పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పొగమంచు కాలంలో విమాన సిబ్బందిని హెచ్చరించడానికి నిర్దిష్ట గంటలలో ఢిల్లీ విమానాశ్రయంలో అదనంగా 130-140 మంది సిబ్బంది నియామకం
• ఢిల్లీ విమానాశ్రయం 04 రన్‌వే చివరల్లో ఇప్పటికే పని చేస్తున్న ILS CAT-III
•CAT-III కార్యకలాపాల నిర్వహణకు అనువుగా ఉన్న ఢిల్లీ విమానాశ్రయంలో అన్ని టాక్సీవేలు
प्रविष्टि तिथि:
05 FEB 2024 2:46PM by PIB Hyderabad
విపరీతమైన పొగమంచు కారణంగా 2023 డిసెంబర్, 2024 జనవరి నెలల్లో ఉత్తర భారతదేశంలో ఉన్న విమానాల రాకపోకలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. వివిధ విమానాశ్రయాలలో దృశ్యమానత సున్నా మీటర్లకు పడిపోయింది. ఇది విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఢిల్లీ విమానాశ్రయంలో రన్‌వే 28/10 అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత జటిలం అయ్యింది. విమానయాన సంస్థల నియంత్రణలో లేని కారణాల వల్ల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఆలస్యంగా నడిచాయి.
పొగమంచు కారణంగా విమానాలు రద్దు అయినప్పుడు లేదా ఆలస్యంగా నడుస్తున్న సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఢిల్లీ విమానాశ్రయంలో తగిన సౌకర్యాలు ఉన్నాయి. విమానాలు రద్దు అయినప్పుడు లేదా ఆలస్యంగా నడుస్తున్న సమయంలో ప్రతిస్పందించడానికి ఈ క్రింది చర్యలు అమలు జరుగుతున్నాయి.
(i) నిర్దిష్ట గంటలలో NOTAM ప్రభావాన్ని నిర్వహించడానికి పొగమంచు కాలంలో విమానాశ్రయంలో అదనంగా 130-140 మంది సిబ్బందిని నియమించారు. .
(ii) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అవసరమైన సిబ్బందితో వైద్య కేంద్రం అందుబాటులో ఉంది.
(iii) 3 టెర్మినల్స్‌లో అదనంగా 700కి పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
(iv) వివిధ విమానయాన సంస్థల సలహా మేరకు ఆలస్యంగా నడుస్తున్న విమానాల ప్రయాణికులకు ఆహారం, పానీయాలు అందించడానికి ఢిల్లీ విమానాశ్రయం చర్యలు తీసుకుంటుంది. . అన్ని టెర్మినల్స్‌లో ఇప్పటికే ఉన్న ఆహార, పానీయ విక్రయశాలల నిర్వాహకులు తగిన విధంగా ఆహార అవసరాలు అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
సివిల్ ఏవియేషన్ అవసరాలు సెక్షన్ 8, సిరీస్ సి , పార్ట్ I ప్రకారం "అన్ని వాతావరణ కార్యకలాపాలు (AWO)"పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూచనలు జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బందికి CAT II/CAT III శిక్షణ పొందాల్సి ఉంటుంది.
ILS CAT-III ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయం 04 రన్‌వే చివరలో పనిచేస్తోంది. ILS CAT- I 03 రన్‌వే చివరలో పనిచేస్తోంది. బేసిక్ స్ట్రిప్, అప్రోచ్ లైట్ సిస్టమ్‌ల కోసం అడ్డంకి లేని జోన్, భూ పరిమితుల పరిమితుల కారణంగా ఈ రన్‌వే చివరలలో ILS CAT-IIIకి అప్‌గ్రేడ్ చేయడం సాధ్యం కాదు.
రన్‌వే 29R వద్ద CAT-III ILS సదుపాయం కల్పించారు. కొత్త ILS ఏర్పాటు అయ్యింది. ILS CAT-III కోసం విమాన క్రమాంకనం చేయబడింది.
ఢిల్లీ విమానాశ్రయంలో అన్ని టాక్సీవేలు CAT-III కార్యకలాపాల నిర్వహణకు అనువుగా ఉన్నాయి. దృశ్యమాన్యత తక్కువగా ఉన్న సమయంలో ఉపయోగించాల్సిన టాక్సీ వే లను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) గుర్తించి ప్రచురించింది. దీనివల్ల విమానాలు ఎయిర్‌క్రాఫ్ట్ క్యాట్ III కార్యకలాపాలకు పూర్తిగా అనుగుణంగా ఉండే నిర్దేశిత టాక్సీ మార్గాల్లో కిందకి దిగడానికి వీలవుతుంది.
పొగమంచు వల్ల ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పొగమంచు సంసిద్ధత మాన్యువల్‌ను విడుదల చేసింది. విమానాల రద్దు ఆలస్యం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు, ప్రయాణికులకు అందించాల్సిన సౌకర్యాలపై డీజీసీఏ CAR సెక్షన్ 3, సిరీస్ M, పార్ట్ IV శీర్షిక మార్గదర్శకాలు జారీ చేసింది.
పైన పేర్కొన్న CAR సదుపాయం ప్రకారం ఆలస్యంగా నడుస్తున్న విమానంలో ప్రయాణించడానికి నిర్ణయించిన నిర్దేశిత గడువులోగా చెక్ ఇన్ అయిన ప్రయాణికులకు విమానయాన సంస్థ భోజనం, రిఫ్రెష్‌మెంట్లు//హోటల్ వసతి/ ప్రత్యామ్నాయ ఫ్లైట్//పూర్తి వాపసు అందించాలి ఎయిర్‌లైన్స్ నియంత్రణకు మించిన అసాధారణ పరిస్థితి(లు) వల్ల ఆలస్యం అయిన సందర్భాల్లో పరిహారం చెల్లించడానికి ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించదు.
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వీకే సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(रिलीज़ आईडी: 2002615)
आगंतुक पटल : 124