మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రెండు రోజుల పాటు జరిగే ఉల్లాస్ మేళాను రేపు న్యూఢిల్లీలో ప్రారంభించనున్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
05 FEB 2024 7:00PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని జాతీయ బాల భవన్ లో రెండు రోజుల పాటు జరిగే ఉల్లాస్ మేళాను రేపు 2024 ఫిబ్రవరి 6న కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శక్తి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి కూడా ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.
2030 నాటికి 100% అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 2022-2027 ఆర్థిక సంవత్సరానికి నవ భారత్ సాక్షరతా కార్యక్రమం లేదా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ పేరుతో కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేస్తోంది. సామూహిక అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించిన పథకం ఉల్లాస్ గా ప్రాచుర్యం పొందింది. సమాజం కోసం జీవిత కాల అభ్యాసంగా ఉల్లాస్ అమలు జరుగుతుంది. ఈ పథకం 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతోంది.జాతీయ విద్యా విధానం 2020. కు అనుగుణంగా పాఠశాలకు వెళ్లి చదువు పొందని వారు లేదా పధ్ధతి ప్రకారం విద్యను పొందలేని పెద్దలను (15 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు) లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, న్యాయ అక్షరాస్యత , పర్యావరణ అక్షరాస్యత,ఆరోగ్యం పరిశుభ్రత వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి చదవడం, సంఖ్యా శాస్త్రంపై ప్రాథమిక అవగాహన (ఎఫ్ఎల్ఎన్) కల్పించడానికి కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తుంది. . హైబ్రిడ్ విధానంలో పధకాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానం,లేదా రెండు కలిపి అమలు చేస్తాయి.
ఈ పథకం ఐదు అంశాలను కలిగి ఉంటుంది. (i) పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం; (ii) ముఖ్యమైన జీవన వైపుణ్యం ; (iii) ప్రాథమిక విద్య; (iv) వృత్తి నైపుణ్యాలు (v) నిరంతర విద్యకు ప్రాధాన్యత ఇస్తారు. ఉల్లాస్ ను స్వచ్చందంగా ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. దేశ నిర్మాణం దిశగా ప్రజలు తమ కర్తవ్యం బాధ్యత నెరవేర్చేలా పధకానికి రూపకల్పన చేశారు.సామూహిక అక్షరాస్యగ లక్ష్యం సాధించి భారతదేశాన్నిఅన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి, దేశాభివృద్ధికి పథకం సహాయ పడుతుంది. అభ్యాసకులు, వాలంటీర్ల నమోదు, శిక్షణకు అవసరమైన పాఠ్య అంశాలను అందించడానికి ఉల్లాస్ యాప్ ను రూపొందించారు. అభ్యాసకులు సెప్టెంబర్ , మార్చి లో సంవత్సరానికి రెండు సార్లు మూల్యాంకనం ద్వారా అక్షరాస్యులుగా
ఉల్లాస్ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అనేక కార్యక్రమాలు అమలు చేశాయి. ఉల్లాస్- నవభారత్ సాక్షరతా కార్యక్రమం కింద జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేసిన కార్యకలాపాలను ప్రదర్శించడానికి విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య , అక్షరాస్యత విభాగం 2024 ఫిబ్రవరి 6-7 తేదీల్లో సి ఎన్ సి ఎల్, ఎన్ సి ఈ ఆర్ టీ సహకారంతో ఉల్లాస్ మేళాను నిర్వహిస్తోంది. ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్ఎల్ఎన్ఏటీ)లో ఉతీర్ణత సాధించి అక్షరాస్యులుగా సర్టిఫికెట్ పొందిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నవ అక్షరాస్యులను కార్యక్రమంలో సన్మానిస్తారు. స్థానిక భాషల్లో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉల్లాస్ సంక్షిప్త ప్రైమర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మేళాలో నిర్వహిస్తారు.మేళాలో 'ఉత్తమ విధానాలు' అనే అంశంపై సదస్సు జరుగుతుంది. చర్చ గోష్టులు, అంతర్జాతీయ అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోస్టర్ తయారీ పోటీ విజేతలకు బహుమతుల పంపిణీ వంటి వివిధ కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఏడు వందల మందితో పాటు విద్యా మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ సంస్థలకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.రెండు రోజుల కార్యక్రమం
2024 ఫిబ్రవరి ఆరున : https://www.youtube.com/watch?v=ySaBTI9jumE
2024 ఫిబ్రవరి 7న : https://www.youtube.com/watch?v=cDvXqM4jh94 లో ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది.
***
(Release ID: 2002855)
Visitor Counter : 111