సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఆఫ్రికన్ ప్రాంత సివిల్ సర్వెంట్ల కోసం ప్రజా విధానం మరియు పాలన పై రెండు వారాల అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ముస్సోరీలో ప్రారంభించబడింది.
ఆరు దేశాల నుంచి పర్మినెంట్ సెక్రటరీలు, డిప్యూటీ పర్మనెంట్ సెక్రటరీలతో సహా 36 మంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
వి.శ్రీనివాస్, కార్యదర్శి డిఎఆర్‌పిజి మరియు డిజి ఎన్‌సిజిజి ప్రారంభోపన్యాసం చేశారు
Posted On:
23 JAN 2024 3:20PM by PIB Hyderabad
నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సీ జి జి), భారత ప్రభుత్వ అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్త సంస్థ, ఆఫ్రికన్ ప్రాంత సివిల్ సర్వెంట్ల కోసం రెండు వారాల అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను 22-01-2024 మధ్యాహ్నం ప్రారంభించింది. ఎరిట్రియా, కెన్యా, ఇథియోపియా, టాంజానియా, గాంబియా మరియు ఈశ్వతిని అనే ఆరు దేశాల నుండి 36 మంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ప్రారంభ సమావేశంలో డీ ఏ పి ఆర్ జి కార్యదర్శి మరియు ఎన్ సీ జి జి డైరెక్టర్ జనరల్ శ్రీ వీ . శ్రీనివాస్ ప్రసంగించారు. వీ. శ్రీనివాస్ తన ప్రసంగంలో, పాల్గొనే దేశాల నుండి మంత్రిత్వ శాఖల సిఫార్సుల ఆధారంగా కార్యక్రమాన్ని శ్రద్ధ గా నిర్వహించడాన్ని హైలైట్ చేశారు. సామర్ధ్య నిర్మాణ శిక్షణ ప్రోగ్రామ్ భూమి నిర్వహణ, భూమి పత్రాలు డిజిటలీకరణ, పట్టణ భూమి నిర్వహణ, స్వామిత్వ పథకం, గ్రామీణ ఆస్తి సర్వే కార్యక్రమాలు మరియు భూమి పత్రాలు ఆధునీకరణ కార్యక్రమం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, పీ ఎం గతి శక్తి మొదలైనవాటిపై ప్రత్యేక దృష్టి తో ఉపన్యాసాలు వున్నాయి. డిజిటల్ పరివర్తనకు భారతదేశం యొక్క నిబద్ధత, పౌరులను ప్రభుత్వానికి చేరువ చేయడంలో సాంకేతికత పాత్రను వి.శ్రీనివాస్ హైలైట్ చేశారు. భారతదేశం యొక్క "గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం" యొక్క విధానం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులను మరియు ప్రభుత్వాన్ని చేరువగా తీసుకురావడానికి అత్యధిక పౌరుల డిజిటల్ సాధికారత మరియు సంస్థల డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించింది. సీ పీ గ్రామ్స్, సచివాలయ సంస్కరణలు మరియు ఇ-సేవలపై దృష్టి సారించి సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్ సర్వీస్ పోర్టల్స్ ద్వారా సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం ద్వారా భారతదేశం లో 16000కు పైగా సేవలను ఇ-సేవలుగా అందించడం ద్వారా మిలియన్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూర్చింది. భారతదేశం యొక్క పురోగతిని,భూ సంస్కరణలు, అవినీతి పై అసహనత మరియు పరిపాలనలో నైతికత ఈ సామర్ధ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం ద్వారా ప్రతినిధులకు అందించడానికి ప్రయత్నిస్తుంది.
గాంబియా, భారతదేశం మరియు ఎన్ సీ జి జి మధ్య విజ్ఞాన-భాగస్వామ్య సహకారానికి గాంబియా డిప్యూటీ హై కమీషనర్ మిస్టర్ లామిన్ ఇ సింఘాతే కృతజ్ఞతలు తెలిపారు. నేటి ప్రపంచంలో వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఎదుగుదల కోసం నిరంతర అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
ఎన్ సీ జి జి లో కోర్స్ కోఆర్డినేటర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఏ.పి సింగ్ శిక్షణ లో కవర్ చేయబడే విభిన్న అంశాల గురించి వివరిస్తూ రెండు వారాల కార్యక్రమం యొక్క సమగ్ర అవలోకనాన్ని అందించారు. కార్యక్రమంలో పాలనా నమూనాలు, గృహనిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ, సుపరిపాలన కోసం ఆధార్, భూ రికార్డుల ఆధునీకరణ, ప్రభుత్వ సేకరణలో పారదర్శకత, గ్రామీణ ఆస్తి సర్వే కార్యక్రమాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, సమర్థవంతమైన కార్యాలయ పరిపాలన, వాతావరణ మార్పు విధానాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, వ్యవసాయంపై సెషన్‌లు ఉంటాయి. భారతదేశ పబ్లిక్ పాలసీ దృక్కోణాలు మరియు భారతదేశం-ఆఫ్రికా సంబంధాలతోపాటు పీ ఎం సంగ్రహాలయ, డీ ఎం ఆర్ సి, ఎయిమ్స్ మరియు తాజ్ మహల్ సందర్శన సంస్థాగత సందర్శనలు ఈ శిక్షణ లో వుంటాయి.
కెపాసిటీ-బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.పీ సింగ్, అసోసియేట్ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ముఖేష్ భండారీ, ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ సంజయ్ దత్ పంత్ మరియు ఎన్ సీ జి జి యొక్క అంకితమైన కెపాసిటీ బిల్డింగ్ టీమ్ పర్యవేక్షిస్తారు.
****
(Release ID: 1998828)
Visitor Counter : 125