీక్షించింది.  ఎన్‌.పి.జి ఈ ప్రాజెక్టులను సమీకృత ప్రణాళిక దృష్టికోణంలోంచి, పి.ఎం. గతిశక్తి సూత్రాల ఆధారంగా దీనిని పరిశీలించింది.పి.ఎం.గతి శక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ (ఎన్‌.ఎం.పి) ప్రణాళిక, మ్యాపింగ్‌ ఆధారంగా  ప్రాజెక్టు వివరాలను పరుఇశీలించడం జరిగింది.ఈ పరిశీలన ఫలితాలను, దేశంలో అనుసంధానత పెంపు ద్వారా వివిధ ఆర్థిక, సామాజిక కొలమానాలను మెరుగుపరచడం, బహుళ అంచెల మౌలికసదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పరిశీలన జరిగింది.

1.ఎం.ఆర్‌.టి.హెచ్‌: గోవా, మేఘాలయ, అస్సాంలలో జతీయ రహదారుల ప్రాజెక్టులు.
కేంద్ర రోడ్డు రవాణా జతీయ రహదారుల మంత్రిత్వశాఖ గోవాలో చేపట్టిన నాలుగు లేన్ల 45 కిలోమీటర్ల ఎన్‌.హెచ్‌ 66, మేఘాలయ, అస్సాం రాష్ట్రాలలోమావ్‌లింగ్‌ఖుంగ్‌` పంచ్‌ గ్రామ్‌ రోడ్‌ను రెండులైన్ల నుంచి నాలుగులైన్లకు మార్పు, 118 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌  రహదారి, 43 కిలోమీటర్ల బ్రౌన్‌ ఫీల్డ్‌ రహదారి, ఇందులో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు విస్తృత ఆర్ధిక ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. దీని ద్వారా  లాజిస్టిక్‌ ల ఖర్చు తగ్గడం, ట్రాఫిక్‌ రద్దీ తగ్గడం, వాహనాల వేగం పెరగడానికి వీలు కలుగుతుంది.

2. ఎం.ఒ.ఆర్‌: బీహార్‌ లో రైల్‌ ఓవర్‌` రైల్‌ బల్బ్‌ లైన్‌
బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో నాభినగర్‌ (అంకోరా) వద్ద 17.49 కిలోమీటర్ల మేర బల్బ్‌లైన్‌ నిర్మాణ ప్రాజెక్టును పరిశీలించారు. ఆర్‌.ఒ.ఆర్‌ బల్బ్‌లైన్‌ రెండు రైల్వే లైన్ల గ్రేడ్‌లను వేరు చేస్తుంది. దీనివల్ల రైళ్లు ట్రాక్‌ కోసం ఆపాల్సిన అవసరం ఉండదు. దీనితో ప్రయాణ సమయం తగ్గుతుంది. సరకు తరలింపు సామర్ధ్యం పెరుగుతుంది. పరిసరాలలోని నాభినగర్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా సామర్ధ్యం పెరుగుతుంది. దీననివల్ల ప్రధాన లైన్ల సెక్షన్‌కెపాసిటీ వినియోగం పెరుగుతుంది.
3. ఎం.ఒ.హెచ్‌.యు.ఎ: బెంగళూరు, ఢల్లీి నేషనల్‌కేపిటల్‌ రీజియన్‌ లలో నగర మెట్రో రవాణా సదుపాయం.:

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించి, రెండు నగర ప్రయాణ మెట్రో కారిడార్‌ ప్రాజెక్టులను నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌చర్చించింది. ఇందులో హర్యానాలోని రితాలా`బవానా`నరేలా` కుండ్లి మెట్రో కారిడార్‌ ఎన్‌సిఆర్‌ రీజియన్‌ డిఎంఆర్‌సిలోనిది ఉంది. అలాగే మూడో దశ 4.65 కిలో మీటర్ల బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు కు సంబంధించిన రెండు కారిడార్ల అంశాన్ని సమీక్షించారు. ఇవి జెపినగర్‌ నుంచి కెంపెపుర వరకు ఒఆర్‌ఆర్‌ వెంట చేపడతారు. అలాగే  హోసహల్లినుంచి మగదిరోడ్‌ వెంట కడబగెరే వరకు రోడ్డు నిర్మాణ పనులను సమీక్షించారు. రెండు ప్రాజెక్టులూ బహుళ నమూనా సమీకృత వ్యవస్థ కలిగినవి. ఇవి మెట్రో, బస్‌, రౖెెలు స్టేషన్లను అనుసంధానం చేస్తాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. వాహనాల నుంచి విడుదల అయ్యే  కాలుష్యం తగ్గుతుంది. అంతర్‌ నమూనా బహుళ మార్గాలు ఇమిడి ఉన్న చోట తగినవిధంగా ఒక ప్రయాణ సాధనం నుంచి మరో ప్రయాణ సాధనానికి మారే సులభతర వీలు ఉండాలని సూచించింది.
ఈ ప్రాజెక్టులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, వివిధ రవాణా విధానాలను ఇది వినియోగించుకుంటుందని తెలిపారు. వీటివల్ల పలు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఇది ఈ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.

***



(Release ID: 2005072) Visitor Counter : 52