విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ (ఎల్ పి ఎస్ సంబంధిత అంశాలు) నిబంధనలు, 2022 తో డిస్కమ్‌ల బకాయిలు


జూన్ 2022 లో రూ. 1.4 లక్షల కోట్ల నుండి జనవరి 2024లో రూ. 50,000 కోట్ల కన్నా దిగువకు వచ్చాయి: కేంద్ర విద్యుత్ మరియు కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

Posted On: 08 FEB 2024 2:41PM by PIB Hyderabad

విద్యుత్ (ఎల్ పి ఎస్ సంబంధిత అంశాలు) నిబంధనలు, 2022 అమలు ప్రభావం గురించి కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి తెలియజేశారు.

డిస్కమ్‌ల ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన ముఖ్య సూచికలలో ఒకటి జనరేషన్ కంపెనీలకు (జెన్కోలు) విద్యుత్ కొనుగోలు బకాయిలు పెరగడం.  డిస్కమ్‌ల అమలుతో, బకాయిల రికవరీలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. రాష్ట్రాలు మొత్తం బకాయిలు 03.06.2022 నాటికి రూ.1,39,947 కోట్లు, 31.01.2024 నాటికి పద్దెనిమిది (18) నెలవారీ వాయిదాలను సకాలంలో చెల్లించిన తర్వాత రూ.49,452 కోట్లుకి తగ్గాయి. రూల్ కింద ఓపెన్ యాక్సెస్ నియంత్రణను నివారించడానికి పంపిణీ సంస్థలు కూడా తమ ప్రస్తుత బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నాయి.

ఈ నిబంధన ద్వారా బకాయిలు లిక్విడేట్ కావడమే కాకుండా ప్రస్తుత బకాయిలు సకాలంలో చెల్లించడానికి మార్గాన్ని వేసాయి.  డిస్కమ్‌లలో ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించడంలో నిబంధన కీలక పాత్ర పోషించింది. ఇది వినియోగదారులకు 24x7 విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి అవసరమైన రంగంలో పెట్టుబడిని సులభతరం చేస్తుంది. ఆర్థికంగా సురక్షితమైన, ఆచరణీయమైన, స్థిరమైన విద్యుత్ రంగాన్ని (ప్రత్యేకంగా పంపిణీ విభాగం) కలిగి ఉండాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వివిధ పనితీరు అనుసంధానిత, ఫలితాల ఆధారిత పథకాలను అమలు చేస్తోంది. డిస్కమ్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలలో కావలసిన ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావడానికి ఆర్థిక, కార్యాచరణ సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించారు. 

తీసుకున్న చర్యల వివరాలు: 

                   (i)       రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీకి సకాలంలో చెల్లింపు జరిగేలా నిబంధనలు పెట్టడం

(ii)      టారిఫ్‌లు తాజాగా ఉన్నాయని నిర్ధారించడం.

(iii)     సకాలంలో ఎనర్జీ అకౌంటింగ్ మరియు ఎనర్జీ ఆడిట్ భరోసా.

(iv)     జెన్కోలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు.

(v)  రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో డిస్కమ్ ఒక ప్రణాళికను రూపొందిస్తే తప్ప, డిస్కమ్ నష్టపోతున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ డిస్కమ్ లేదా జెన్‌కో పిఎఫ్సి/ఆర్ఈసి నుండి రుణాలు పొందలేరు. సవరించిన వివేకవంతమైన నిబంధనలను అమలు చేయడం నష్టం తగ్గింపు కోసం దానిని కేంద్ర ప్రభుత్వానికి ఫైల్ చేస్తుంది. అలాగే ఆ నష్ట తగ్గింపు పథానికి కట్టుబడి ఉంటుంది.

(vi)  డిస్కామ్ నష్టాన్ని తగ్గించే చర్యలను అమలు చేస్తే జీడీపీలో 0.5 శాతం అదనపు రుణం తీసుకునే అవకాశాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు 

(vii)  డిడియుజిజెవై, ఐపిడిఎస్, సౌభాగ్య కింద మొత్తం రూ.1.85 లక్షల కోట్ల పనులు అమలు అయ్యాయి. 2,927 కొత్త ఉప-స్టేషన్లు జోడించడం జరిగింది. ఇప్పటికే ఉన్న 3,965 సబ్-స్టేషన్ల అప్‌గ్రేడేషన్ చేయడం జరిగింది. 6,92,200 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను అమర్చారు. 1,13,938 సర్క్యూట్ కిలోమీటరు (సికేఎం) ఫీడర్ వేరు చేయడం పూర్తయింది. 8.35 లక్షల సికేఎం హెచ్టి, ఎల్టి లైన్‌లు జోడించడం కానీ మార్చడం కానీ జరిగింది. అధిక నష్టం ఉన్న ప్రాంతాల్లో కవర్ వైర్ అందించడం జరిగింది. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్, భూగర్భ కేబులింగ్, ఏరియల్ బంచ్డ్ కేబుల్ మొదలైన పనులు జరిగాయి. .

(viii) ఇంకా, ఆర్థికంగా నిలకడగా, నిర్వహణాపరంగా సమర్థవంతమైన పంపిణీ రంగం ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకాన్ని (ఆర్డిఎస్ఎస్) ప్రారంభించింది. ఈ పథకంలో రూ. 3,03,758 కోట్లు మొత్తం వ్యయం కాగా, 2021-22 నుండి 2025-26 వరకు ఐదు సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం నుండి స్థూల బడ్జెట్ మద్దతు రూ. 97,631 కోట్లు ఉంది. ఇప్పటివరకు రూ. 1.22 లక్షల కోట్లు, స్మార్ట్ మీటరింగ్ పనులు రూ. 1.30 లక్షల కోట్లు మంజూరయ్యాయి. మంజూరైన మౌలిక సదుపాయాల పనులలో ప్రధానంగా 15.32 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల కొత్త/అప్‌గ్రేడ్ చేయాల్సిన హెచ్‌టి & ఎల్‌టి లైన్లు, 4.78 లక్షల కొత్తవి/ అప్‌గ్రేడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 1,110 కొత్తవి/ అప్‌గ్రేడ్ సబ్‌స్టేషన్లు మొదలైనవి ఉన్నాయి. ఈ పనుల అమలు చివరికి ఆర్థిక మెరుగుదలకు దోహదపడుతుంది. తుదకు వినియోగదారునికి ప్రయోజనం చేకూరుతుంది. 

                (ix)   నష్టాన్ని చవిచూస్తున్న డిస్కమ్‌లు నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటే తప్ప, కేంద్ర ప్రభుత్వానికి                 చెందిన ఏ పవర్ సెక్టార్ స్కీమ్ కింద నిధులను డ్రా చేసుకోలేవు.

ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్ మరియు నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్, ఈరోజు, ఫిబ్రవరి 8, 2024న లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2004217) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi