పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధికి భారతదేశం అతిపెద్ద మూలం అవుతుంది: ఐఈఏ


- పట్టణీకరణ, పారిశ్రామికీకరణ మరియు మధ్యతరగతి శ్రేయస్సు చమురు డిమాండ్ విస్తరణకు తోడ్పడతాయి

- స్వచ్ఛమైన వంట కార్యక్రమాలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో గత దశాబ్దంలో ఎల్.పి.జీ. దిగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి.

प्रविष्टि तिथि: 07 FEB 2024 4:23PM by PIB Hyderabad

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మరియు చైనాలో వృద్ధి ప్రారంభంలో మందగించిఆపై మా ఔట్లుక్ ప్రకారం  తిరోగమనంలోకి వెళుతుంది.. ప్రస్తుతం-2030 మధ్య ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధికి భారతదేశం అతిపెద్ద మూలం అవుతుంది అని 'ఇండియన్ ఆయిల్ మార్కెట్ ఔట్లుక్ టు 2030' రెండో ప్రతిలో తెలిపిందిఈ రోజు గోవాలో జరిగిన

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏవిడుదల చేసిన ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎడిషన్ ప్రతిలో వెల్లడించింది.

ప్రపంచ చమురు మార్కెట్లలో భారతదేశం యొక్క పాత్ర,, రానున్న దశాబ్దంలో గణనీయంగా విస్తరిస్తుందని అంచనా వేయబడింది. దాని ఆర్థిక వ్యవస్థజనాభా, జనాభాలో బలమైన వృద్ధికి ఇది ఆజ్యం పోస్తుందని అంచనా వేయబడింది. నివేదిక ప్రకారంపట్టణీకరణపారిశ్రామికీకరణసంపన్నమైన మధ్యతరగతి ప్రజల ఆవిర్భావం, చైతన్యం మరియు పర్యాటకం కోసం ఆసక్తిని కలిగి ఉండటంఅలాగే పరిశుభ్రమైన వంటకు ఎక్కువ ప్రాప్యతను సాధించే ప్రయత్నాలుచమురు డిమాండ్ విస్తరణకు ఆధారంపర్యవసానంగాభారతదేశం దాదాపు 1.2 ఎంబీ/డీ పెరుగుదలను నమోదు చేసే మార్గంలో ఉందిఅంచనా వేసిన 3.2 ఎండీ/బీ ప్రపంచ లాభాలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ 2030 నాటికి 6.6 ఎంబీ/డీకి చేరుకుంటుందిభారీ పారిశ్రామిక విస్తరణ అంటే చమురు డిమాండ్ వృద్ధికి డీజిల్గ్యాసోయిల్ అతిపెద్ద మూలందేశం యొక్క డిమాండ్లో దాదాపు సగం పెరుగుదల మరియు 2030 నాటికి మొత్తం ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధిలో ఆరవ వంతు కంటే ఎక్కువ అని నివేదిక వెల్లడించిందిఅంతేకాకుండాజెట్-కిరోసిన్ డిమాండ్ ప్రతి సంవత్సరం సగటున 5.9% వద్ద బలంగా పెరగడానికి సిద్ధంగా ఉందికానీ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ బేస్ నుండి ఈ వృద్ది నమోదుకావొచ్చు. భారతదేశ వాహన సముదాయం యొక్క విద్యుదీకరణ.. గణనీయమైన పెరుగుదలను నివారిస్తుంది కాబట్టి గ్యాసోలిన్ సగటున 0.7% పెరుగుతుంది. ఉత్పత్తి సౌకర్యాలలో పెట్రోకెమికల్ పరిశ్రమ పెట్టుబడులు ఫీడ్‌స్టాక్ డిమాండ్‌ను పెంచుతాయి కాబట్టి, ఎల్పీజీ వృద్ధి చిత్రాన్ని పూర్తి చేస్తుంది. గ్రామీణ జనాభాకు స్వచ్ఛమైన వంట కార్యక్రమాలను తీసుకురావడంలో భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది, గత దశాబ్దంలో ఎల్పీజీ దిగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. మరిన్ని కార్యక్రమాలు 2030 నాటికి డిమాండ్ వృద్ధిని కొనసాగించేలా చూస్తాయి. దేశీయంగా చమురు డిమాండ్‌ పెరగడంతో భారత చమురు కంపెనీలు రిఫైనింగ్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని నివేదిక పేర్కొంది. తదుపరి ఏడు సంవత్సరాల్లో, 1 ఎంబీ/డీ కొత్త రిఫైనరీ స్వేదనం సామర్థ్యం జోడించబడుతుంది - చైనా వెలుపల ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ. మేము ఇప్పటివరకు ఆశించిన 6.8 ఎండీ/డీ సామర్థ్యానికి మించి సామర్థ్యాన్ని పెంచే అనేక ఇతర పెద్ద ప్రాజెక్టులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి, అ విషయం నివేదిక జోడించబడింది. ఇంకా, కొత్త ఈవీలు మరియు ఇంధన సామర్థ్య మెరుగుదలలు కలిపి 2023-2030 కాలంలో 480 కేబీ/డీ అదనపు చమురు డిమాండ్‌ను నివారిస్తాయని నివేదిక పేర్కొంది. భారతదేశం రవాణా రంగాన్ని డీకార్బనైజేషన్ చేయడంలో జీవ ఇంధనాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. భారతదేశం యొక్క ఇథనాల్ బ్లెండింగ్ రేటు దాదాపు 12%తో ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. 2026 క్యూ4లో గ్యాసోలిన్‌లో దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండింగ్‌ను 20%కి రెట్టింపు చేయడానికి దేశం ఐదు సంవత్సరాల గడువును పెంచుకుంది.

ఇండియా ఎనర్జీ వీక్ నేపథ్యం

ఈ దిశలో మరో అడుగులో భాగంగా ఇండియా ఎనర్జీ వీక్ 2024,  6 నుండి 9 ఫిబ్రవరి, 2024 వరకు గోవాలో నిర్వహించబడుతోంది. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద మరియు ఏకైక శక్తి సంబంధిత ప్రదర్శన సమావేశం, ఇది మొత్తం శక్తి విలువ గొలుసును ఒకచోట చేర్చింది, ఇది భవిష్యత్తు ఇంధన అంచనాలకు ఉపయోగపడుతుంది. భారతదేశ శక్తి పరివర్తన లక్ష్యాలకు ఇది ఉత్ప్రేరకం. గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సీఈఓలు మరియు నిపుణులతో ప్రధాన మంత్రి రౌండ్ టేబుల్ కూడా నిర్వహించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడం మరియు వాటిని ఎనర్జీ వాల్యూ చైన్‌లో ఏకీకృతం చేయడం ఇండియా ఎనర్జీ వీక్ 2024కి ముఖ్యమైన దృష్టి అవుతుంది. వివిధ దేశాల నుండి దాదాపు 17 మంది ఇంధన శాఖల మంత్రులు, 35,000లకు పైగా అధికారలు, హాజరవుతున్నవారు మరియు 900 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, బ్రిటన్ మరియు అమెరికా - ఇది ఆరు ప్రత్యేక కంట్రీ పెవిలియన్‌లను కలిగి ఉంటుంది. ఇంధన రంగంలో భారతీయ ఎంఎస్ఎంఈలు ముందున్న వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రత్యేక మేక్ ఇన్ ఇండియా పెవిలియన్ కూడా నిర్వహించబడుతోంది.

***


(रिलीज़ आईडी: 2003781) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi