సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సి జి జి) లో బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్ ల కోసం 69వ, 70వ సామర్థ్య పెంపు కార్యక్రమాలు ప్రారంభం
భారత్-బంగ్లాదేశ్ మధ్య సహకారం కోసం కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం 2024 ఫిబ్రవరి వరకు బంగ్లాదేశ్ కు చెందిన 2557 మంది అధికారులకు ఎన్ సి జి జి ద్వారా శిక్షణ
భూమి నిర్వహణ పద్ధతులు, సాధికారత, జవాబుదారీతనం , ప్రజా సేవల డెలివరీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పై 69వ , 70వ సామర్థ్య పెంపు కార్యక్రమాల దృష్టి
Posted On:
06 FEB 2024 4:12PM by PIB Hyderabad
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం ఇ ఎ) భాగస్వామ్యంతో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సి జి జి) బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్ల కోసం రెండు వారాల 69, 70 బ్యాచ్ ల సామర్థ్య పెంపు (కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్- సి బి పి) కార్యక్రమాలను ముస్సోరీలోని తన ఎన్ సి జి జి) క్యాంపస్ లో ప్రారంభించింది. 1,500 మంది సివిల్ సర్వెంట్లకు సిబిపి మొదటి దశ పూర్తయిన తరువాత, 2025 నాటికి మరో 1,800 మంది సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఎన్ సి జి జి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది, ఇందులో 940 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు.
డి ఎ ఆర్ పి జి కార్యదర్శి, నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ వి.శ్రీనివాస్ ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఢాకాలోని భారత హైకమిషన్ సహకారంతో భూ యాజమాన్య పద్ధతులు, భూసేకరణ, భూ రికార్డుల డిజిటలైజేషన్, భూ వినియోగ ప్రణాళిక, క్షేత్రస్థాయిలో ప్రభుత్వోద్యోగులకు అవసరమైన ఇతర నైపుణ్యాలపై దృష్టి సారించేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. పరిపాలన, ప్రజాసేవల అందజేత ను పెంపొందించడానికి భారతదేశంలో అమలు చేసిన విజ్ఞానం , ఆవిష్కరణల మార్పిడిని సులభతరం చేయడం ఈ కార్యక్రమం ప్రాధమిక లక్ష్యం. భారతదేశ అమృత్ కాల సమయంలో అమలు జరుగుతున్న తదుపరి తరం పరిపాలనా సంస్కరణలను అర్థం చేసుకోవడానికి చురుకుగా ప్రయత్నించాలని అధికారులను కోరారు.
కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.పి.సింగ్ ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ, పాలనా దృక్పథాన్ని మార్చడం; అందరికీ గృహనిర్మాణం; డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, తీరప్రాంతానికి సంబంధించి విపత్తు నిర్వహణ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, స్వామిత్వ పథకం: గ్రామీణ భారతదేశానికి ఆస్తి ధ్రువీకరణ, నాయకత్వం, సమన్వయం, కమ్యూనికేషన్, ఇ-గవర్నెన్స్ ,డిజిటల్ ఇండియా,జిఇఎమ్:పాలనలో పారదర్శకతను తీసుకురావడం, పిఎం ముద్ర యోజన, భూసేకరణ, పబ్లిక్ పాలసీ- అమలు, సర్క్యులర్ ఎకానమీ, ఎన్నికల నిర్వహణ మొదలైన దేశంలో చేపట్టిన చొరవలను ఎన్ సి జి జి పంచుకుంటోందని వివరించారు.
ఎం ఇ ఎ భాగస్వామ్యంతో ఎన్ సి జి జి బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, నేపాల్ భూటాన్, మయన్మార్, ఇథియోపియా, ఎరెట్రియా, కంబోడియా వంటి 17 దేశాల సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చింది. కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎ పి సింగ్, అసోసియేట్ కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ముఖేష్ భండారీ, ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ సంజయ్ దత్ పంత్, ఎన్ సి జి జి ప్రత్యేక కెపాసిటీ బిల్డింగ్ టీమ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
<><><>
(Release ID: 2003358)
Visitor Counter : 85