సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సి జి జి) ఎం ఈ ఎ భాగస్వామ్యంతో ఢిల్లీలోని ఆఫ్రికన్ ప్రాంత సీనియర్ సివిల్ సర్వెంట్ల కోసం ప్రభుత్వ విధానాలు మరియు సుపరిపాలన పై మొదటి రెండు వారాల అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.


5 దేశాలు, కెన్యా, టాంజానియా, ఇథియోపియా, ఎరిట్రియా మరియు గాంబియా నుండి శాశ్వత కార్యదర్శులు మరియు డిప్యూటీ పర్మనెంట్ సెక్రటరీలతో సహా 34 మంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భూపరిపాలన, సుస్థిర అభివృద్ధి మరియు ప్రభుత్వ విధాన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించిన సామర్థ్యం పెంపు కార్యక్రమం

భూపరిపాలన, ప్రభుత్వ విధానాలు మరియు ప్రజా ఫిర్యాదుల ప్రభావవంతమైన పరిష్కారాలపై ప్రతినిధులు తమ గ్రూప్ వర్క్‌ను సమర్పించారు.

Posted On: 03 FEB 2024 11:49AM by PIB Hyderabad

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సి జి జి), భారత ప్రభుత్వం యొక్క అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్త సంస్థ, ఆఫ్రికన్ ప్రాంతంలోని పౌర సేవకుల కోసం ప్రభుత్వ విధానాలు మరియు సుపరిపాలన పై రెండు వారాల అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను 2-01-2024న కేంద్రం తొలిసారిగా నిర్వహించి పూర్తి చేసింది.  ఐదు ఆఫ్రికన్ దేశాలు, ఎరిట్రియా, కెన్యా, ఇథియోపియా, టాంజానియా మరియు గాంబియా నుండి 34 మంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.  మిస్టర్ టాంసిర్ ఆన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్, ప్రెసిడెంట్ ఆఫీస్, గాంబియా ప్రభుత్వం, శ్రీ మహత్ అబుకర్ యూసుఫ్ డైరెక్టర్ గరిస్సా కౌంటీ ఆఫ్ కెన్యా ప్రభుత్వం, శ్రీమతి తుమైని లువాండా మెటెటెమెలా యూనివర్శిటీ ఆఫ్ డోడోడ్మా ప్రిన్సిపల్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ ఆఫ్ టాంజానియా ప్రభుత్వం, శ్రీమతి రహెల్ బెయెన్ టెక్లు ఉన్నారు. ప్రోటోకాల్ ఆఫీసర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎరిట్రియా ప్రభుత్వం, శ్రీమతి ఎట్మెట్ అసెఫా అసమ్రీ, ఇథియోపియాలోని ఫెడరల్ సుప్రీం కోర్ట్ ప్రిసైడింగ్ జడ్జి ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

శ్రీ వి. శ్రీనివాస్, డైరెక్టర్ జనరల్, నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ & సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ ఈ వేడుకలో ప్రసంగించారు. భారత్-ఆఫ్రికా మధ్య ఉన్న చారిత్రాత్మక బంధాన్ని సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ హయాంలో చేసిన కృషిని ప్రదర్శించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులను మరియు ప్రభుత్వాన్ని దగ్గరకు తీసుకురావడం, భూ పరిపాలనలో న్యాయ పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడం, ప్రజల ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడం మరియు గాంబియాలో మై గవర్నమెంట్  పోర్టల్‌ను రూపొందించడం కోసం భారతదేశం యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్కభారతీయ సహకారం,  భాగస్వామ్య ప్రపంచ ప్రజా ప్రయోజనాల గురించి కూడా ఈ సెషన్ చర్చించింది.  తమ దేశంలోని ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రజల-కేంద్రీకృత పాలనను అందించడంలో సహాయపడే భారతదేశంలోని వివిధ సంస్థలతో సహకరించుకోవాల్సిన అవసరాన్ని ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఆఫ్రికన్ ప్రాంతంలోని సివిల్ సర్వెంట్లకు రెండు వారాల వ్యవధితో భవిష్యత్తులో మరికొన్ని శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని కూడా వారు అభ్యర్థించారు.

 

కోర్సు కోఆర్డినేటర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ సి జి జి డాక్టర్ ఏ.పీ సింగ్ స్వాగత ప్రసంగం చేశారు. ఈ రెండు వారాల కార్యక్రమం యొక్క సమగ్ర అవలోకనాన్ని అందించారు, శిక్షణలో కవర్ చేయబడిన విభిన్న అంశాలను వివరించారు. ఈ ప్రోగ్రామ్‌లో పరిపాలన  నూతన నమూనాలు, ఆధార్, సుపరిపాలన కోసం ఒక సాధనం, భూమి పత్రాల ఆధునీకరణ, జి ఈ ఎం , స్వామిత్వ పథకం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు, వాతావరణ మార్పు విధానాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి సెషన్‌లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి అనుభవ సందర్శనలలో పాల్గొనడానికి విలువైన అవకాశం ఉందని, ఇది వారి మొత్తం అభ్యాసాన్ని పెంపొందించిందని ఆయన హైలైట్ చేశారు. ప్రణాళికాబద్ధమైన పర్యటనలలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డీ ఎం ఆర్ సి, ఎయిమ్స్ , పీ ఎం సంగ్రహాలయ మరియు తాజ్ మహల్ సందర్శన ఇతరాలు ఉన్నాయి. కెపాసిటీ-బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.పీ సింగ్, అసోసియేట్ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ముఖేష్ భండారీ, ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ సంజయ్ దత్ పంత్ మరియు ఎన్ సి జి జి యొక్క అంకితమైన కెపాసిటీ బిల్డింగ్ టీమ్ పర్యవేక్షించారు.నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యొక్క  ఐ టీ ఈ సి ప్రోగ్రామ్ లో భాగంగా జరిగిన ఈ 5-దేశాల ఆఫ్రికా ప్రోగ్రామ్  అంతర్జాతీయ పౌర సేవకుల శిక్షణ అత్యున్నత సామర్ధ్య నిర్మాణ సంస్థగా ఎన్ సి జి జి  ప్రయత్నాలలో  ఒక మైలురాయిని సూచిస్తుంది.

***


(Release ID: 2002462) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Hindi , Marathi