జల శక్తి మంత్రిత్వ శాఖ
హర్ ఘర్ జల్ చొరవ
Posted On:
05 FEB 2024 6:00PM by PIB Hyderabad
దేశంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు క్రమం తప్పకుండా, దీర్ఘకాలం నిర్ణీత నాణ్యత కలిగిన సురక్షితమైన & తాగు నీటి సరఫరాను కుళాయిల ద్వారా తగినంత పరిమాణంలో సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాధన కోసం భారత ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేసేందుకు జల జీవన్ మిషన్‌ను ఆగస్టు 2019లో ప్రారంభించింది. మంచినీరు అన్నది రాష్ట్ర జాబితాలోని అంశం, కనుక, జలజీవన్ మిషన్ కిందకు వచ్చే పథకాలు సహా మంచినీటి సరఫరాకు సంబంధించిన ప్రణాళిక, ఆమోదం, అమలు, కార్యాచరణ, మంచినీటి సరఫరా పథకాల నిర్వహణ అన్నది రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల బాధ్యత. సాంకేతిక, ఆర్ధిక సహాయం ద్వారా రాష్ట్రాలకు భారత ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది.
జలజీవన్ మిషన్‌ను ప్రారంభించిన తర్వాత గ్రామీణ ఆవాసాలకు కుళాయి నీరు అందుబాటును పెంచే దిశగా చెప్పుకోదగిన పురోగతి దేశంలో సాధించడం జరిగింది. జలజీవన్ మిషన్‌ను 2019 ఆగస్టులో ప్రారంభించినప్పుడు కేవలం 3.23 కోట్ల (16.8%) గ్రామీణ ఆవాసాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నట్టుగా నమోదైంది. నేటివరకూ, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 30.01.2024 నాటికి నివేదించిన వివరాల ప్రకారం అదనంగా 10.98 కోట్ల గ్రామీణ ఆవాసాలకు జెజెఎం కింద పంపునీటి కనెక్షన్లను అందించారు. దీనితో 30.01.2024 నాటికి దేశంలో 19.27 కోట్ల గ్రామీణ ఆవాసాలలో, 14.21 కోట్ల (73.76%) ఆవాసాలలో కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతున్నట్టు నివేదించడం జరిగింది.
జెజెఎం కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం, ఒక గ్రామంలో అన్ని గ్రామీణ ఆవాసాలకు కుళాయి కనెక్షన్లను ఇచ్చిన తర్వాత, ఈ పథకాన్ని అమలు చేసే విభాగం గ్రామపంచాయితీకి పూర్తి అయిన సర్టిఫికెట్‌ను అందచేసి, ఆ గ్రామాన్ని హర్ ఘర్ జల్ గ్రామంగా జెజెఎం-ఐఎంఐఎస్‌లో గుర్తిస్తుంది. అనంతరం, గ్రామపంచాయతీలు తమ గ్రామ సభ సమావేశంలో పని పూర్తి అయిన నివేదికను చదివిన అనంతరం, తమను తాము హర్ ఘర్ జల్ గ్రామంగా సర్టిఫై చేస్తూ అధికారికంగా తీర్మానాన్ని ఆమోదిస్తుంది. అమలు విభాగం అందించిన సర్టిఫికెట్టు, గ్రామ సభ ఆమోదించిన తీర్మానం, గ్రామ సభ జరుగుతున్న సమయంలో తీసిన చిన్న వీడియో జెజెఎం డాష్‌బోర్డులో కనిపిస్తుంది. దీనితో జెజెఎం-ఐఎంఐఎస్‌లో గ్రామాన్ని సర్టిఫైడ్‌గా గుర్తించి, ముద్రవేస్తారు. ఈ రెండు ప్రక్రియల్లో జాప్యం కారణంగా, హర ఘర్ జల్ నివేదించి, గుర్తించిన గ్రామాల మధ్య తేడా ఉన్నట్టనిపిస్తుంది.
రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు 30.01.2024 నాటికి ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 2.02 లక్ష గ్రామాలు హర్‌ఘర్ జల గ్రామాలుగా నివేదించగా, 1.01 గ్రామాలను ఆయా గ్రామసభలు గుర్తించి, సర్టిఫై చేశాయి.
వివిధ సమీక్షా సమావేశాలు, క్షేత్ర పర్యటనలు, సదస్సులు తదితరాలు జరిగిన సందర్భంగా అన్ని ఆవాసాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించి, హెజిజె సర్టిఫికేషన్‌ను పూర్తి చేయవలసిందిగా ఎప్పటికప్పుడు రాష్ట్రాలు/ యూటిలకు సూచించడం జరుగుతోంది. అంతేకాకుండా, గ్రామంలో కుళాయి నీటి సరఫరా పనులు పూర్తి అయిన తర్వాత హర్‌ఘర్‌జల్ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక గ్రామ సభ సమావేశాలను నిర్వహించవలసిందిగా పదే పదే రాష్ట్రాలకు సూచించడం జరుగుతోంది.
సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ సమాచారాన్నిచ్చారు.
***
(Release ID: 2002945)
Visitor Counter : 117