శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్ - వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానాలు- ను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
06 FEB 2024 5:00PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పిఎంఒ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు 'నేషనల్ సైన్స్ డే 2024' థీమ్ (ఇతివృత్తం) ను విడుదల చేశారు. Ee ఏడాది (2024) జాతీయ సైన్స్ దినోత్సవానికి -వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానాలు- అనే ఇతివృత్తాన్ని ఖరారు చేశారు.
సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పట్ల ప్రజల ఆసక్తిని ప్రశంసలను పెంపొందించడం, అన్నింటి శ్రేయస్సు కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతల ద్వారా సవాళ్లను పరిష్కరించడానికి భారతీయ శాస్త్రవేత్తలు చేసిన కృషి పై bవిజయాలపై వ్యూహాత్మక దృష్టిని ఈ సంవత్సరం సైన్స్ దినోత్సవ ఇతివృత్తం ప్రతిబింబిస్తుంది.
ఈ థీమ్ ఒక కొత్త శకాన్ని సూచించడమే కాకుండా, దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రజలు , శాస్త్రీయ సమాజం భాగస్వామ్యం వహించడానికి, కలిసి పనిచేయడానికి, భారతదేశం, మొత్తం మానవాళి శ్రేయస్సుకు దోహదపడే అవకాశాన్ని కూడా అందిస్తుంది. సైన్స్ ద్వారా భారతదేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చడం అవసరాన్ని వివరిస్తూనే, మొత్తం మానవాళికి ప్రాముఖ్యత ఉన్న అంశాలను ప్రస్తావించాల్సిన అవసరాన్ని కూడా ఈ థీమ్ నొక్కి చెబుతుంది.
'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని (ఎన్ ఎస్ డి) జరుపుకుంటారు. భారత ప్రభుత్వం 1986లో ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది. ఇదే రోజున సర్ సి.వి.రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నందుకు గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతివృత్త ఆధారిత సైన్స్ కమ్యూనికేషన్ కార్యక్రమాలను నిర్వ హిస్తారు. థీమ్ ప్రారంభంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మొదలవుతాయి.
ఇటీవలి సైన్స్ విజయాల నేపథ్యంలో, గత 10 సంవత్సరాలలో భారతదేశ పెరుగుతున్న గమనాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని స్పష్టంగా చెప్పవచ్చు. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ పబ్లికేషన్స్ లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 దేశాల్లో ఒకటిగా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జిఐఐ)లో 40వ స్థానంలో ఉంది. పేటెంట్ ఫైలింగ్ 90,000 దాటింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆస్ట్రానమీ, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, సెమీకండక్టర్స్, క్లైమేట్ రీసెర్చ్, స్పేస్ రీసెర్చ్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో దేశంలో ఎస్ అండ్ టీ ఎకోసిస్టమ్ బలోపేతం కావడమే ఇందుకు కారణం. ప్రయోగశాల నుంచి చంద్రుడి వరకు భారతీయ శాస్త్రీయ ఆవిష్కరణలు చేరుకున్నాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
బలమైన వ్యాక్సిన్ అభివృద్ధి సామర్ధ్యం పరంగా కూడా భారతదేశం గుర్తింపు పొందింది. ఇది కోవిడ్ మహమ్మారి సమయంలో నిరూపించబడింది. క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచ పురోగతికి పోటీగా భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. భారతీయ శాస్త్రీయ పురోగతి ప్రభావం సామాన్యులకు 'ఈజ్ ఆఫ్ లివింగ్'ను గణనీయంగా పెంచుతోంది.
డి ఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్ తన స్వాగతోపన్యాసంలో, ఎన్ ఎస్ డి వేడుకలను ప్రారంభించి, 2024 థీమ్ తో ముందుకు సాగుతున్నప్పుడు, మన శాస్త్రీయ ప్రయత్నాలకు మన దేశ భవిష్యత్తును రూపొందించడమే కాకుండా ప్రపంచ పురోగతికి గణనీయంగా దోహదపడే శక్తి ఉందని స్పష్టమవుతోందని అన్నారు.
"రాష్ట్రాల ఎస్ అండ్ టి కౌన్సిల్ లకు చెందిన శాస్త్రీయ సమాజం కూడా ఎన్ ఎస్ డి థీమ్ ప్రారంభం లో చేరినందున, మనమంతా కలసి సైన్స్ పరిశోధనలను మరింత ప్రోత్సహించే పర్యావరణ వ్యవస్థను సృష్టించగలమని, మరింత శ్రేయస్సు కోసం ఉపయోగించు కోవడానికి దేశవ్యాప్తంగా సైన్స్ పరివర్తన శక్తిని ఉపయోగించుకోగలమని నేను చెప్పగలను" అని ఆయన అన్నారు.
బయోటెక్నాలజీ విభాగం (డి బి టి ) కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే, సిఎస్ఐఆర్ డి జి డాక్టర్ కలైసెల్వి, ఎన్ సి ఎస్ టి సి , డి ఎస్ టి హెడ్ డాక్టర్ రష్మీ శర్మ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
<><><>
(Release ID: 2003370)
Visitor Counter : 314