సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ముస్సోరీ ఎన్ సిజిజి లో ఈ రోజు ప్రారంభమైన మాల్దీవుల సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు 32వ సామర్ధ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం


మాల్దీవుల సివిల్ సర్వీసెస్ కమిషన్ తో కుదిరిన ఒప్పందంలో భాగంగా 20219-24 మధ్య విజయవంతంగా 1000 మంది మాల్దీవుల సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు సామర్ధ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ఎన్ సిజిజి

మాల్దీవుల విద్యా రంగంలో విధులు నిర్వహిస్తున్న వారికి 32వ సామర్ధ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ

Posted On: 06 FEB 2024 5:02PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ముస్సోరీ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్( ఎన్ సిజిజి) లో ఈ రోజు  మాల్దీవుల సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు  32వ సామర్ధ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 2024 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమం అమలు జరుగుతుంది. మాల్దీవుల  విద్యా రంగానికి చెందిన 40 మంది శిక్షణకు హాజరవుతున్నారు. 

భారతదేశం మాల్దీవులు మధ్య సంబంధాలు,  ఫిన్ టెక్ అండ్ ఇన్ క్లూజన్, పబ్లిక్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్, ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాంకేతిక అంశాల వినియోగం, వాతావరణ మార్పులు- వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలు, విధి నిర్వహణలో మార్పులు, తీర ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పద్ధతులు, భారతదేశంలో అమలు జరుగుతున్న డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు, నాయకత్వం, సమన్వయము, సమాచార నైపుణ్యాలు, ఈ- పరిపాలన, డిజిటల్ ఇండియా, లింగ సమానత్వం అభివృద్ధి,  2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా మాల్దీవుల అధికారులు  స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐటిడిఎ) డెహ్రాడూన్  డెహ్రాడూన్ లోని స్మార్ట్ స్కూల్ ను సందర్శిస్తారు.

మాల్దీవుల సివిల్ సర్వీసెస్ కమిషన్ తో కుదిరిన ఒప్పందంలో భాగంగా 20219-24 మధ్య 1000 మంది మాల్దీవుల సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు సామర్ధ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమాలను  ఎన్ సిజిజి   విజయవంతంగా నిర్వహించింది. 

శిక్షణ కార్యక్రమాలకు  గత 5 సంవత్సరాలుగా మాల్దీవులకు  శాశ్వత కార్యదర్శులు, సెక్రటరీ జనరల్స్,  డిప్యూటీ పర్మినెంట్ సెక్రటరీలు హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ప్రజలను చేరువ చేయడానికి   భారతదేశంలో అమలు జరుగుతున్న  ప్రధాన కార్యక్రమాలు, విధానాలపై శిక్షణ కార్యక్రమాల ద్వారా మాల్దీవుల అధికారులు అవగాహన పొందారు. భారతదేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను తమ దేశంలో అమలు చేస్తున్న విధానంపై మాల్దీవుల అధికారులు వివరించారు.  

 

 

***

 



(Release ID: 2003366) Visitor Counter : 36


Read this release in: English , Urdu , Hindi