విద్యుత్తు మంత్రిత్వ శాఖ
గ్రీన్ కెమికల్స్, గ్రీన్ ప్రాజెక్ట్స్‌లో ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ వ్యూహాత్మక భాగస్వామ్యం
Posted On:
31 JAN 2024 2:44PM by PIB Hyderabad
భారతదేశపు అతిపెద్ద సమీకృత విద్యుత్తు ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ తన బొంగైగావ్ యూనిట్ మరియు ఇతర గ్రీన్ ప్రాజెక్ట్లలో ప్రతిపాదిత వెదురు ఆధారిత బయో-రిఫైనరీలలో భాగస్వామ్య అవకాశాల పరిశీలనకు నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్)తో నాన్-బైండింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఎన్ఆర్ఎల్ అనేది ఆయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఇది పెట్రోలియం ఉత్పత్తుల శుద్ధి మరియు మార్కెటింగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఈ ఒప్పందం ద్వారా రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గ్రీన్ కెమికల్స్లో తమ వ్యాప్తిని పెంచుకోవడానికి.. మరియు దేశం యొక్క నికర-జీరో ఉద్గారాల లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి.. ఈశాన్య ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి స్థిరమైన పరిష్కారాలలోకి ప్రవేశించాలనే భావనకు దోహదం చేస్తుంది. 2024 జనవరి 30న ఎన్టీపీసీ సంస్థ సీఎండీ శ్రీ గురుదీప్ సింగ్ సమక్షంలో అవగాహన ఒప్పందం సంతకం చేయబడింది; ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సీఎండీ & చైర్మన్ ఎన్ఆర్ఎల్ డాక్టర్ రంజిత్ రాత్; మరియు ఎన్ఆర్ఎల్ ఎండీ శ్రీ భాస్కర్ జ్యోతి ఫుకాన్ సమక్షంలో ఈ ఒప్పందం సంతకం చేయబడింది. ఎన్టీపీసీ 2032 నాటికి 60 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉంది. గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎనర్జీ స్టోరేజ్ డొమైన్‌లో ప్రధాన సంస్థగా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, కార్బన్ క్యాప్చర్ & హైడ్రోజన్ మొబిలిటీ వంటి డీకార్బనైజేషన్ దిశగా కంపెనీ అనేక కార్యక్రమాలను చేపడుతోంది.
***
(Release ID: 2001018)
Visitor Counter : 133