భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

యువ‌శాస్త్ర‌వేత్త‌ల ఇండ‌క్ష‌న్ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ప్రారంభం

Posted On: 31 JAN 2024 2:02PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాన శాస్త్రీయ స‌ల‌హాదారు కార్యాల‌యం (ఆఫీస్ ఆప్ పీఎస్ఎ)తో క‌లిసి కెపాసిటీ బిల్డింగ్ క‌మిష‌న్ (సిబిసి- సామ‌ర్ధ్య నిర్మాణ క‌మిష‌న్‌) 29 జ‌న‌వ‌రి 2024 ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖ‌ప‌ట్నం (ఐఐఎం-V)లో యువ శాస్త్ర‌వేత్త‌ల ఇండ‌క్ష‌న్ (స‌మీక‌ర‌ణ/  నియామ‌క‌) శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. శాస్త్ర‌, సాంకేతిక కార్య‌క్ర‌మాలు, ప్రాజెక్టులు, ఉత్ప‌త్తులు, వ్య‌క్తులను నిర్వ‌హించ‌డంలో యువ‌శాస్త్ర‌వేత్త‌లు, శాస్త్రీయ నిర్వాహ‌కుల సామ‌ర్ధ్యాల‌ను మెరుగుప‌ర‌చేందుకు ఉద్దేశించిన తొలి శిక్ష‌ణా కార్య‌క్ర‌మం.  పాలుపంచుకుంటున్న‌వారి భావ‌న‌ల ప‌ర‌ఫ‌ల‌దీక‌ర‌ణాన్ని ప్రోత్స‌హించ‌డం; అత్యాధునిక‌, భ‌విష్య‌త్‌త‌ర‌పు ప‌రిశోధ‌న‌, సాంకేతిక భావ‌న‌ల‌కు ఆచ‌ర‌ణాత్మ‌క అవ‌గాహ‌న‌, క్రియాశీల‌క‌, ప్ర‌వ‌ర్త‌నాత్మ‌క‌, డొమైన్ నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డం దీని ల‌క్ష్యాల‌లో కొన్ని.
శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌లో యువ శాస్త్ర‌వేత్త‌ల‌కు మొద‌టి, శీఘ్ర కెరీర్ శిక్ష‌ణా అవ‌కాశాల‌ను సంస్థాగ‌తీక‌రించ‌డానికి శాస్త్ర‌, సాంకేతిక రంగం స‌హాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జి) డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ఆదేశాల మేర‌కు ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింది. 
ఇది వ్యూహం, విధాన నైపుణ్యాలు, సంస్థాగ‌త నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్‌, సామాజిక ఔచిత్య నైపుణ్యాల వంటి అంశాల‌ను ప‌రిశోధించే ఆన్‌లైన్‌, క్యాంప‌స్ కార్య‌క‌లాపాల మిశ్ర‌మంతో ఐఐఎం-V రూపొందించి, నిర్వ‌హిస్తున్న హైబ్రిడ్ శిక్ష‌ణా మాడ్యూల్‌. 
యాంత్రికంగా ఉత్ప‌త్తి అయిన వీడియో కాన్ఫ‌రెన్స్ వివ‌ర‌ణ స్క్రీన్‌షాట్ (లాంచ్ ఆప్ యంగ్ సైంటిస్ట్స్ ఇండ‌క్ష‌న్ ప్రోగ్రాం) 
ఇందులో పాలుపంచుకుంటున్న వారంద‌రికీ ఐఐఎం వైజాగ్ డైరెక్ట‌ర్ ప్రొ.ఎం. చంద్ర‌శేఖ‌ర్ ఆహ్వానం ప‌లికి, ఈ కార్య‌క్ర‌మం, వ‌క్త‌ల గురించి సంక్షిప్తంగా వివ‌రించారు. వివిధ శిక్ష‌ణామాడ్యూళ్ళ‌ను బోధించేందుకు దేశం న‌లుమూల‌ల నుంచి నిపుణుల‌ను నియ‌మించామ‌ని, దీనిని ప్ర‌భుత్వ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా అంతిమంగా ఐజిఒటి వేదిక‌లో అప్‌లోడ్ చేస్తామ‌ని తెలిపారు. దీని అనంత‌రం, కెపాసిటీ బిల్డింగ్ క‌మిష‌న్ కార్య‌ద‌ర్శి శ్రీ శ్యామ ప్ర‌సాద్ రాయ్ సేవ‌ల‌ను అందించే వ్య‌వ‌స్థ నుంచి భాగ‌స్వామ్య ప్ర‌భుత్వ యంత్రాంగంగా ప్ర‌భుత్వం ప‌రిణామం చెంద‌డం గురించి ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. డిమాండ్ - స‌ర‌ఫ‌రా మ‌ధ్య ఉన్న అంత‌రాల‌ను హేతుబ‌ద్ధం చేసేందుకు ప్ర‌భుత్వ వ్యాప్తంగా నిర్వ‌హించే కార్య‌క‌లాపాల‌ను, పాల‌నాప‌ర‌మైన ల‌క్ష్యాల‌ను సాధించ‌డం గురించి,సామ‌ర్ధ్య నిర్మాణం కోసం వివిధ శిక్ష‌ణా మాడ్యూళ్ళ‌ను విస్త్ర‌తంగా అందుబాటులో ఉంచడంలో ఐజిఒటి వేదిక పాత్ర స‌హా ప్ర‌త్యేక సామ‌ర్ధ్య నిర్మాణ నమూనాల అమ‌లు గురించి వివ‌రించారు. 
