మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

బాలల విముక్తి, ఇళ్లకు తిరిగి రావడం కోసం ఘర్ (గో హోం అండ్ రీ యునైట్-ఇంటికి చేరి తిరిగి కుటుంబంతో కలవడం) పోర్టల్ ను ప్రారంభించిన ఎన్ సి పి సి ఆర్


జువెనైల్ జస్టిస్ (పిల్లల రక్షణ, సంరక్షణ) చట్టం, 2015 ప్రోటోకాల్స్ ప్రకారం పిల్లల విముక్తి, ఇళ్లకు తిరిగి రావడాన్ని డిజిటల్ గా పర్యవేక్షించడానికి ట్రాక్ చేయడం ఘర్ పోర్టల్ ఉద్దేశం

Posted On: 02 FEB 2024 4:20PM by PIB Hyderabad

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్ సహా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో తప్పిపోయిన, దొరికిన పిల్లలను గుర్తించడానికి వీలు కల్పించే "ట్రాక్ చైల్డ్ పోర్టల్"ను మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ‘ట్రాక్ చైల్డ్’ పోర్టల్ ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలపాలనాయంత్రాంగాలు, , చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జువెనైల్ జస్టిస్ బోర్డులు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మొదలైన వివిధ వాటాదారుల   భాగస్వామ్యంతో అమలు చేస్తారు.  "ట్రాక్ చైల్డ్" పోర్టల్ కోసం  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేశారు. ట్రాక్ చైల్డ్ పోర్టల్ అమలుకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కు, ఇతర భాగస్వాములకు సలహాలు కూడా జారీ చేసారు. ‘ట్రాక్ చైల్డ్’ పోర్టల్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సిసిటిఎన్ఎస్ లేదా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్స్ తో కూడా అనుసంధానించబడింది, ఇది తప్పిపోయిన పిల్లల ఎఫ్ ఐ ఆర్ లకు సంబంధిత రాష్ట్ర / యుటి పోలీసులు తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి ,  వివరాలను ట్రాక్ చైల్డ్ డేటాబేస్ తో సరిపోల్చడానికి అంతర్ నిర్వహణ (ఇంటర్ఆపరబిలిటీ) ను అనుమతిస్తుంది. ట్రాక్ చైల్డ్ పోర్టల్ లోని ఒక భాగంలో "ఖోయా-పాయా" ఉంది, ఇక్కడ ఏ పౌరుడైనా తప్పిపోయిన లేదా కనిపించిన పిల్లల గురించి నివేదించవచ్చు. ఎన్ సిపిసిఆర్ ద్వారా ఘర్ - గో హోమ్ అండ్ రీ-యునైటెడ్ (పోర్టల్ ఫర్ రిస్టోరేషన్ అండ్ రిపాట్రేషన్ ఆఫ్ చైల్డ్) అనే ఈ పోర్టల్ ను అభివృద్ధి చేసి ప్రారంభించారు. జువెనైల్ జస్టిస్ (పిల్లల రక్షణ ,  సంరక్షణ) చట్టం, 2015,   ప్రోటోకాల్స్ ప్రకారం పిల్లల పునరుద్ధరణ ఇళ్లకు: స్వదేశానికి తిరిగి తీసుకురావడాన్ని డిజిటల్ గా పర్యవేక్షించడానికి,  ట్రాక్ చేయడానికి ఘర్ పోర్టల్ ను అభివృద్ధి చేశారు. చేయబడింది. పోర్టల్ ముఖ్య అంశాలు  ఈ క్రింది విధంగా ఉన్నాయి:

జువెనైల్ జస్టిస్ సిస్టమ్ లో ఉండి, మరో దేశం/రాష్ట్రం/జిల్లాకు పంపాల్సిన పిల్లల డిజిటల్ ట్రాకింగ్ , మానిటరింగ్.

పిల్లలను త్వరితగతిన స్వదేశానికి రప్పించడం కోసం  పిల్లల కేసులను సంబంధిత జువైనల్ జస్టిస్ బోర్డ్/చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి డిజిటల్ గా బదిలీ చేయడం.

అనువాదకుడు/ దుబాసి/నిపుణుడు అవసరం ఉన్నట్లయితే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేయాలి.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు పిల్లల కేసు పురోగతిని డిజిటల్ గా పర్యవేక్షించడం ద్వారా పిల్లలకు సరైన పునరుద్ధరణ, పునరావాసం ఉండేలా చూడవచ్చు.

ఫారాల్లో చెక్ లిస్ట్ ఫార్మాట్ ఇవ్వబడుతుంది, తద్వారా స్వదేశానికి తిరిగి రావడానికి కష్టంగా ఉన్న,  లేదా  అర్హత కలిగిన పరిహారం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను పొందని పిల్లలను గుర్తించవచ్చు.

ప్రభుత్వం అమలు చేసిన పథకాల జాబితా ఇవ్వబడింది, తద్వారా పునరుద్ధరణ సమయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కుటుంబాన్ని బలోపేతం చేయడానికి పిల్లవాడు అతని/ఆమె కుటుంబంతో ఉండేలా చూడటానికి పథకాలతో పిల్లలను అనుసంధానించవచ్చు.

ఎన్ సి పి సి ఆర్  వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 5175 మంది పిల్లలు స్వదేశానికి రావడానికి  గో హోమ్ అండ్ రీ-యునైటెడ్ (జిహెచ్ఎఆర్) పోర్టల్ లో నమోదు చేసుకున్నారు.

(డి) నుంచి (ఇ): ఎన్ సి పి సి ఆర్   తెలియ చేసినట్టు, 20 నవంబర్ 2022న ఎన్ సి పి సి ఆర్   జి హెచ్ ఎ ఆర్ పోర్టల్ కు సంబంధించి అవగాహన కల్పన - లాంచ్ కార్యక్రమం నిర్వహించింది.దీనిలో సంబంధిత భాగస్వాములందరూ పాల్గొన్నారు. పోర్టల్ లో పిల్లల డేటాను అప్ డేట్ చేయాలని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను అభ్యర్థిస్తూ ఎన్ సి పి సి ఆర్  లేఖలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈశాన్య రాష్ట్రాల్లో ఘర్ పోర్టల్ భాగస్వాములందరికీ ఎన్ సిపిసిఆర్ వివిధ శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించింది.

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

***



(Release ID: 2002395) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi