జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ అమలుపై ప్రగతి నివేదిక

Posted On: 05 FEB 2024 5:59PM by PIB Hyderabad

దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు తగిన పరిమాణంలో, నిర్దేశించిన నాణ్యతతో మరియు క్రమం తప్పక దీర్ఘకాలిక ప్రాతిపదికన సురక్షితమైన కుళాయి తాగు నీటి సరఫరా కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా, భారత ప్రభుత్వం ఆగస్టు 2019లో రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయడానికి జల్ జీవన్ మిషన్ (జే జే ఎం)ని ప్రారంభించింది. తాగునీరు అనేది ఒక రాష్ట్ర అంశం, అందువల్ల ప్రణాళిక, ఆమోదం, అమలు, కార్యాచరణ, మరియు జల్ జీవన్ మిషన్ కింద ఉన్నవాటితో సహా తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ రాష్ట్ర/యూ టీ ప్రభుత్వాలకు చెందుతుంది. సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించడం ద్వారా భారత ప్రభుత్వం రాష్ట్రాలకు మద్దతు ఇస్తుంది.

 

జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పటి నుండి, గ్రామీణ గృహాలకు కుళాయి నీటి ప్రాప్యతను పెంపొందించే దిశగా దేశంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఆగస్టు 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభంలో, కేవలం 3.23 కోట్ల (16.8%) గ్రామీణ కుటుంబాలు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్‌లను కలిగి ఉన్నట్లు నివేదించబడింది. ఇప్పటివరకు, 30.01.2024 నాటికి రాష్ట్రాలు/యుటిలు నివేదించిన ప్రకారం, 10.98 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు జే జే ఎం  కింద కుళాయి నీటి కనెక్షన్‌లు అందించబడ్డాయి. ఈ విధంగా, 30.01.2024 నాటికి, దేశంలోని 19.27 కోట్ల గ్రామీణ కుటుంబాలలో, 14.21 కోట్ల (73.76%) కంటే ఎక్కువ కుటుంబాలు తమ ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నట్లు నివేదించబడింది.

 

జే జే ఎం గ్రామీణ గృహాల కవరేజీ కోసం సార్వత్రిక విధానాన్ని అనుసరిస్తున్నందున, కుళాయి నీటి కనెక్షన్ల లబ్ధిదారుల కుల ఆధారిత వివరాలు భారత ప్రభుత్వ స్థాయిలో నిర్వహించబడవు. అయితే, మిషన్ కింద, స్వచ్ఛమైన కుళాయి నీటి సరఫరా కోసం కుళాయి నీటి కనెక్షన్‌లను అందించడానికి ఎస్ సి/ ఎస్ టీ మెజారిటీ గ్రామాలు మరియు ఆకాంక్ష జిల్లాల్లోని గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంకా, ఈ ప్రాంతాలలో కవరేజీకి ప్రాధాన్యత ఇవ్వడానికి నిధులను కేటాయిస్తున్నప్పుడు, ఎస్ సి/ ఎస్ టీ ఆధిపత్య ప్రాంతాల్లో నివసించే జనాభాకు 10% ప్రాధాన్యత తో కేటాయించబడుతుంది. ఇంకా, 75 ప్రత్యేక బలహీన  గిరిజన సమూహాల (పీ వీ టీ జీ ) అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల (పీ వీ టీ జీ) అభివృద్ధికి ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ని కూడా భారత ప్రభుత్వం ఆమోదించింది.

 

ఈ విషయాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

 

***



(Release ID: 2002958) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Hindi