విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సస్టైనబుల్ ఫైనాన్స్ (నిలకడైన ఆదాయం) 2024కు గాను ది అసెట్ ట్రిపుల్ ఎ అందించే ప్రతిష్ఠాత్మక ఉత్తమ గ్రీన్ బాండ్- కార్పొరేట్ అవార్డును అందుకున్న ఆర్ఇసి లిమిటెడ్
Posted On:
05 FEB 2024 2:47PM by PIB Hyderabad
సస్టైనబుల్ ఫైనాన్స్ (నిలకడైన ఆదాయం) 2024కు గాను ది అసెట్ ట్రిపుల్ ఎ అందించే అవార్డులలో ప్రతిష్ఠాత్మక ఉత్తమ గ్రీన్ బాండ్- కార్పొరేట్ అవార్డును అందుకున్న విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి అయిన ఆర్ఇసి లిమిటెడ్ .
భారతదేశం జి20 అధ్యక్షతను స్వీకరించిన అనంతరం భారత్ నుంచి తొలి గ్రీన్ బాండ్ జారీ చేయడమే కాక దక్షిణ లేదా ఆగ్నేయాసియా జారీ చేసే (issuer) సంస్థగా ఏప్రిల్ 2023లో 750 మిలియన్ల విలువైన అతిపెద్ద సీనయర్ గ్రీన్ బాండ్ విడతను జారీ చేసినందుకు గాను ఆర్ ఇసి అవార్డును అందుకుంది. బాండ్ ఇష్యూను నూతన కనీస ఇష్యూ ప్రీమియం 7.5 బిపిఎస్ వద్ద ధర నిర్ణయించారు. ఈ ప్రాంతం నుంచి జారీ చేసిన అధిక- ప్రమాణ జారీల కంటే దృఢమైనది. ఈ ఇష్యూను పెట్టుబడిదారులు బాగా స్వీకరించడం అన్నది నిలకడైన పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ, వాతావరణ మార్పును తగ్గించే లక్ష్యం కలిగిన ప్రాజెక్టులకు రుణాలను అందించడంలో ఆర్ఇసి ప్రముఖ సహకారాన్ని ప్రదర్శిస్తుంది.
అత్యాధునిక మూలధన మార్కెట్ సాధనాలు, స్థిరమైన ఫైనాన్స్‌ను అభివృద్ధి చేయడంలో, పర్యావరణ సారథ్యాన్ని పెంపొందించడంలో అనుకూలీకరించిన రుణ పరిష్కారాలపై ఆర్ఇసి లిమిటెడ్ అచంచలమైన నిబద్ధతను ఈ అవార్డు పట్టి చూపుతుంది. సానుకూల పర్యావరణ ప్రభావం, నిలకడైన అభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఆర్ఇసి లిమిటెడ్ అంకితభావంలో ఈ గుర్తింపు ఒక మైలురాయిని సూచిస్తుంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ అవార్డును అందుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నిలకడైన ఫైనాన్స్ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘటించడమే కాక పోటీ వ్యయంతో పర్యావరణ అనుకూల, స్థిరమైన భవిష్యత్తు దిశగా పరివర్తనను వేగవంతం చేయడానికి మేం చేస్తున్న ప్రయత్నాలను పట్టి చూపుతుందని ఆర్ఇసి లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ దేవాంగన్ అన్నారు. ఏప్రిల్ 2023లో జారీ చేసిన యుఎస్‌డి 750 మిలియన్ల యుఎస్‌డి గ్రీన్ బాండ్లకు అదనంగా, జనవరి 2024లో జెపివై 61.1 బిలియన్ల ప్రారంభ యూరో-యెన్ గ్రీన్ బాండ్ల ధరను కూడా ఆర్ఇసి నిర్ణయించిందని, ఇది భారతీయ కార్పొరేట్ ద్వారా జారీ అయిన అతిపెద్ద యెన్ బాండ్, అని ఆయన పేర్కొన్నారు.
