వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఈ-వేలం ద్వారా బహిరంగ మార్కెట్ అమ్మకాల విధానం (స్వదేశీ)లో 71.01 ఎల్ఎంటీ గోధుమలు, 1.62 ఎల్ఎంటీ బియ్యం విక్రయం
Posted On:
31 JAN 2024 6:53PM by PIB Hyderabad
బహిరంగ మార్కెట్లో గోధుమలు, బియ్యం లభ్యతను ఎక్కువ చేసి, ధరలు నియంత్రించడానికి 28.06.2023 నుంచి వారానికి ఒకసారి ఈ-వేలం ద్వారా గోధుమలు, బియ్యంను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. బహిరంగ మార్కెట్ అమ్మకాల విధానం (స్వదేశీ) (ఓఎంఎస్ఎస్(డీ) కింద మొత్తం 101.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. టన్ను ఎఫ్ఏక్యూ గోధుమ రిజర్వ్ ధరను రూ.2150గా , యూ ఆర్ ఎస్ గోధుమ రిజర్వ్ ధరను రూ.2125 గా నిర్ణయించారు. . బియ్యం రిజర్వ్ ధరను క్వింటాలుకు రూ.2900 గా నిర్ణయించారు.
ప్రస్తుత దశలో మొదటి ఈ-వేలం 28.06.2023 న జరిగింది, ఇందులో 0.86 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు బహిరంగ మార్కెట్లో విక్రయించారు. అయితే గోధుమల లభ్యతను పెంచడానికి, బహిరంగ మార్కెట్లో గోధుమల డిమాండ్ ను తీర్చడానికి, ఈ-వేలంలో గోధుమల వీక్లీ ఆఫర్ ను క్రమంగా పెంచుతున్నారు.ప్రారంభ దశలో 2 ఎల్ఎంటీ గోధుమలు విక్రయించారు. ప్రస్తుత వీక్లీ ఆఫర్ 4.5ఎల్ఎంటీ కి పెరిగింది. ఫలితంగా వారాంతపు గోధుమల అమ్మకాలు 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరిగాయి. 24.01.2024 వరకు 71.01 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ఓఎంఎస్ఎస్(డీ) కింద విక్రయించారు.
2023-24 సంవత్సరానికి ఓఎంఎస్ఎస్(డీ) కింద బియ్యం తొలి ఈ-వేలం 2023 జూలై 5న జరిగింది. బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్మకాలను పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం బియ్యం రిజర్వ్ ధరను క్యూటీఎల్ కు రూ.3100 నుంచి రూ.2900 కు తగ్గించింది. బియ్యం కనిష్ట పరిమాణాన్ని 1 మెట్రిక్ టన్నుగా,గరిష్ట పరిమాణాన్ని 2000 మెట్రిక్ టన్నులకు సవరించింది.
ఎఫ్ సీఐ ప్రాంతీయ కార్యాలయాలు క్రమం తప్పకుండా ప్రకటనలు ఇవ్వడం తో బియ్యం అమ్మకాలు క్రమంగా పెరిగాయి. 24.01.2024 వరకు బహిరంగ మార్కెట్లో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విక్రయించారు, ఇది ఒఎంఎస్ఎస్ (డి) కింద ప్రైవేట్ వ్యాపారులకు ఒక సంవత్సర కాలంలో విక్రయించిన పరిమాణం. అంతకుముందు అత్యధికంగా 42000 మెట్రిక్ టన్నుల బియ్యం విక్రయాలు జరిగాయి. .
భారత్ అట్టా పథకం కింద నాఫెడ్/ ఎన్సీసీఎఫ్/ కేంద్రీయ భండార్/ ఎంఎస్సీఎంఎఫ్ఎల్ వంటి సహకార సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం గోధుమలను అందిస్తోంది. ఒఎంఎస్ఎస్ (డి) కింద అందిస్తున్న మొత్తం 101.5 ఎల్ఎంటీ నుంచి ఈ పథకానికి 4 ఎల్ఎంటీ ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఒఎంఎస్ఎస్ (డి) పథకం ఉప పథకం కింద సెమీ గవర్నమెంట్/కోఆపరేటివ్ ఏజెన్సీలు కిలో గోధుమను రూ.21.50కు అందిస్తున్నాయి, దీనిని 16.12.2023 నుంచి కిలోకు రూ.17.15కు సవరించారు. ఈ గోధుమలను కిలోకు రూ.27.50 మించకుండా సాధారణ ప్రజలకు విక్రయిస్తారు.
ఆహార భద్రతను నిర్ధారించడానికి, ధరలను స్థిరీకరించడానికి , వినియోగదారులు, సరఫరాదారుల ప్రయోజనాలు రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోంది.
***
(Release ID: 2001150)
Visitor Counter : 99