పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
సాంప్రదాయ ఇంధనం మరియు క్లీనర్ ఇంధనానికి ఊహాజనిత పథం క్రమబద్ధమైన ఇంధన పరివర్తనకు అవసరం: పెట్రోలియం మంత్రి హర్దీప్ ఎస్ పూరి
ఇంధన దిగుమతి వనరుల వైవిధ్యం మరియు గ్యాస్ ధరల విధానంలో సంస్కరణలు భారతదేశంలో ఇంధన ధరలను అందుబాటులో ఉంచాయి: కేంద్ర మంత్రి పూరీ
Posted On:
07 FEB 2024 3:41PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం & సహజవాయువు మరియు గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ దిగుమతుల మూలాల వైవిధ్యం మరియు గ్యాస్ ధరల విధానంలో మార్పులతో సహా ఈ రంగంలో భారతదేశం యొక్క ఇటీవలి సంస్కరణల కారణంగా ప్రపంచం ధరలు పెరుగుతున్నా కూడా భారతదేశంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
ఇండియా ఎనర్జీ వీక్ 2024లో ''ఇండియా ఎనర్జీ వీక్ 2024లో దేశాలు మరియు పరిశ్రమలకు ఇంధన భద్రత కల్పించడం'' అనే మంత్రుల బృందంలో కేంద్ర మంత్రి, ఖతార్ ఇంధన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి సాద్ షెరిదా అల్ కాబీ, సహజ వనరుల మంత్రి విక్రమ్ భరత్ రిపబ్లిక్ ఆఫ్ గయానా, మరియు ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతం అల్ ఘైస్‌తో కలిసి పాల్గొన్నారు. వియూసిఏ అంటే అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత మరియు అస్పష్టత. ఇది స్థిరమైన, అనూహ్యమైన మార్పు యొక్క పరిస్థితిని వివరిస్తుంది. ఇది ఇప్పుడు కొన్ని పరిశ్రమలు మరియు వ్యాపార ప్రపంచంలోని ప్రాంతాలలో ప్రమాణంగా ఉంది.
ప్రపంచ ఇంధన ఉత్పత్తి మరియు సరఫరా పరిస్థితిని ప్రస్తావిస్తూ పరివర్తన సక్రమంగా జరిగేలా చూడడమే సవాలు అని కేంద్ర మంత్రి పూరీ పేర్కొన్నారు. మనం సాంప్రదాయ ఇంధనానికి ప్రాప్యతను కలిగి ఉన్నామని మరియు క్లీనర్ ఇంధనానికి ఊహాజనిత పరివర్తన ఉందని చెప్పారు. సమతుల్య మరియు వాస్తవిక సంభాషణ అవసరం అని మరియు శిలాజ ఇంధనాన్ని దూషించడం కాదు ”అని కేంద్ర మంత్రి పూరీ అన్నారు.
ఒపెక్ సెక్రటరీ జనరల్ అల్ ఘైస్ మాట్లాడుతూ ఇంధన పరివర్తన చాలా ముఖ్యమైనది అయినప్పటికీ "ఇంధన పరివర్తన అనేక మార్గాలను కలిగి ఉంటుంది. శక్తి పరివర్తనను మనం ఈ విధంగా చూడాలి. ఒపెక్‌లో మేము పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాము మరియు రాబోయే 20 సంవత్సరాలలో మాకు వందల బిలియన్ల పెట్టుబడి అవసరం అని చెప్పారు.
అల్ గైస్ శిలాజ ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడి అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. "డిమాండ్ పెరగడం కొనసాగించే అవకాశం ఉన్నందున మేము పెట్టుబడి పెట్టాలి" అన్నారాయన.
పునరుత్పాదక ఇంధన వనరులు ప్రపంచ ఇంధన అవసరాలను పూర్తిగా తీర్చలేవని ఖతార్ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి షెరిదా అల్ కాబీ అన్నారు. "మేము శిలాజ ఇంధనాన్ని ఉపయోగించము అని చెప్పడం బాధ్యత కాదని అన్నారాయన.
రిపబ్లిక్ ఆఫ్ గయానా సహజ వనరుల మంత్రి విక్రమ్ భరత్ మాట్లాడుతూ గయానా ఆఫ్‌షోర్‌లో కనుగొనబడిన కొత్త హైడ్రోకార్బన్ శ్రేయస్సు వైపు ఒక అడుగు అని అన్నారు. “కొత్త హైడ్రోకార్బన్ ఆఫ్‌షోర్ గయానా కనుగొనడం ప్రపంచం మనల్ని గమనించేలా చేసింది. మా విధానం చాలా సులభం. సాధ్యమైనంత వేగంగా భూమి నుండి హైడ్రోకార్బన్‌లను పొందడం మరియు సాంప్రదాయ రంగాలను నిర్మించడానికి ఉపయోగించడం ”అని అతను పేర్కొన్నాడు.
ఇండియా ఎనర్జీ వీక్ నేపథ్యం
ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఫిబ్రవరి 6 నుండి 9 వరకు గోవాలో నిర్వహించబడుతోంది. ఇది భారతదేశ అతిపెద్ద మరియు ఏకైక ఇంధన ప్రదర్శన మరియు సమావేశం. భారతదేశ శక్తి పరివర్తన లక్ష్యాల కోసం ఇది మొత్తం శక్తి విలువ గొలుసును ఒకచోట చేర్చి ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈఓలు మరియు నిపుణులతో ప్రధాన మంత్రి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించడం మరియు వాటిని ఎనర్జీ వాల్యూ చైన్‌లో ఏకీకృతం చేయడం భారతదేశ ఎనర్జీ వీక్ 2024లో ఒక ముఖ్యమైన నేపథ్యం. వివిధ దేశాల నుండి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు, 35,000 మందికి పైగా ఆహ్వానితులు మరియు 900 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, యూకే మరియు యూఎస్‌ఏ దేశాలప్రత్యేక కంట్రీ పెవిలియన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇంధన రంగంలో భారతీయ ఎంఎస్‌ఎంఈల ముందున్న వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రత్యేక మేక్ ఇన్ ఇండియా పెవిలియన్ కూడా నిర్వహించబడుతోంది.
****
(Release ID: 2003788)
Visitor Counter : 78