మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
డెయిరీ కోఆపరేటివ్ సొసైటీకి ఆదాయపు పన్ను మినహాయింపు
Posted On:
07 FEB 2024 5:13PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను చట్టం కింద సహకార సంఘాలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ క్రింది చర్యలను చేపట్టింది:
ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీకి పాలను సరఫరా చేస్తున్న ప్రాథమిక సహకార సంఘం కు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని 80పీ ప్రకారం యూనియన్‌ల సొసైటీకి పాల సరఫరాకు సంబంధించి మొత్తం లాభంపై మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హత కలిగి ఉంటుంది.
₹1 కోటి కంటే ఎక్కువ మరియు ₹10 కోట్ల వరకు ఉన్న ఆదాయంపై సహకార సంఘాలపై సర్‌ఛార్జ్ 12% నుండి 7%కి తగ్గించబడింది.
సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ కనీస పన్ను రేటు కూడా కంపెనీలతో సమానంగా సహకార సంఘాలకు 18.5% నుండి 15%కి తగ్గించబడింది.
ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ (పాక్స్ ) లేదా అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (పీ సి ఎ ఆర్ డీ బీ ) ద్వారా డిపాజిట్‌ను తిరిగి చెల్లించే చోట పీ సి ఎ ఆర్ డీ బీ దాని సభ్యునిచే నగదు రూపంలో, అటువంటి రుణం లేదా డిపాజిట్ మొత్తం ₹2 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే, లేదా అటువంటి రుణం పీ ఏ సీ లకు తిరిగి చెల్లించబడుతుంది ఎటువంటి జరిమానా పర్యవసానాలు తలెత్తవు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269 టీ సవరించబడింది . గతంలో ఈ పరిమితి ఒక్కో సభ్యునికి ₹20,000గా ఉండేది.
ఇతర గ్రహీతలకు టీ డీ ఎస్ యూ /ఎస్ 194 ఎన్ వర్తింపజేయడానికి సహకార సంఘాలకు నగదు ఉపసంహరణపై టీ డీ ఎస్ యూ కోసం రూ. 1 కోటి పరిమితి నుండి ₹ 3 కోట్లకు పరిమితి పెంచబడింది.
సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో రైతులకు ₹3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలను అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం వడ్డీ రాయితీని అందిస్తుంది మరియు వెంటనే తిరిగి చెల్లించినట్లయితే, అదనంగా 3% వడ్డీ రాయితీ ఇవ్వబడుతుంది మరియు ప్రభావవంతమైన వడ్డీ రేటు 4% వరకు తగ్గుతుంది. 2018-19 సంవత్సరం నుండి, స్వల్పకాలిక పంట రుణంతో సమానంగా స్వల్పకాలిక వర్కింగ్ క్యాపిటల్ రుణాలను (₹2 లక్షల/లబ్దిదారునికి) అందించడానికి భారత ప్రభుత్వం పశుసంవర్ధక మరియు మత్స్య పరిశ్రమ కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ (కే సీ సీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా నిన్న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2003771)
Visitor Counter : 131