తమ తమ పరిశ్రమలలో రాణించిన సంస్థలకు అత్యంత ప్రసిద్ధి చెందిన గుర్తింపు అసెట్ ట్రిపుల్ ఎ అవార్డులు. ఇటువంటి అవార్డుల కార్యక్రమాలను నిర్వహించడంలో రెండు దశాబ్దాలపైగా అనుభవం కలిగిన ది అసెట్ ట్రిపుల్ ఎ అవార్డులు అత్యుత్తమ తరగతి సంస్థలను గుర్తించగలిగే అసమానామైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. ఉత్తమ సంస్థలను, ఒప్పందాలను ఎంపిక చేయడంలో కఠినమైన విధానంతో కూడిన, ఖచ్చితమైన పద్ధతి ఆధారంగా అసెట్ ట్రిపుల్ ఎ అవార్డు కార్యక్రమాలు నిర్మితమయ్యాయి.
ఈ అవార్డులను దశాబ్దాల పాటు పరిశ్రమ అవార్డులను మూల్యాంకనం చేసే, అత్యంత అనుభవజ్ఞులుగా పరిగణించే, అసెట్స్ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ సమిష్టిగా నిర్ణయిస్తారు.
ఆర్ ఇసి లిమిటెడ్ గురించిః
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మౌలికసదుపాయాల ఫైనాన్సింగ్ (ఐఎఫ్‌సి- రుణకల్పన)కంపెనీ, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా (ఎన్‌బిఎఫ్‌సి) ఆర్‌బిఐలో నమోదైన సంస్థ ఆర్ ఇసి. ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరావృత ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ నిల్వ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, హరిత ఉదజని, పర్యావరణ అనుకూల అమోనియా ప్రాజెక్టులు వంటి కొత్త సాంకేతికతలతో కూడిన మొత్తం విద్యుత్ మౌలిక సదుపాయాల రంగానికి ఆర్ఇసి ఆర్థిక సహాయం చేస్తోంది.
ఇటీవల, ఆర్ఇసి రహదారులు & ఎక్స్‌ప్రెస్ వేలు, మెట్రోరైలు, విమానాశ్రయలు, ఐటి కమ్యూనికేషన్, సామాజిక, వాణిజ్య మౌలిక సదుపాయాలు ( విద్యా సంస్థలు, ఆసుపత్రులు), రేవులు, స్టీల్, రిఫైనరీ వంటి ఇతర రంగాలలో వివిధ ఎలక్ట్రో మెకానికల్ (ఇ&ఎం) పనులతో కూడిన విద్యుతేతర మౌలిక సదుపాయాల విభాగంలోకి కూడా విస్తరించి, దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు కంపెనీలకు వివిధ గడువులతో రుణాలను అందిస్తోంది.
విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలలో కీలక, వ్యూహాత్మక పాత్రను ఆర్ఇసి లిమిటెడ్ కొనసాగిస్తోంది. ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య), దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డిడియుజిజెవై), జాతీయ విద్యుత్ నిధి(ఎన్ఇఎఫ్) పథకాలకు నోడల్ ఏజెన్సీగా ఉన్న ఫలితంగా దేశంలో చివరి మైలు వరకు పంపిణీ వ్యవస్థ, 100% గ్రామ విద్యుదీకరణ, గృహ విద్యుదీకరణ బలోపేతం అయ్యాయి.
రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం ( ఆర్‌డిఎస్ ఎస్ - పునరుద్ధరించిన పంపిణీ పథకం) కోసం నిర్ధిష్ట రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్ ఇసిని నోడల్ ఏజెన్సీని చేశారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన బాధ్యతను కూడా ఆర్ ఇసికి అప్పగించడం జరిగింది. డిసెంబర్ 31, 2023 నాటికి ఆర్ఇసి లోన్ బుక్ (రుణ పుస్తకం) విలువ రూ. 4.97 లక్షల కోట్లు కాగా, నికర విలువ రూ. 64,787 కోట్లుగా ఉంది.
***
(Release ID: 2002858)
Visitor Counter : 127