భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పృథ్వి విజ్ఞాన్ (పృథ్వి) పథకం
Posted On:
07 FEB 2024 5:33PM by PIB Hyderabad
కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన "పృథ్వి విజ్ఞాన్ (పృథ్వి)" విస్తృత పథకాన్ని రూ.4,797 కోట్ల వ్యయంతో 2021-26 మధ్య కాలంలో అమలు చేయడానికి 5 జనవరి 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
పృథ్వి పథకం కింద ఐదు ఉప పథకాలు కొనసాగుతున్నాయి:
- ఎట్మాస్పియర్ & క్లైమేట్ రీసెర్చ్-మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ & సర్వీసెస్ (ఎక్రాస్)
- ఓషన్ సర్వీసెస్, మోడలింగ్ అప్లికేషన్, రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ (ఒ-స్మార్ట్)
- పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్ (పేసర్)
- సిస్మోలజీ అండ్ జియోసైన్సెస్ (సేజ్)
- రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ఔట్రీచ్ (రీచ్‌ఔట్)
పృథ్వి పథకం భూ వ్యవస్థ విజ్ఞానాల స్థాయిని మెరుగుపరుస్తుంది, దేశానికి నమ్మకమైన సేవలను అందించడానికి భూ వాతావరణంలోని మొత్తం ఐదు పొరలను పరిశోధిస్తుంది. పృథ్వి పథకం కింద పరిశోధన & అభివృద్ధి, కార్యాచరణ కార్యకలాపాలను మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ సంస్థల ఉమ్మడి సహకారం ద్వారా ఒక సమగ్ర పద్ధతిలో నిర్వహిస్తారు.
కేంద్ర భూ శాస్త్ర శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2003757)
Visitor Counter : 247