భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 'కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల' కొనుగోలుకు 'గోల్డ్‌మన్ సాక్స్ ఇండియా ఏఐఎఫ్ స్కీమ్-1', 'గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఇండియా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఏఐఎఫ్ స్కీమ్-2'కు సీసీఐ ఆమోదం
Posted On:
31 JAN 2024 10:30AM by PIB Hyderabad
ప్రతిపాదిత నిష్పత్తిలో, ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 'కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల'ను కొనుగోలు చేయడానికి 'గోల్డ్‌మన్ సాక్స్ ఇండియా ఏఐఎఫ్ స్కీమ్-1', 'గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఇండియా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఏఐఎఫ్ స్కీమ్-2'కు 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ప్రిఫరెన్స్ షేర్లు కొనుగోలు చేస్తున్న రెండు పథకాలను 'గోల్డ్‌మన్ సాక్స్ ఇండియా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్' ప్రారంభించింది. 1882 ఇండియన్ ట్రస్ట్స్ చట్టం ప్రకారం ట్రస్ట్‌గా ఈ సంస్థ నమోదైంది. ఈ రెండు పథకాలను 'గోల్డ్‌మన్ సాచ్స్ (ఇండియా) ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' నిర్వహిస్తుంది.
ఏపీఐ హోల్డింగ్స్ గ్రూప్‌నకు అంతిమ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్. ఔషధాలు, వైద్య పరికరాలు, ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) ఉత్పత్తుల టోకు వర్తకం, పంపిణీ, ఆరోగ్య పరీక్షల సేవలు, టెలీ-మెడిసిన్ సేవలు సహా భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ రంగంలో వివిధ విభాగాల్లో ఈ గ్రూప్ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి.
సీసీఐ వివరణాత్మక ఆదేశం రావలసివుంది.
***
(Release ID: 2000872)
Visitor Counter : 98