ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ @2047 యొక్క ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ థీమ్కి ముందడుగుగా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సాంకేతికతలు పరిశ్రమలకు బదిలీ చేయబడ్డాయి.
Posted On:
04 FEB 2024 2:06PM by PIB Hyderabad
ఐఐటీ ఢిల్లీలో జరిగిన "డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ సమ్మిట్ ------------2024" ప్రారంభ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇన్ ట్రాన్స్( ఇన్ ట్రాన్స్) ప్రోగ్రామ్ కింద సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన థర్మల్ కెమెరా, సీఎంఓఎస్ కెమెరా, ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ మూడు సాంకేతిక ఆవిష్కరణలను 12 పరిశ్రమలకు బదిలీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో సంకల్పించిన వికసిత్ భారత్ @2047 యొక్క ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ థీమ్ వైపు ఇదో ముందడుగు.
థర్మల్ కెమెరా: కృత్రి మ మేధస్సు ఆధారిత విశ్లేషణలను అమలు చేయడానికి థర్మల్ స్మార్ట్ కెమెరా అంతర్నిర్మిత డీపీయూని కలిగి ఉంది. స్వదేశీ సాంకేతికత స్మార్ట్ సిటీలు, పరిశ్రమలు, రక్షణ, ఆరోగ్యం తదితర అంశాలతో సహా బహుళ డొమైన్‌లలోని అప్లికేషన్‌ల కోసం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కెమెరా యొక్క ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ మరియు ధ్రువీకరణ రోడ్ ట్రాఫిక్ అప్లికేషన్‌ల కోసం జరిగింది.
సాంకేతికత క్రింది ఎనిమిది పరిశ్రమలకు ఏకకాలంలో బదిలీ చేయబడింది.
ఆర్ఆర్ పీఎస్ 4ఈ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్
ఎస్సీఐటీఏ సొల్యూషన్స్
టీఏకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
అంబాటికా టెక్నాలజీస్
ప్రమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
సమృద్ధి ఆటోమేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నార్డెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్
వెహాంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
పీఓంఓఎస్ కెమెరా:
ఇండస్ట్రియల్ విజన్ సెన్సార్ iVIS 10GigE అనేది సీఎంఓఎస్ ఆధారిత విజన్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఇది తరువాతి తరం పారిశ్రామిక యంత్ర విజన్ అప్లికేషన్‌లను నిర్వహించడానికి శక్తివంతమైన ఆన్-బోర్డ్ కంప్యూటింగ్ ఇంజిన్‌తో ఉంటుంది.
సాంకేతికత ఎం/ఎస్ స్పూక్‌ఫిష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు బదిలీ చేయబడింది .
ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:
ఫ్లెక్సీఫ్లీట్ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడం మరియు ఫ్లీట్ ఆపరేటర్లు మరియు ట్రాన్సిట్ ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. వెహికల్ లొకేషన్ ట్రాకింగ్‌తో పాటు, ఓవర్ స్పీడ్, జియోఫెన్స్, ఇగ్నిషన్, ఐడిల్, హాల్ట్ మరియు ర్యాష్ డ్రైవింగ్ వంటి విభిన్న పరిస్థితుల కోసం ఇది హెచ్చరికలను అందిస్తుంది. వ్యక్తిగతీకరించిన ట్రాన్సిట్ రూట్ గైడెన్స్ సిస్టమ్ అనేది ప్రయాణీకుల కోసం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన మొబైల్ యాప్. ఇది ప్రయాణికులకు తనకు నచ్చిన అత్యంత సమర్థవంతమైన లేదా వ్యక్తిగతీకరించిన మార్గాలను ఎంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. హెడ్‌వే విశ్వసనీయత కోసం కార్యాచరణ వ్యూహాలు ట్రాన్సిట్ ఆపరేటర్‌ల కోసం డైనమిక్ షెడ్యూలింగ్ డెసిషన్ సపోర్ట్ టూల్‌గా ఉపయోగపడుతుంది. బస్సు బంచింగ్ యొక్క సందర్భాలను తగ్గించడం ద్వారా పబ్లిక్ ట్రాన్సిట్ సేవల విశ్వసనీయతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
సాంకేతికత ఏకకాలంలో మూడు పరిశ్రమలకు బదిలీ చేయబడుతుంది -
అతుల్య అభినవ్ టేక్ ప్రైవేట్ లిమిటెడ్
యూనిడాడ్ టెక్నో ల్యాబ్స్ ప్రైవేట్
ఐబీఐ గ్రూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు జల్ శక్తి రాష్ట్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో సాంకేతికత బదిలీ చేయబడిన పత్రాల మార్పిడి జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి సునీతా వర్మ, జీసీ ఆర్ అండ్ డీలో ఈ అండ్ ఐటీ, ఈ. మగేష్, డీజీసీడాక్; ఏ కలైసెల్వన్, డైరెక్టర్ - సీడాక్ త్రివేండ్రం; ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, పరిశ్రమల సీఈవోలు, సీటీఓలు తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 2002455)
Visitor Counter : 214