భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
భూభౌగోళిక శాస్త్రాల విభాగంలో అభివృద్ధి
Posted On:
07 FEB 2024 5:29PM by PIB Hyderabad
2014 నుండి ఈ క్రింది వాటిని కలిగి ఉన్న దేశంలో పరిశీలనా నెట్వర్క్ను పెంపొందించడం ద్వారా తీవ్రమైన వాతావరణ సంఘటనల పర్యవేక్షణ మరియు అంచనాను మెరుగుపరచడానికి ముఖ్యమైన పరిణామాలు చేయబడ్డాయి:
• 2014లో 15గా ఉన్న డాప్లర్ వాతావరణ రాడార్ల నెట్వర్క్ 2023లో 39కి పెంపు
• 2014లో 675గా ఉన్న ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లు 2023 నాటికి 1208కి పెంపు
• 2014లో 1350గా ఉన్న వర్షమాపినుల సంఖ్య 2023 నాటికి 1382కి పెంపు
• 2014లో 19గా ఉన్న హై విండ్ స్పీడ్ రికార్డర్ల సంఖ్య 2023 నాటికి 35కి పెంపు
• 2014లో 43 ఉండగా 2023 నాటికి 56కు పెరిగిన ఎగువ వాయు పరిశీలన వ్యవస్థలు.
• 2014లో GPS ఆధారిత పీబీ స్టేషన్ లేనప్పుడు 23 మాన్యువల్ పైలట్ బెలూన్ (పీబీ) స్టేషన్లు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ఆధారిత స్టేషన్లకు అప్గ్రేడ్ చేయబడ్డాయి.
• 2023లో 138 రన్వే విజువల్ రేంజ్లు.. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో 2014 నాటికి వీటి సంఖ్య 20
• భారతదేశంలోని విమానాశ్రయాలలో 2014 నాటికి 29గా ఉన్న డిజిటల్ కరెంట్ వెదర్ సిస్టమ్సన్ ఫ్రాంజిబుల్ మాస్ట్లు 2023లో 107కు చేరువయ్యాయి.
• 8 హెలిపోర్ట్ వాతావరణ పరిశీలన వ్యవస్థలు (హావోస్) దేశవ్యాప్తంగా వివిధ హెలిపోర్ట్లలో 2023లో ఏర్పాటు చేయబడ్డాయి, అయితే 2014లో హోవోస్ వ్యవస్త లేదు.
• 2014లో 3955గా ఉన్న వర్షపాత పర్యవేక్షణ పథకం స్టేషన్లు 2023లో జిల్లాల వారీగా 5896కు చేరుకున్నాయి.
వ్యవసాయ-వాతావరణ సలహా సేవలు (ఏఏఎస్) 2018 నుండి జిల్లా స్థాయి నుండి బ్లాక్ స్థాయికి విస్తరించబడ్డాయి. ప్రస్తుతం, ఏఏఎస్ దేశంలోని అన్ని వ్యవసాయపరంగా ముఖ్యమైన 700 జిల్లాలు మరియు దాదాపు 3100 బ్లాక్‌లకు అందించబడింది. భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ 2021లో డీప్ ఓషన్ మిషన్‌ను ప్రారంభించి, నీలి ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా లోతైన సముద్ర వనరులను అన్వేషించడానికి మరియు సముద్ర వనరులను స్థిరంగా వినియోగించుకోవడం కోసం ప్రారంభించింది. ఇప్పటివరకు, మధ్య హిందూ మహాసముద్ర బేసిన్‌లో పాలీమెటాలిక్ నోడ్యూల్స్ (నికెల్, కోబాల్ట్, కాపర్ మరియు మాంగనీస్ మొదలైనవి) మరియు మధ్య మరియు సౌత్ వెస్ట్ ఇండియన్ రిడ్జ్‌లలో హైడ్రోథర్మల్ సల్ఫైడ్ (కాపర్, జింక్, మొదలైనవి) అన్వేషణ కార్యక్రమం జరిగింది. ఈ అన్వేషణ ప్రాంతంలో హైడ్రోథర్మల్ కార్యకలాపాలు మరియు సల్ఫైడ్ మినరలైజేషన్ జోన్‌ల యొక్క కొన్ని ఆశాజనక స్థానాలను గుర్తించింది. కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2003789)
Visitor Counter : 115