నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ‘ఇండియా - జర్మనీ డైలాగ్ ఆన్ ఎవెన్యూస్ ఫర్ ఫ్యూచర్ కోలాబరేషన్’ని నిర్వహిస్తుంది

Posted On: 31 JAN 2024 9:43PM by PIB Hyderabad

జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ అఫైర్స్ (బీఎంఏఎస్)స్టేట్ సెక్రెటరీ శ్రీమతి లియోనీ గెబెర్స్ నేతృత్వంలో  భారతదేశాన్ని సందర్శించిన జర్మనీ ప్రతినిధుల బృందంతో  కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ఒక డైలాగ్ (చర్చా కార్యక్రమం)ని నిర్వహించింది. నైపుణ్యాభివృద్ధి రంగాలలో ఇరు దేశాల మధ్య మరింత సహకారాన్ని విస్తరింపజేయడం మరియు భారతదేశం నుండి జర్మనీకి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని తరలించడానికి మార్గాలను సుగమం చేయడం ఈ డైలాగ్ యొక్క లక్ష్యం.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ  కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారీ నేతృత్వంలో, అదనపు సెక్రటరీ, డైరెక్టర్ జనరల్,  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) శ్రీమతి త్రిషల్‌జిత్ సేథి, ఎంఎస్డీఈ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సోనాల్ మిశ్రా, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ అఫీషియేటింగ్ సీఈవో శ్రీ వేద్ మణి తివారీ, ఎన్సీవీఈటీ కార్యనిర్వాహక సభ్యులు శ్రీమతి వినీతా అగర్వాల్తదితరులు భారతీయ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఇక జర్మనీ ప్రతినిధి బృందంలో బీఎంఏఎస్ సహాయ కార్యదర్శి లియోనీ గేబర్స్ వ్యక్తిగత సహాయకులు శ్రీమతి విక్టోరియా హోల్మ్, బీఎంఏఎస్ వృత్తి శిక్షణ మరియు నైపుణ్యం కలిగిన లేబర్ ఫోర్స్సెక్యూరిటీ  డైరెక్టర్ జనరల్ గునిల్లా ఫింకే, బీఎంఏఎస్ విదేశీ కార్మికుల ఉపాధి చట్టం యూనిట్ హెడ్ కాట్రిన్ హోలెండర్, ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ (బీఏ) బెనిఫిట్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి  వెనెస్సా మార్గరెట్ ఎలిసబెత్ అహుజా, మేనేజింగ్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అఫైర్స్, బీఏ  స్టెఫెన్ సోట్టుంగ్, బెనిఫిట్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీస్ హెడ్, బీఏ స్టీఫన్ బరానియాక్ తదితరులున్నారు.


జర్మనీలో శ్రామిక శక్తి కొరతను పరిష్కరించడానికి భారతదేశం యొక్క నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ఉపయోగించుకోవడంపై చర్చను ఈ డైలాగ్ కేంద్రీకృతం చేసింది. ఇది గత సంవత్సరం జూన్‌లో జర్మన్ బుండెస్టాగ్ ఆమోదించిన కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టంపై విలువైన అంతర్దృష్టులకు దారితీసింది. అంతేకాకుండా  ఈ సంవత్సరం అమలులో ఉండేందుకు ప్రణాళిక చేయబడింది. ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం మూడు స్పష్టమైన మార్గాలను నిర్దేశిస్తుంది: అర్హతల ద్వారా నిర్దేశించబడిన మార్గం, అనుభవం ద్వారా నిర్దేశించబడిన మార్గం మరియు శ్రామిక శక్తి యొక్క సంభావ్యత ద్వారా రూపొందించబడిన మార్గం. మార్గాలు వరుసగా ఈయూ బ్లూ కార్డ్, ఎక్స్‌పీరియన్స్ కార్డ్ మరియు ఆపర్చునిటీ కార్డ్ ద్వారా అధీకృతం చేయబడ్డాయి.

కొత్త వలస చట్టాన్ని రూపొందించడంలో బీఎంఏఎస్ చేస్తున్న కృషిని అభినందిస్తూ, అధిక ఉపాధి లేదా అప్రెంటిస్‌షిప్ సంభావ్యత ఉన్న రంగాల మ్యాపింగ్, అర్హతల పరస్పర గుర్తింపు, నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామికశక్తిని జర్మనీకి తరలించే యంత్రాంగాన్ని మరింత మెరుగుపరిచే సూచనలను భారత ప్రతినిధి బృందం ముందుకు తెచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీలు) లేదా మైగ్రేషన్ మరియు మొబిలిటీ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (ఎంఎంపీఏ) కోసం ఒక ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం, జర్మనీకి శ్రామిక శక్తి అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ స్థాపన, కొత్త వయస్సు ఉద్యోగాల్లో మహిళల కోసం సహకార ప్రాజెక్టులు మరియు ఇతరులతో పాటు వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం మద్దతు వంటివి ప్రతిపాదించింది.

ఈ సందర్భంగా శ్రీ అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ... భారతదేశం- – జర్మనీ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.  ఇది పరస్పర గౌరవం మరియు బలమైన సాంస్కృతిక సంబంధాలతో గుర్తించబడిందని,  ఇది పునరుత్పాదక శక్తి నుండి విద్య మరియు వృత్తిపరమైన రంగాలలో అభివృద్ధి చెందుతున్న సహకారాలతో శక్తివంతమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిణామం చెందిందన్నారు. జర్మన్మంత్రిత్వశాఖ కోరుకుంటున్నట్లుగా తాము  గ్లోబల్ మొబిలిటీ కోసం భారతీయులకు తగిన శిక్షణ ఇచ్చి చురుకుగా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.  జర్మన్ ప్రతినిధి బృందంతో జరిగిన ఈ సంభాషణ కొత్త మార్గాలను సుగమం చేస్తుందని మరియు భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని కూడా ఆయన అన్నారు.

రెండు దేశాలు ఇండో-జర్మన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల ద్వారా సన్నిహితంగా పని చేస్తున్నాయి మరియు నేటి డైలాగ్ భవిష్యత్ ఒప్పందాలకు బలమైన పునాది మరియు కార్యాచరణ మార్గాలను వేస్తుంది.  ఇది ప్రయోజనకరమైన ఫలితాలకు దారి తీస్తుంది.

***



(Release ID: 2001647) Visitor Counter : 75


Read this release in: English , Hindi