రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.1014.59 కోట్ల వ్యయంతో అరుణాచల్ ప్రదేశ్‌లో 'ఖర్సాంగ్-మియావో-విజయ్‌నగర్' రహదారి నిర్మాణానికి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం

Posted On: 06 FEB 2024 3:21PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌-913 లోని (ఫ్రాంటియర్ హైవే) గాంధీగ్రామ్ సెక్షన్‌ పరిధిలో, రూ. 1014.59 కోట్ల వ్యయంతో 'ఖర్సాంగ్-మియావో-విజయ్‌నగర్' జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.

ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కేంద్ర మంత్రి, ఈపీసీ విధానంలో నిర్మించే 61.55 కి.మీ. రహదారి సరిహద్దు ప్రాంతాలకు మెరుగైన అనుసంధానతను, సామాజిక-ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతం నుంచి వలసలను అరికట్టడంతో పాటు, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల వైపు విలోమ వలసలను ప్రోత్సహించడం ఈ రహదారి నిర్మాణం లక్ష్యంగా వెల్లడించారు.

కీలక నదీ పరీవాహక ప్రాంతాలను అనుసంధానించడానికి, కొత్త జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ రహదారి తోడ్పడుతుందని; ప్రకృతి అందాలతో తులతూగే, తక్కువ జనాభా కలిగిన ఎగువ అరుణాచల్ ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

 

***


(Release ID: 2003365) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Hindi , Assamese