అన్ని శాస్త్రీయ విభాగాలు, ప్ర‌యోగాలు త‌మ సిబ్బంది నైపుణ్యాల‌ను, నూత‌న త‌ర‌పు సామ‌ర్ధ్యాల‌ను అందింపుచ్చుకునేందుకు వీలుగా త‌మ ద్వారాల‌ను తెరిచి ఉంచాల‌ని త‌న కీల‌కోప‌న్యాసంలో పిఎస్ఎ కార్యాల‌యంలో గౌర‌వ విశిష్ట స‌భ్యుడు డాక్ట‌ర్ అర‌బింద మిత్ర  సూచించారు. ఇది శాస్త్ర‌, సాంకేతిక‌, న‌వీన సాంకేతిక‌త‌ల‌ను ఉప‌యోగించి ప్ర‌జ‌ల, ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలోనే కాక‌ స‌మ‌కాలీన జాతీయ ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో కీల‌కం అని అన్నారు. 
యువ శాస్త్ర‌వేత్త‌ల కోసం సామ‌ర్ధ్య నిర్మాణ కార్య‌క్ర‌మం అనేది జాతీయ ప్రాధాన్య‌త క‌లిగిన మిష‌న్‌ల‌ను అందించ‌డానికి త‌మ ప‌ని ప‌థానికి సంబంధించి వారి ఆలోచ‌న‌నా విధానాన్ని తిరిగి అంచ‌నా వేసుకొని, త‌మ ఆలోచ‌న‌ల‌ను తిరిగి అంచ‌నా వేసుకుని, స‌మ‌లేఖ‌నం చేసుకోవ‌డానికి తోడ్ప‌డే ఒక కీల‌క క్ష‌ణ‌మ‌ని పిఎస్ఎ కార్యాల‌యం శాస్త్రీయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ప‌ర్వీంద‌ర్ మెయినీ అన్నారు. సాంకేతిక క్షేత్రం వేగంగా ప‌రిణామం చెందుతున్న కార‌ణంగా,  దానికి సంబంధించిన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌, శిక్ష‌ణ‌, అభ్యాసం అన్న‌ నిరంత‌ర ప్ర‌క్రియ‌ భ‌విష్య‌త్ శాస్త్రీయ సిబ్బందిని సాధికారం చేసేందుకు తోడ్ప‌డుతుంద‌న్నారు. ఇది స్థానిక‌, ప్ర‌పంచ స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించేందుకు నూత‌న సాంకేతిక‌త‌ల‌ను, ఉత్ప‌త్తుల‌ను,  ప‌రిష్కారాల‌ను సృష్టించ‌డాన్ని వేగ‌వంతం చేస్తూ, దేశ సామాజిక‌- ఆర్ధిక వృద్ధిని సాధించేందుకు తోడ్ప‌డుతుంద‌ని వివ‌రించారు. 
ఈ కార్య‌క్ర‌మానికి మొద‌టి బృందం డిపార్ట్ మెంట్ ఆఫ్  సైన్స్ అండ్ టెక్నాల‌జీ (డిఎస్‌టి), డిపార్ట్‌మెంట్ ఆప్ బ‌యోటెక్నాల‌జీ (డిబిటి), కౌన్సిల్ ఫ‌ర్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్‌), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ (డిఎఇ), ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్‌), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఒ)కు చెందిన వివిధ ప్ర‌యోగ‌శాల‌లు, కేంద్రాల‌కు చెందిన 55 యువ శాస్త్ర‌వేత్త‌లు హాజ‌ర‌య్యారు. నిపుణుల ప‌ర‌స్ప‌ర చ‌ర్య‌, ప్ర‌యోగ‌శాల‌లు, ప‌రిశోధ‌నా కేంద్రాల సంద‌ర్శ‌న‌లు, స‌హ‌కార ప్ర‌యోగాలు మొద‌లైన నాలుగు మాడ్యూళ్ళ‌లో ఇందులో పాలుపంచుకునేవారు శిక్ష‌ణ పొందాలి. దేశ‌వ్యాప్తంగా ఉన‌న్న శాస్త్రీయ శ్రామిక శ‌క్తిని క‌లుపుకోవ‌డానికి ఐఐఎం-V ఏడాది మొత్తానికి క్యాలెండ‌ర్‌ను అభివృద్ధి చేస్తోంది. 

***



(Release ID: 2000866) Visitor Counter : 93


Read this release in: Urdu , English , Hindi , Telugu