సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చేతులతో మానవ వ్యర్థాలను, మురుగును శుభ్రం చేయడాన్ని, నిలిపివేసిన జిల్లాలుగా ప్రకటించుకున్న 729 జిల్లాలు.

Posted On: 06 FEB 2024 2:41PM by PIB Hyderabad

2024 జనవరి 31 వ తేదీ నాటికి దేశంలోని 766 జిల్లాలలోని 729 జిల్లాలుచేతులతో  మానవ వ్యర్థాల తొలగింపుమురుగును శుభ్రం చేసే విధానాన్ని నిలిపివేసిన జిల్లాలుగా ప్రకటించుకున్నాయి.. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ (ఎస్బిఎం–యు)2.0 ను 2021 అక్టోబర్ 1న ప్రారంభించారు. ఇందులో  వినియోగించిన నీటి యాజమాన్యం(యుడబ్ల్యుఎం) అనేది ప్రధాన లక్ష్యం. ఇది మురుగు కాల్వలుసెప్టిక్ ట్యాంకులలోకి  ప్రమాదకరమైన రీతిలో వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. దీనికి బదులు యంత్రాల సహాయంతో మురుగుకాల్వలుసెప్టిక్ ట్యాంకులను శుభ్రంచేస్తారు. ఇందుకు  లక్ష జనాభా కంటే తక్కువ  గల పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్.బిలు)  కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి సెప్టిక్ ట్యాంక్లను శుభ్రం చేసే యంత్రాల కొనుగోలు చేయడానికి నిధులు విడుదల చేస్తారు.

మ్యాన్హోల్ స్థానంలో మెషిన్ హొల్ ఏర్పాటు చేస్తారు. ఎస్.బి.ఎం–యు 2.0 కింద మురుగు కాల్వల శుద్దికిసెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందజేస్తారు. సఫాయి మిత్రలకు శిక్షణసామర్ధ్యాల నిర్మాణంప్రజా చైతన్యం దీనిద్వారా కల్పిస్తారు. మురుగు కాల్వల శుద్ధిసెప్టిక్ ట్యాంకులను శుభ్ర పరిచే కార్యకలాపాలలో కనీస ప్రమాణాలకు సంబంధించిన ప్రొటోకాల్ ను ఈ సందర్భంగా అభివృద్ధి చేశారు. దీనివల్ల సెప్టిక్ ట్యాంకులుమురుగు కాల్వల శుద్ధికి ప్రమాదకర పరిస్థితులలో చేతులతో వాటిని శుభ్రం చేసే పద్ధతిని గణనీయంగా తగ్గించడానికితద్వారా సఫాయి మిత్రల మరణాలను తగ్గించడానికి దీనిని రూపొందించారు.

చేతులతో మానవ వ్యర్ధాలను తొలగించే వారికి మురుగు కాల్వలుసెప్టిక్ ట్యాంకులలో కి దిగి ప్రమాదకరమైన రీతిలో వాటిని శుభ్రం చేసే వారికి మధ్య వ్యత్యాసాన్ని  చేతులతో వ్యర్ధాల తొలగింపు పని చేసేవారువారి పునరవాసానికి సంబంధించిన చట్టం 2013 లో పేర్కొన్నారు. మాన్యువల్ స్కావెంజర్ అనే పదానికి ఇచ్చిన నిర్వచనంలోఎవరైనా ఒక వ్యక్తిచేతులతో మానవ వ్యర్థాలను శుబ్రపరచడం తొలగించడంలేదా ఏ రూపంలో అయినా వాటిని చేతులతో అపరిశుభ్ర లెట్రిన్ లనుంచి లేదా ఓపెన్ డ్రెయిన్ నుంచి సేకరించి తొలగించడంలేదా రైల్వే ట్రాక్లనుంచి ఇలాంటి మానవ వ్యర్థాలను చేతులతో తొలగించడంలేదా ఇతర ప్రదేశాల నుంచి ఇలాంటి వాటిని చేతులతో తొలగించేపనిలోని వారిని ఎవరైనా వ్యక్తి లేదా స్థానిక సంస్థ లేదా పబ్లిక్ లేదా ప్రైవేట్ ఏజెన్సీ ఇలాంటి పనిలో నియమించుకునే వారిని మాన్యువల్ స్కావెంజర్లు అంటారు. ఇందుకు సంబంధించి కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేస్తాయి. మానవ వ్యర్థాలు పూర్తిగా కుళ్లిపోవడానికి ముందు దశ వరకు ప్రభుత్వం నోటిఫై చేసిన విధంగా మాన్యువల్ స్కావెంజింగ్ పదాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది.

మురుగు కాల్వ లేదా సెప్టిక్ ట్యాంక్ను ఒక ఉద్యోగి ప్రమాదకరంగా శుభ్రం చేయడం అంటేవీటిని శుభ్రం చేసేందుకు యజమాని ఎలాంటి యంత్రాలుఉపకరణాలు రక్షణ పరికరాలను అందించాల్సిన బాధ్యతను పాటించకపోవడం,   ఎప్పటికప్పుడు చట్టం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వారు రక్షణ చర్యలు పాటించేలా చేయక పోవడాన్ని ప్రమాదకర క్లీనింగ్ గా పరిగణిస్తారు.. ఈ సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారతా శాఖ మంత్రి శ్రీ రామ్ దాస్ అఠవాలే ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ తెలియజేశారు.

 

***



(Release ID: 2003387) Visitor Counter : 86


Read this release in: English , Hindi , Urdu