సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో బ‌హుళ‌-రాష్ట్ర స‌హ‌కార సంఘాలు

Posted On: 07 FEB 2024 5:47PM by PIB Hyderabad

బ‌హుళ‌-రాష్ట్ర స‌హ‌కార సంఘాల (ఎంఎస్‌సిఎస్‌) చ‌ట్టం, 2002 లోని నిబంధ‌న‌ల కింద న‌మోదు చేసుకున్న స‌హ‌కార సంఘాలు స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి గ‌ల స‌హ‌కార సంస్థ‌లుగా ప‌ని చేస్తూ, వాటి స‌భ్యుల‌కు జ‌వాబుదారీగా ఉంటాయి. ఎంఎస్ సిఎస్‌లు బ‌హుళ‌-రాష్ట్ర స‌హ‌కార సంఘాల చ‌ట్టం, 2002లోని నిబంధ‌న‌ల‌కు, సంఘం ఆమోదించిన ఉప‌చ‌ట్టాల బైలాస్ కింద చేసిన నియ‌మాల‌కు అనుగుణంగా అనుగుణంగా ప‌ని చేస్తాయి.
స‌మాజం పట్ల బాధ్య‌త‌, ఆందోళ‌న అన్న‌ది ఎంఎస్‌సిఎస్ చ‌ట్టం 2002 తొలి షెడ్యూల్‌లో పేర్కొన్న స‌హ‌కార సూత్రాల‌లో ఒక‌టి. అది ఈ విధంగా పేర్కొంటుందిః 
త‌మ స‌భ్యుల అవ‌స‌రాల‌పై దృష్టి సారిస్తూ, స‌హ‌కార సంఘాలు త‌మ స‌భ్యులు ఆమోదించిన విధానాల ద్వారా సంఘం నిల‌క‌డైన అభివృద్ధి కోసం ప‌ని చేస్తాయి. 
అంతేకాక‌, సెంట్ర‌ల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆప‌రేటివ్ సొసైటీస్ (సిఆర్‌సిఎస్‌) కార్యాల‌యం కోసం ఒక డిజిట‌ల్ పోర్ట‌ల్‌ను 06.08.2023న  ప్రారంభించడం జ‌రిగింది. త‌ద్వారా,  సామ‌ర్ధ్యాన్ని పెంచ‌డానికి, వ్యాపారం  సౌల‌భ్య‌త‌ను పెంచి, కాగిత‌ర‌హితంగా హ‌రిత, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల నిబంధ‌న‌ల‌ను ప్రోత్స‌హించేందుకు  స్నేహపూర్వ‌క నియ‌మాల‌తో  ఎంఎస్‌సిఎస్‌ల‌ అన్ని సంభాష‌ణ‌లు, ప‌ర‌స్ప‌ర చ‌ర్య‌లు  ఎల‌క్ట్రానిక్ రూపంలో నిర్వ‌హించేందుకు అవ‌కాశం ల‌భిస్తుంది. కాగిత‌రహితంగా ప‌ని చేయ‌డాన్ని బ‌లోపేతం చేసేందుకు ఎంఎస్‌సిఎస్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 120ఎ ( ఎంఎస్‌సిఎస్ (స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం ద్వారా ప్ర‌వేశ‌పెట్టి, 03.08.2023 నోటిఫై చేసిన‌)  ఎల‌క్ట్రానిక్ రూపంలో ద‌ర‌ఖాస్తు, ప‌త్రాలు, త‌న‌ఖీలు త‌దిత‌రాల‌ను దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. 
బ‌హుళ‌-రాష్ట్ర స‌హ‌కార సంఘాల‌కు వారి ఆర్ధిక సాధ్య‌త‌ను నిర్ధారించ‌డానికి ప‌ర‌ప‌తి, ఆర్ధిక వ‌న‌రుల ప్రాప్య‌త‌ను పెంచేందుకు ఈ క్రింది చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగిందిః 
స‌హ‌కార  పునరావాసం, పున‌ర్నిర్మాణం, అభ‌వృద్ధి నిధి (సిఆర్ఆర్‌డిఎఫ్‌)ను ఖాయిలా ప‌డ్డ బ‌హుళ  రాష్ట్ర స‌హ‌కార సంఘాల‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి,  ఎంఎస్‌సిఎస్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 63ఎ కు అనుగుణంగా అభివృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వం దానిని ఏర్పాటు చేసింది. ఎంసిఎస్‌సిఎస్ చ‌ట్టంలోని 63 ఎ ప్ర‌కారం వ‌రుస‌గా ముందు మూడు ఏళ్ళ‌పాటు లాభాల‌లో ఉన్న బ‌హుళ రాష్ట్ర సహ‌కార సంఘాలు కోటి రూపాయిలు లేదా ఆ బ‌హుళ రాష్ట్ర స‌హ‌కార సంఘం నిక‌ర లాభాల‌లో ఒక శాతం, రెండిటిలో ఏది త‌క్కువైతే అంత  ఈ నిధికి జ‌మ చేయాల‌ని నిర్దేశిస్తుంది.  
బోర్డు లేదా జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశాల‌లో పాలుపంచుకోవ‌డం లేదా బోర్డు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఎన్నిక కావ‌డం, ఓటింగు హ‌క్కు లేక‌పోవ‌డం స‌హా బ‌హుళ రాష్ట్ర స‌హ‌కార సంఘ నిర్వ‌హ‌ణలో ఎటువంటి ఆస‌క్తి లేని ఓటింగ్ ర‌హిత షేర్ల‌ను జారీ చేసేందుకు ఎంఎస్‌సిఎస్‌(స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం 2023 ద్వారా ఒక నిబంధ‌న‌ను రూపొందించారు.ఇది ఎంఎస్‌సిఎస్‌లు త‌మ మూల‌ధ‌నాన్ని పెంచుకోవ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. 
ఎంసిఎస్‌సి (స‌వ‌ర‌ణ) చ‌ట్టం, 2023 ప్ర‌కారం బ‌హుళ రాష్ట్ర స‌హ‌కార సంఘం బోర్డులో రెండు స్థానాల‌ను మ‌హిళ‌ల‌కు, ఒక స్థానాన్ని షెడ్యూల్డు కులాలు లేదా షెడ్యూల్డు తెగ‌ల‌కు రిజ‌ర్వ్ చేశారు. 
రాజ్య‌స‌భ‌లో ఒక ప్ర‌శ్న‌కు స‌హ‌కార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో ఈ వివ‌రాలు తెలిపారు. 
 

***
 


(Release ID: 2003773)
Read this release in: English , Urdu , Hindi