పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

వేగవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ప్రపంచ అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్ సింధియా ఉద్ఘాటించారు

విమానాశ్రయాలలో ఇమిగ్రేషన్ మరియు భద్రతా తనిఖీ ప్రక్రియలను వేగవంతం చేయడానికి విమానాశ్రయ డిజైన్లలో మార్పులు మరియు సాంకేతికతలను అన్వేషించడం

భారతదేశంలో అంతర్జాతీయ విమానయాన కేంద్రాల ఏర్పాటుకు మా దృష్టిలో పై దశలు కీలకం: శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

Posted On: 02 FEB 2024 3:18PM by PIB Hyderabad

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ మరియు భద్రతా తనిఖీల ప్రక్రియ త్వరగా పూర్తిచేయడం కోసం విమానాశ్రయాల్లో ఇంటీరియర్ డిజైన్ లో మార్పులు చేయడం, నూతన సాంకేతికతను వినియోగించడం వంటి అంశాలపై చర్చించడానికి కేంద్ర కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, సీఐఎస్ఎఫ్ మరియు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో సమావేశమయ్యారు. జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత నిర్వహించిన సలహా కమిటీ సమావేశం భారతదేశంలో అంతర్జాతీయ విమానయాన కేంద్రాలను నిర్మించడంలో ఇది ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడుతుంది.


సింగపూర్ మరియు కెనడా వంటి అంతర్జాతీయ విమానాశ్రయ నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా పొందిన పరిష్కారాలను ఈ సమావేశం  పరిశీలించింది.

చర్చల్లోని ముఖ్యాంశాలు:

ఎక్స్బీఐఎస్ మెషీన్‌ల క్రాస్- యుటిలైజేషన్: మెషిన్‌ల ఎక్కువ లభ్యతను నిర్ధారించడానికి,  తక్కువ నిరీక్షణ సమయం కోసం ఢిల్లీ విమానాశ్రయంలో దేశీయ మరియు అంతర్జాతీయ ఎక్స్బీఐఎస్ మెషీన్‌లను క్రాస్- యుటిలైజ్ చేసే అవకాశాన్ని అన్వేషించడం.

కొత్త టెక్నాలజీల విస్తరణ: ఎలక్ట్రానిక్ గేట్‌ల వినియోగానికి సంబంధించిన కాన్సెప్ట్ ట్రయల్స్ మరియు ఇమ్మిగ్రేషన్ కోసం ఇ-బయోమెట్రిక్‌ల పరీక్షల ఇప్పటికే జరుగుతోంది. విమాన ప్రయాణంలో సమర్థత మరియు భద్రత ప్రమాణాలను పునర్నిర్వచించడానికి ఇవి సెట్ చేయబడ్డాయి.

మానవ వనరులను పెంచడం: సీఐఎస్ఎఫ్ మరియు ఇమ్మిగ్రేషన్ అధికారుల మానవ వనరుల అవసరాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ చేపట్టబడింది. ఈ విశ్లేషణ జెవార్, నవీ ముంబయి మరియు ఇతర ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా రాబోయే కొత్త విమానాశ్రయాల ప్రణాళికాబద్ధమైన విస్తరణను పరిగణనలోకి తీసుకుంటుంది.



“మేము ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఇమ్మిగ్రేషన్ మరియు భద్రతను వేగవంతం చేయడానికి ఎయిర్ పోర్టుల డిజైన్ నమూనాల గురించి చర్చిస్తున్నాము. ఎలక్ట్రానిక్ బయోమెట్రిక్స్ వంటి కొత్త సాంకేతికతలు కూడా మా పరిశీలనలో  ఉన్నాయి వాటికి  సంబంధించిన  ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భారతదేశంలో అంతర్జాతీయ విమానయాన కేంద్రాల కోసం మా దృష్టిలో ఇవి కీలకమ’ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా తన సోషల్ మీడియా వేదిక Xలో పేర్కొన్నారు.

భారతదేశ పౌర విమానయాన రంగాన్ని మార్చడానికి ఆవిష్కరణలను స్వీకరించడం మరియు సాంకేతికతను ఉపయోగించుకోవడం కోసం ప్రభుత్వ నిబద్ధతను కూడా ఆయన నొక్కి చెప్పారు. విమాన ప్రయాణంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపడానికి మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. అంతేకాకుండా  దేశంలో బహుళ విమానయాన కేంద్రాలను సృష్టించడం పరిశ్రమ యొక్క ఉమ్మడి లక్ష్యం.



హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్), బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)పలువురు భాగస్వాములు మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 2002393) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi , Tamil