రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత సైన్యం లోకి విద్యుత్ వాహనాలు

Posted On: 02 FEB 2024 3:34PM by PIB Hyderabad

పరిమిత సంఖ్యలో విద్యుత్ వాహనాలను  , దేశవ్యాప్తంగా  పీస్ స్టేషన్లలో  వాటిని ప్రవేశపెట్టాలని భారత సైన్యం నిర్ణయించింది.  ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, హరిత ఇంధనానికి ప్రోత్సాహం ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. భారత సైన్యం పీస్ స్టేషన్లలో కింది ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుంది. అవి

– తేలికపాటి వాహనాలు (ఎలక్ట్రిక్)

–బస్సులు (ఎలక్ట్రిక్)

–మోటార్ సైకిళ్లు (ఎలక్ట్రిక్)

ఈ సమాచారాన్ని రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ భట్ లోక్సభలో ఈరోజు శ్రీ మద్దిల గురుమూర్తి, శ్రీ కురువ గోరంట్ల మాధవ్ లు అడిగిన ప్రశ్నకు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 2002405) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi , Marathi