జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తలసరి నీటి లభ్యత

Posted On: 05 FEB 2024 6:05PM by PIB Hyderabad

ఏదైనా ప్రాంతం లేదా దేశం యొక్క సగటు వార్షిక నీటి లభ్యత ఎక్కువగా హైడ్రో-వాతావరణ శాస్త్ర మరియు భౌగోళిక కారకాలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, ఒక వ్యక్తికి నీటి లభ్యత దేశ జనాభాపై ఆధారపడి ఉంటుంది. జనాభా పెరుగుదల కారణంగా దేశంలో తలసరి నీటి లభ్యత తగ్గుతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్వహించిన “స్పేస్ ఇన్‌పుట్‌ 2019 గణాంకాలను ఉపయోగించి భారతదేశంలో నీటి లభ్యతను తిరిగి అంచనా వేయడం-’ అనే అధ్యయనం ఆధారంగా, 2021 మరియు 2031 సంవత్సరాల్లో సగటు వార్షిక తలసరి నీటి లభ్యత వరుసగా 1486 క్యూబిక్ మీటర్లు మరియు 1367 క్యూబిక్ మీటర్లుగా అంచనా వేయబడింది. 1700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ వార్షిక తలసరి నీటి లభ్యత.. నీటి ఒత్తిడి పరిస్థితిగా పరిగణించబడుతుంది. అయితే 1000 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ వార్షిక తలసరి నీటి లభ్యత నీటి కొరత పరిస్థితిగా పరిగణించబడుతుంది.

'నీరు' అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం  అయినందున, తలసరి నీటి లభ్యత సమస్యపై సానుకూల ప్రభావం చూపే నీటి వనరుల పెంపుదల, పరిరక్షణ మరియు సమర్థవంతమైన నిర్వహణ కోసం చర్యలు ప్రధానంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలచే చేపట్టబడతాయి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు అనుబంధంగా, కేంద్ర ప్రభుత్వం వారికి వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ద్వారా సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

భారత ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో 2024 నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటి సరఫరాను అందించడానికి జల్ జీవన్ మిషన్ (జేజేఎం) ను అమలు చేస్తోంది.

భారత ప్రభుత్వం 1 అక్టోబర్ 2021న అమృత్ 2.0ని ప్రారంభించింది. ఇది దేశంలోని అన్ని చట్టబద్ధమైన పట్టణాలను కవర్ చేస్తూ నీటి సరఫరా యొక్క సార్వత్రిక కవరేజీని నిర్ధారించడానికి మరియు నగరాలను 'నీటి భద్రత' ప్రాంతాలుగా మార్చడానికి చర్యలు చేపడుతుంది.

నీటి యొక్క సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం 2015..-------16  నుండి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంఎస్ కే వై)ని అమలు చేస్తోంది.  ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన -యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) కింద, 2016-..17లో కొనసాగుతున్న 99 ప్రధాన/మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు మరియు 7 దశలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ మేరకు రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరిగాయి. వీటిలో 58 ప్రాధాన్య ప్రాజెక్టుల యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) పనులు పూర్తయ్యాయని నివేదించబడింది. తేదీ. 2021..-22 నుండి 2025..-26 వరకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనను పొడిగించడం భారత ప్రభుత్వంచే ఆమోదించబడింది. ఈ పథకం  మొత్తం వ్యయం రూ. 93,068.56 కోట్లు.

కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ (సీఏడీ డబ్ల్యూఏఎం) ప్రోగ్రామ్ 2015-..16 నుండి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా - హర్ ఖేత్ కో పానీ కిందకు తీసుకురాబడింది. కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్  పనులను చేపట్టడం , అంతేకాకుండా సృష్టించబడిన నీటిపారుదల సామర్థ్యాన్ని వినియోగాన్ని మెరుగుపరచడం మరియు భాగస్వామ్యాయుత నీటిపారుదల నిర్వహణ (పార్టిసిపేటరీ ఇరిగేషన్ మేనేజ్ మెంట్ ) ద్వారా స్థిరమైన ప్రాతిపదికన వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

నీటిపారుదల, పారిశ్రామిక మరియు గృహ రంగంలో నీటి సమర్ధవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, నియంత్రించడం మరియు నియంత్రించడం కోసం బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియెన్సీ (బీడబ్ల్యూయూఈ) ఏర్పాటు చేయబడింది. దేశంలో నీటిపారుదల, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు మొదలైన వివిధ రంగాలలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బ్యూరో ఒక ఫెసిలిటేటర్‌గా ఉంటుంది.

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోని రైతులను నీటి అవసరాలు తక్కువగా ఉన్న పంటలు పండించడంతోపాటు  నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ వాతావరణానికి సరిపోయే విధానం. అంతేకాకుండా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పర్యవారణ అనుకూలమైన విధానమిది. అందుకే కేంద్రప్రభుత్వం ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు సహీ ఫసల్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించి,  రైతులకు అవగాహన కల్పిస్తోంది.

భవిష్యత్తు కోసం నీటిని సంరక్షించే లక్ష్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 24 ఏప్రిల్, 2022న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున మిషన్ అమృత్ సరోవర్‌ను ప్రారంభించారు. దేశంలోని ప్రతి జిల్లాలో 75 నీటి వనరులను అభివృద్ధి చేయడం మరియు పునరుజ్జీవింపజేయడం ఈ మిషన్ లక్ష్యం.

జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్” (జేఎస్ఏ: సీటీఆర్) - 2023 ప్రచారాన్ని.. జేఎస్ఏల శ్రేణిలో నాల్గో శ్రేణిది కాగా.., గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 04.03.2023న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో (గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు) ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. 04 మార్చి 2023 నుండి 30 నవంబర్ 2023 వరకు అమలు కోసం - రుతుపవనాల ముందు మరియు రుతుపవన కాలంలో "తాగునీటికి మూలం సుస్థిరత" అనే ప్రధాన ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా ఈ ప్రచారం అమలు చేయబడింది. ఈ ప్రచారం (1) నీటి సంరక్షణ మరియు వర్షపు నీటి సంరక్షణ (2) అన్ని నీటి వనరులను లెక్కించడం, జియో-ట్యాగింగ్ & జాబితా తయారు చేయడం; తయారీ దాని ఆధారంగా నీటి సంరక్షణ కోసం శాస్త్రీయ ప్రణాళికలు (3) అన్ని జిల్లాల్లో జల్ శక్తి కేంద్రాల ఏర్పాటు (4) తీవ్రమైన అడవుల పెంపకం మరియు (5) అవగాహన కల్పించడం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

నీటి క్షీణతను నియంత్రించడానికి మరియు వర్షపు నీటి సేకరణ/సంరక్షణను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర ముఖ్యమైన చర్యలు కింది యూఆర్ఎల్ లో అందుబాటులో ఉన్నాయి:

https://cdnbbsr.s3waas.gov.in/s3a70dc40477bc2adceef4d2c90f47eb82/uploads/2023/02/2023021742.pdf

ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


 

***


(Release ID: 2003119) Visitor Counter : 227


Read this release in: English , Urdu , Hindi