భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 'కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల' కొనుగోలుకు 'మెక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌', 'ఎవల్యూషన్‌ఎక్స్‌ డెట్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ 1 ప్రైవేట్‌ లిమిటెడ్‌'కు సీసీఐ ఆమోదం

Posted On: 31 JAN 2024 10:30AM by PIB Hyderabad

ప్రతిపాదిత నిష్పత్తిలో, ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 'కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల'ను కొనుగోలు చేయడానికి 'మెక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌', 'ఎవల్యూషన్‌ఎక్స్‌ డెట్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ 1 ప్రైవేట్‌ లిమిటెడ్‌'కు 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) ఆమోదం తెలిపింది.

మెక్‌రిట్చీ అనేది ఒక పెట్టుబడుల సంస్థ. పెట్టుబడులు పెట్టడం తప్ప మరే వ్యాపారం చేయదు. ఇది, టెమాసెక్ హోల్డింగ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ (టెమాసెక్) పూర్తి యాజమాన్యంలోని పరోక్ష అనుబంధ సంస్థ. టెమాసెక్‌ దీనికి అంతిమ మాతృ సంస్థ.
సింగపూర్‌ కేంద్రంగా పని చేసే పెట్టుబడుల సంస్థ టెమాసెక్‌. ఆర్థిక సేవలు; రవాణా & పరిశ్రమలు; టెలీకమ్యూనికేషన్స్, మీడియా & సాంకేతికత; వినియోగ విభాగం & స్థిరాస్తి వ్యాపారం; లైఫ్ సైన్సెస్ & వ్యవసాయ ఆహారం; రుణాలు వంటి చాలా రంగాలకు కూడా టెమాసెక్ విస్తరించింది.

బీడీఎస్‌ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్, టెమాసెక్ కలిసి ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థ ఎవల్యూషన్‌ఎక్స్‌. ఈ కంపెనీ రుణాలను మంజూరు చేస్తుంది. సింగపూర్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. భారత్‌, చైనా, ఆగ్నేయాసియాపై ప్రత్యేక దృష్టితో, అన్ని  ఆసియా దేశాల్లో రుణ వ్యాపారం చేస్తోంది.

ఏపీఐ హోల్డింగ్స్ గ్రూప్‌నకు అంతిమ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్‌. ఔషధాలు, వైద్య పరికరాలు, ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) ఉత్పత్తుల టోకు వర్తకం, పంపిణీ, ఆరోగ్య పరీక్షల సేవలు, టెలీ-మెడిసిన్‌ సేవలు సహా భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ రంగంలో వివిధ విభాగాల్లో ఈ గ్రూప్‌ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి.

సీసీఐ వివరణాత్మక ఆదేశం రావలసివుంది.

 

***


(Release ID: 2000869) Visitor Counter : 82


Read this release in: English , Urdu , Hindi