భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండస్ట్రీ4.0 సాంకేతికతల గురించి అవగాహన కల్పించేందుకు, శ్రామిక శక్తికి శిక్షణ ఇవ్వడం కోసం ఎంఎస్ఎంఇలకు తోడ్పాటును అందిస్తున్న సమర్థ్ కేంద్రాలు
Posted On:
06 FEB 2024 3:02PM by PIB Hyderabad
భారతీయ ఉత్పాదక వస్తువుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడం పథకం కింద భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 4 స్మార్ట్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, రాపిడ్ ట్రాన్సఫర్మేషన్ హబ్ (సమర్థ్ -SAMARTH- చురుకైన, అత్యాధునిక ఉత్పాదకత, శ్రీఘ్ర పరివర్తన కేంద్రం) కేంద్రాలను ఏర్పాటు చేసింది. అవి -
సెంటర్ ఫర్ ఇండస్ట్రీ 4.0 (సి4ఐ4) లాబ్ , పూణె
చురుకైన ఉత్పాదకత కోసం ఐఐటిడి- ఎఐఎ ఫౌండేషన్, ఐఐటి ఢిల్లీ
ఐ-4.0 ఇండియా @ ఐఐఎస్‌సి, బెంగళూరు
స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ డెమొ & డెవలప్‌మెంట్ సెల్, సిఎంటిఐ, బెంగళూరు.
సమర్థ్ కేంద్రాల కీలక విజయాలను దిగువన ఇవ్వడం జరిగిందిః
పారిశ్రామిక అభివృద్ధి 4.0 పరిష్కారాలతో కూడిన నమూనా కర్మాగారాన్ని సి4ఐ4 పూణె ప్రారంభించగా, సిఎంటిఐ ఉత్పత్తి ఆధారిత స్మార్ట్ కర్మాగారాన్ని ప్రారంభించింది.
ఇండస్ట్రీ 4.0 పరిష్కారాల 50 వినియోగ కేసుల అమలు మద్దతు కోసం సి4ఐ4, పూణె ద్వారా సంకలనం చేయడం జరిగింది.
పరిశ్రమ 4.0 పరిణితి & సంసిద్ధత అంచనా పరికర అభివృద్ధి, భారతీయ నిర్ధిష్ట భారతీయ ఉత్పాదక కంపెనీల కోసం పరిశ్రమ 4.0 పరిణితి నమూనా (14 ఎంఎం). ఈ కార్యక్రమం కింద సి4ఐ4 నేటివరకూ దాదాపు 200 కర్మాగారాల మూల్యాంకనాన్ని నిర్వహించింది.
పరిశ్రమ 4.0ను అనురించడాన్ని వేగవంతం చేసేందుకు తమ పరిశ్రమ 4.0 ప్రయాణంలో పరిణితిని అర్థం చేసుకునేలా ఎంఎస్ ఎంఇలకు తోడ్పడేందుకు సి414 ల్యాబ్, పూణె, ఉచిత ఆన్‌లైన్ అంచనా పరికరాన్ని వ్యక్తిగత మూల్యాంకనం కోసం ప్రారంభించింది.
6 స్మార్ట్ సాంకేతికతలు, 5 స్మార్ట్ పరికరాలు, 14 పరిష్కారాలను ఐ-4.0 ఇండియా @ ఐఐఎస్‌సి, బెంగళూరు అభివృద్ధి చేసింది.
ఐఐటి ఢిల్లీ, జూన్- జులై, 2021లో 82 వేసవి ఇంటర్న్‌షిప్‌లను అందించగా, జూన్- జులై 2022లో 61 వేసవి ఇంటర్న్‌షిప్‌లను అందించింది.
సిఎంటిఐ, బెంగళూరు దాదాపు 5000మంది ప్రొఫెషనళ్ళను స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ & ఇండస్ట్రీ 4.0లో శిక్షణ ఇచ్చింది.
ఎంఎస్ఎంఇలకు శ్రామిక శక్తికి శిక్షణను ఇచ్చేందుకు, పరిశ్రమ 4.0 సాంకేతికత గురించి దిగువ మార్గాల్లో వారికి సమర్థ్ కేంద్రాలు అవగాహన కల్పించడానికి తోడ్పాటు అందిస్తున్నాయి;
ఇండస్ట్రీ 4.0పై సెమినార్లు/ వర్క్‌షాప్‌లు, పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలను నిర్వహించడం;
ఇండస్ట్రీ 4.0 పట్ల అవగాహన కల్పించేందుకు పరిశ్రమలకు శిక్షణ;
ఎంఎస్ఎంఇలతో సహా స్టార్టప్‌లకు కన్సల్టెన్సీ (ఐఒటి హార్డ్‌వేర్, సాఫ్టవేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో) & ఇన్‌క్యుబేషన్ మద్దతును అందించడం.
ఈ సమాచారాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కృషన్ పల్ గుర్జర్ లోక్‌సభకు మంగళవారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2003379)
Visitor Counter : 97