ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్ర వైద్య కళాశాలల నవీకరణ


ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఇన్‌స్టిట్యూట్‌ల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన 64 ప్రాజెక్టులు పూర్తయ్యాయి మరియు 11 ప్రాజెక్టుల పని పురోగతిలో ఉంది.

2020-21 నుండి 38 మెడికల్ కాలేజీలలో 1762 ఎంబిబిఎస్‌ సీట్లు మరియు 51 మెడికల్ కాలేజీలలో 2259 పీజీ సీట్లు ఆమోదించబడ్డాయి

Posted On: 06 FEB 2024 4:22PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్‌ఎస్‌వై)ని నిర్వహిస్తుంది, ఇది  తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతలో ప్రాంతీయ అసమానతలను సరిదిద్దడం మరియు దేశంలో నాణ్యమైన వైద్య విద్య కోసం సౌకర్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు/సంస్థలు (జిఎంసిఐలు) అప్-గ్రేడేషన్ అనే పథకంలోని రెండు భాగాలలో ఒకటి కేంద్ర ప్రాయోజిత పథకం (సిఎస్‌ఎస్‌).

పిఎంఎస్ఎస్‌వై కింద జిఎంసిఐల అప్‌గ్రేడేషన్‌లో విస్తృతంగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ (ఎస్‌ఎస్‌బి) మరియు/లేదా ట్రామా సెంటర్ / లేదా ఇతర సౌకర్యాలు మరియు/లేదా వైద్య పరికరాల సేకరణ నిర్మాణం ఉంటుంది.

ఈ పథకం కింద జిఎంసిఐల అప్‌గ్రేడేషన్ యొక్క 75 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఆమోదించబడ్డాయి. వాటిలో 64 పూర్తయ్యాయి మరియు 11 ఇంకా కొనసాగుతున్నాయి. 2020 నుండి పూర్తయిన ప్రాజెక్టులు మరియు కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు కొనసాగుతున్న ప్రాజెక్టుల రాష్ట్రాల వారీ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 
పిఎంఎస్‌ఎస్‌వై కింద ఆమోదించబడిన జిఎంసిల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్‌ల రాష్ట్రాల వారీ వివరాలు 2020 నుండి పూర్తయ్యాయి & ఇంకా కొనసాగుతున్నాయి.
 

వరుస క్రమం

రాష్ట్రం పేరు

2020 నుండి పూర్తయింది

కొనసాగుతోంది/పూర్తి కాలేదు.

కేంద్ర మద్దతు

1

ఆంధ్రప్రదేశ్

1

0

120

2

అస్సాం

1

0

120

3

బీహార్

2

4

706.81

4

ఛత్తీస్‌గఢ్

0

2

240

5

ఢిల్లీ

0

1

120

6

గోవా

1

0

120

7

గుజరాత్

0

1

120

8

హిమాచల్ ప్రదేశ్

1

0

120

9

జార్ఖండ్

1

0

120

10

కర్ణాటక

1

0

120

11

కేరళ

2

1

360

12

మహారాష్ట్ర

2

0

240

13

ఒడిశా

0

2

240

14

రాజస్థాన్

1

0

120

15

తెలంగాణ

2

0

240

16

పశ్చిమ బెంగాల్

2

0

120


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో రెండు సిఎస్‌ఎస్‌ని కూడా నిర్వహిస్తుంది. అవి ఎంబిబిఎస్‌ సీట్లను పెంచడానికి మరియు దేశంలో కొత్త పిజీ సీట్ల పెంపునకు ఇప్పటికే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడేషన్. ఈ పథకం కింద సివిల్ నిర్మాణాలు మరియు పరికరాల సేకరణ కోసం నిధులు అందించబడతాయి. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల భాగస్వామ్య విధానం ఈశాన్య మరియు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 90:10 మరియు ఇతరులకు 60:40 నిష్పత్తిలో ఉంది. పై సీలింగ్ ధర ఒక్కో సీటుకు రూ.1.20 కోట్లుగా నిర్ణయించబడింది. పథకం యొక్క మార్గదర్శకాల ప్రకారం సంబంధిత రాష్ట్రం/యూటీ ప్రాజెక్ట్ యొక్క అమలు ఏజెన్సీ. ఈ పథకం కింద 2020-21 నుండి 38 మెడికల్ కాలేజీలలో 1762 ఎంబిబిఎస్‌ సీట్లు మరియు 51 మెడికల్ కాలేజీలలో 2259 పీజీ  సీట్లు ఆమోదించబడ్డాయి. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

క్రమ సంఖ్య

రాష్ట్రం

కళాశాలల సంఖ్య

ఆమోదించబడ్డ యూజీ సీట్లు

కళాశాలల సంఖ్య

మంజూరైన పీజీ సీట్లు

1

ఆంధ్రప్రదేశ్

-

-

11

630

2

బీహార్

-

-

1

115

3

ఛత్తీస్‌గఢ్

3

150

-

-

4

గుజరాత్

2

100

1

64

5

హిమాచల్ ప్రదేశ్

6

120

-

-

6

జమ్మూ కాశ్మీర్

2

60

3

69

7

కేరళ

-

-

3

43

8

మధ్యప్రదేశ్

5

250

-

-

9

మహారాష్ట్ర

13

650

-

-

10

రాజస్థాన్

1

50

4

209

11

తెలంగాణ

-

-

9

232

12

ఉత్తర ప్రదేశ్

6

382

11

291

13

పశ్చిమ బెంగాల్

-

-

8

606


ఈరోజు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.

 
***

(Release ID: 2003385)
Read this release in: English , Urdu , Hindi