ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధునిక, సంప్రదాయ ఔషధాల మధ్య సమన్వయం సాధించేందుకు చర్యలు


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్సిలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సిహెచ్సిలు), జిల్లా ఆస్పత్రులలో ఒకే చోట వివిధ వైద్య విధానాల కింద ఔషధాలు అందుబాటులో ఉండేలా ఆయుష్ సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం.

ఆయుష్ను నూతన, రాబోయే ఎఐఐఎంఎస్లతో అనుసంధానం .

యోగా, సైక్లింగ్, ధ్యానం, వంటి స్వస్థత సంబంధిత కార్యకలాపాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో చేపడతారు.

Posted On: 06 FEB 2024 4:21PM by PIB Hyderabad

రోగులకు ఒకే చోట వివిధ వైద్య విధానాలకు సంబంధించిన ఔషధాలు అందుబాటులో ఉండే విధంగా  భారత ప్రభుత్వంప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్సిలు)కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సిహెచ్సిలు)జిల్లా ఆస్పత్రులలో ఆయుష్ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంది.దీనివల్ల రోగులకు ఒకే చోట వివిధ వైద్య విధానాలు అందుబాటులోకి వస్తాయి. ఆయుష్ సేవలను 470 జిల్లా ఆస్పత్రులకు , 3,149  సిహెచ్సిలుజిల్లాస్థాయికి దిగువనబ్లాక్ స్థాయికి ఎగువన 204 సిహెచ్సియేతర ఆరోగ్య సదుపాయాలు, 6,891 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, 2894 ఆరోగ్య సదుపాయాలనుసబ్ సెంటర్లకు పైన (ఎస్.సి)బ్లాక్ స్థాయికి దిగువన 2023 సెప్టెంబర్ 30 నాటికి ఏర్పాటు చేశారు.

ఆయుష్ను , కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కింద ఏర్పాటు చేయనున్న వివిధ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు (ఎయిమ్స్)లతో అనుంధానం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఆయుష్ మంత్రిత్వశాఖలు ఒక సంయుక్త సమన్వయ కమిటీ (జెసిసి)ని ఏర్పాటు చేశాయి. నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ తో ఆయుష్ ను సత్వరం అనుసంధానించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

 

స్వస్థత కు సంబంధించిన కార్యకలాపాలైన యోగసైక్లింగ్ధ్యానం వంటి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఎఎఎంఎస్)లలో నిర్వహిస్తారు. 31.01.2024 నాటికి యోగాతోపాటు, ఆయుష్మాన్ మీల్స్తోసహా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమం కింద మొత్తం 3.10 కోట్ల స్వస్థత సెషన్లను నిర్వహించారు.

 2018 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం  1,50,00 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యహెల్త్వెల్నెస్ కేంద్రాలు (ఎబి–హెచ్డబ్ల్యుసిలు) (వీటిని ప్రసస్తుతం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(ఎఎఎంలు)గా పేరు మార్చారు) దేశవ్యాప్తంగా డిసెంబర్ 2022 నాటికి ఏర్పాటు చేశారు.

31.01.2024 నాటికి మొత్తం 1,64,478 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటై పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సబ్ హెల్త్ సెంటర్లు (ఎస్.హెచ్.సిలు)ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్సిలు) గ్రామీణపట్టణ ప్రాంతాలలో విస్తారిత సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించే ఏర్పాటు చేశారు. ఇందులో వ్యాధి నిరోధక,   నివారణఉపశమన , పునరావాస సేవలు ఇమిడి ఉన్నాయి. ఇవి ఉచిత సేవలు. ఇవి ఆయా కమ్యూనిటీలకు స్థానికంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.

టెలికన్సల్టేషన్ సేవలు ఎఎఎం ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రజలకు స్పెషలిస్టు సేవలు వారి ఇంటివద్దకే అందుబాటులో ఉండే విధంగా చూస్తాయి. దీనివల్ల రోగులకు ఖర్చులు తగ్గడమే కాకుండా ప్రత్యేక వైద్య సేవలు అందించే కొరతను నివారించడానికినిరంతర ఆరోగ్య సంరక్షణకు ఇది ఉపకరిస్తుంది.

ఆయుష్మాన్ ఆరోగయ మందిర్లో 31.01.2024 నాటికి మొత్తం 19.41 కోట్ల టెలి కన్సల్ టేషన్లు జరిగాయి.

 

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2003389) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Hindi