రక్షణ మంత్రిత్వ శాఖ
ఉమ్మడి విన్యాసాలు సైక్లోన్‌లో పాలుపంచుకునేందుకు ఈజిప్టు చేరుకున్న భారత సైన్యపు ప్రత్యేక దళాలు
Posted On:
22 JAN 2024 4:02PM by PIB Hyderabad
భారత్- ఈజిప్ట్ ఉమ్మడి ప్రత్యేక దళాల విన్యాసాలు రెండవ ఎడిషన్ అయిన సైక్లోన్‌లో పాలుపంచుకునేందుకు 25మంది సిబ్బందితో కూడిన భారతీయ సైనిక దళం ఈజిప్టు చేరుకుంది. ఈ విన్యాసాలను 22 జనవరి నుంచి 1 ఫిబ్రవరి 2024 వరకు ఈజిప్టులోని అన్షాస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల తొలి ఎడిషన్‌ను గత ఏడాది భారతదేశంలో నిర్వహించారు. భారతీయ దళాలు పారాచూట్ రెజిమెంట్ (ప్రత్యేక దళాల) కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 25మంది సిబ్బందితో కూడిన ఈజిప్టు దళం ఈజిప్టు కమెండో స్క్వాడ్రన్ & ఈజిప్టు ఎయిర్‌బార్న్ ప్లాటూన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి చాప్టర్ VII కింద ఎడారులు/ పాక్షిక ఎడారి భూభాగంలో ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహించడంలో ఒకరి కార్యాచరణ విధానాలు మరొకరికి పరిచయం చేయడం ఈ విన్యాసాల లక్ష్యం.
సైక్లోన్ విన్యాసాన్ని ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని అభివృద్ధి చేసేందుకు, చర్చలు, వ్యూహాత్మక సైనిక కసరత్తుల అభ్యాసాల ద్వారా ఇరు సైన్యాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు రూపొందించారు.
ఈ విన్యాసాలు సంప్రదాయేతర రంగంలో ప్రత్యేక ఆపరేషన్ల ప్రణాళికలు, అమలు కలిగి ఉంటాయి. అవి మూడు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో సైనిక ప్రదర్శనలు, వ్యూహాత్మక సంభాషణలు, రెండవ దశలో ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి) , కౌంటర్ ఐఇడి, యుద్ధంలో ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ ఉంటుంది. మూడవది, అంతిమ దశలో ఉమ్మడి వ్యూహాత్మక బిల్ట్ ఆప్ ప్రాంతాలలో పోరాటం, బందీల రక్షణ పరిస్థితుల ఆవరించి, వాటి ఆధారంగా ఉమ్మడి వ్యూహాత్మక విన్యాసాలు ఉంటాయి.
ఈ విన్యాసాలు ఇరు దళాలకు తమ బంధాన్ని బలోపేతం చేసుకొని, ఉత్తమ కార్యాచరణను పంచుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక, పంచుకున్న భద్రతా లక్ష్యాలను సాధించి, రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు ఒక వేదికగా పని చేస్తుంది.
(Release ID: 1998795)
Visitor Counter : 157